ఊహించని రీతిలో వచ్చిన వరదలు టెక్సాస్‌ను అతలాకుతలం చేశాయి. నెలల పాటు కురవాల్సిన వర్షమంతా కొన్ని గంట్లోనే కురవడంతో టెక్సాస్ హడలెత్తిపోయింది. ఏకధాటిగా కుండపోత వర్షం కురవడంతో గ్వాడాలుపే నది ఒక్కసారిగా ఉప్పొంగడంతో సెకన్ల వ్యవధిలోనే వరదలు ముంచెత్తాయి. ప్రజలు తేరుకునేలోపే ముంచేశాయి. ఇందుకు సంబంధించిన దృశ్యాలు వైరల్ అవుతున్నాయి.
ఇది కూడా చదవండి: Sekhar Kammula: ఇంతవరకూ వారితో తిట్లు పడలేదు– శేఖర్ కమ్ముల
అగ్రరాజ్యం అమెరికాలోని టెక్సాస్‌లో కుండపోత వర్షాలు కురిశాయి. ఏకధాటిగా కురిసిన వర్షాలకు టెక్సాస్ అల్లాడిపోయింది. నగరాన్ని నగరాన్నే ముంచెత్తేసింది. ఒక్కసారిగా వరదలు రావడంతో సమ్మర్ క్యాంప్‌ల్లో ఉన్నవారంతా కొట్టుకుపోయారు. ఇప్పటి వరకు 82 మంది చనిపోయారు. ఇంకా చాలా మంది గల్లంతయ్యారు. మృతుల సంఖ్య మరింత పెరగొచ్చు. ఇక బాధితుల కోసం భార్య మెలానియా, తాను ప్రార్థిస్తున్నట్లు ట్రంప్ పేర్కొన్నారు. సహాయ బృందాలు వరద బాధితులకు సాయం చేస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: AP Crime: ప్రాణం తీసిన చికెన్ పకోడీ..! యువకుడి దారుణ హత్య..
అతి భారీ వర్షాలు కురవడంతో గ్వాడాలుపే నది కేవలం 45 నిమిషాల్లోనే 26 అడుగులు ( 8 మీటర్లు) పెరిగింది. దీంతో ఒక్కసారిగా వరదలు ముంచెత్తాయి. నేటికీ వర్షాలు కురుస్తున్నాయని.. ఇప్పటి వరకు 59 మంది చనిపోయారని.. దురదృష్టవశాత్తు ఆ సంఖ్య ఇంకా పెరుగుతుందని లెఫ్టినెంట్ గవర్నర్ డాన్ పాట్రిక్ పేర్కొన్నారు. మరోవైపు అధికారులు రంగంలోకి దిగి సహాయ చర్యలు కొనసాగిస్తున్నారు.

జూలై 4వ తేదీ నుంచి వరదలు ప్రారంభమయ్యాయి. నెలల తరబడి కురవాల్సిన వర్షమంతా కొన్ని గంటల్లోనే కురిసేశాయి. వాతావరణ శాఖ కూడా అంచనా వేయలేకపోయింది. ఇక వాతావరణ శాఖలో కూడా ఉద్యోగుల కొరత కూడా ఏర్పడింది. ముందస్తు హెచ్చరికలు రాకపోవడానికి కారణం కూడా ఇదొకటి. తాజాగా మరిన్ని వర్షాలు కురుస్తాయని జాతీయ వాతావరణ సేవ (NWS) పేర్కొంది. నదులు, వాగులు, ఇతర లోతట్టు ప్రాంతాలు వరదలకు గురయ్యే అవకాశం ఉందని చెప్పింది.
Timelapse flooding of the Llano River on July 4th pic.twitter.com/59Tnn6NZG7
— Rob Dew (@DewsNewz) July 5, 2025
❗️UPDATE: 37 now DEAD in Texas floods — AP https://t.co/6byrF9m3MP pic.twitter.com/GxJOO5L7TR
— RT (@RT_com) July 5, 2025
Capsized RVs drift in Texas fatal floods https://t.co/ohCPUb7uMD pic.twitter.com/o531TTCh94
— RT (@RT_com) July 6, 2025
Flood Waters devastate the Guadalupe River area in Texas as emergency crews continue search and rescue operations.#TexasFlood #Texas pic.twitter.com/aXOWQDiOmZ
— Dr. Kiran J Patel (@Drkiranjpatel) July 6, 2025