అమెరికాతో వాణిజ్య చర్చలు నడుస్తున్నాయని వాణిజ్య శాఖ ప్రత్యేక కార్యదర్శి రాజేష్ అగర్వాల్ గురువారం తెలిపారు. భారతదేశం-అమెరికా ద్వైపాక్షిక వాణిజ్య ఒప్పందంలో అగర్వాల్ ముఖ్య సంధానకర్తగా ఉన్నారు. ఇప్పటికే పలుమార్లు అమెరికాతో వాణిజ్య చర్చలు జరిపారు. త్వరలోనే ఒక కొలిక్కి అవకాశం ఉన్నట్లు కనిపిస్తోంది. వాస్తవానికి ట్రంప్ విధించిన డెడ్‌లైన్ గడువు జూలై 9తో ముగిసిపోయింది. అయితే కొన్ని దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు పొడిగించారు. అయితే అమెరికా.. భారత్‌లో వ్యవసాయం, పాడి పరిశ్రమపై మినహాయింపులు కోరుతోంది. ఈ రెండు కూడా భారతదేశంలో చాలా సెంటిమెంట్. ఈ నేపథ్యంలోనే ఇరు దేశాల మధ్య వాణిజ్య చర్చలు సందిగ్ధంలో పడ్డాయి.
ఇది కూడా చదవండి: Drugs Racket Busted: మల్నాడ్ రెస్టారెంట్ డ్రగ్స్ పార్టీ కేసులో ‘ఈగల్ టీం’ దూకుడు.. 9 పబ్స్పై కేసు నమోదు!
తాజాగా ఇదే అంశంపై గురువారం రాజేష్ అగర్వాల్ స్పందించారు. ఎగుమతి లాజిస్టిక్స్‌పై జరిగిన కార్యక్రమంలో అగర్వాల్ వాణిజ్య ఒప్పందాలపై మాట్లాడారు. అమెరికా-భారత్ మధ్య వాణిజ్య ఒప్పందాన్ని ఖరారు చేయడానికి భారతదేశం ప్రయత్నిస్తోందని చెప్పారు. ఈ ఒప్పందం యొక్క మొదటి దశను సెప్టెంబర్-అక్టోబర్ నాటికి ముగించడానికి లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. భారతదేశం ఇప్పటి వరకు 26 దేశాలతో 14కి పైగా స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలు అమలు చేసిందని అగర్వాల్ అన్నారు. ప్రస్తుతం ప్రధాన మార్కెట్లతో అనుసంధానం అవుతున్నామని.. ఇప్పటికే యూకేతో ఒక ఒప్పందాన్ని ముగించినట్లు పేర్కొన్నారు. యూరోపియన్ యూనియన్‌తో కూడా చర్చల దశలో ఉన్నట్లు తెలిపారు.
ఇది కూడా చదవండి: Story Board: మహిళా రిజర్వేషన్ బిల్లు.. చట్టసభలన్నింటికీ రిజర్వేషన్ వర్తిస్తుందా?
ఇక భారతదేశం.. చిలీ, పెరూ వంటి లాటిన్ అమెరికన్ దేశాలతో కూడా వాణిజ్య ఒప్పందాలపై చర్చలు జరుపుతున్నట్లు చెప్పుకొచ్చారు. ఆస్ట్రేలియా, యూఏఈలతో వాణిజ్య ఒప్పందాలు ఉన్నాయని.. న్యూజిలాండ్‌తో కూడా చర్చలు జరుపుతున్నట్లు వెల్లడించారు. ప్రధాన ఆర్థిక వ్యవస్థలతో పెద్ద ఎత్తున ఒప్పందాలు చేసుకోబోతున్నట్లు ఆయన చెప్పుకొచ్చారు.
ఏప్రిల 2న ట్రంప్.. ఆయా దేశాలపై సుంకాలు విధించారు. అయితే ఆయా దేశాల నుంచి వ్యతిరేకత వ్యక్తమవ్వడంతో ఈ నిర్ణయాన్ని మూడు నెలల పాటు తాత్కాలికంగా వాయిదా వేశారు. అయితే ఆ డెడ్‌లైన్ మొన్న జూలై 9తో ముగిసింది. ఈ మేరకు ఆయా దేశాలను హెచ్చరిస్తూ లేఖలు కూడా రాశారు. ఇక రెండు మిత్ర దేశాలకు ఇప్పటికే సుంకాలు విధించారు. మిగతా దేశాలకు ఆగస్టు 1 వరకు గడువు విధించారు. ఈలోపు అమెరికాతో ఒప్పందాలు చేసుకోవాలని సూచించారు. ప్రస్తుతం అమెరితో యూకే, వియత్నాం మాత్రమే ఒప్పందాలు చేసుకున్నాయి. చైనా మాత్రం పరస్పరం తాత్కాలింగా తగ్గించుకోవాలని నిర్ణయం తీసుకున్నాయి.