Telangana Assembly : ఈ నెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు.. ఈనెల 20న బడ్జెట్..
- ఈనెల 30 వరకు అసెంబ్లీ సమావేశాలు
- మార్చి 20న రాష్ట్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న ప్రభుత్వం
- పండుగల కారణంగా మధ్యలో సభకు సెలవులు
- ఆదివారం కూడా సభ నిర్వహించే యోచన
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Telangana Assembly Bugdet Sessions : తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ సమావేశాల నిర్వహణపై అసెంబ్లీ స్పీకర్ అధ్యక్షతన జరిగిన బీఏసీ సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయం ప్రకారం, బడ్జెట్ సమావేశాలను ఈ నెల 30వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, ప్రజా సమస్యలు , కొత్త బడ్జెట్ ప్రతిపాదనలపై ఈ సమావేశాల్లో సుదీర్ఘంగా చర్చించనున్నారు. ప్రభుత్వం ఈ నెల 20వ తేదీన అసెంబ్లీలో రాష్ట్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టనుంది. ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం అమలు చేస్తున్న ఆరు గ్యారంటీలు, ఇతర సంక్షేమ పథకాలకు భారీగా నిధులు కేటాయించే అవకాశం ఉందని తెలుస్తోంది.
Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!
Also Read
- CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
- Mallu Bhatti Vikramarka: హైదరాబాద్‌లో ప్రపంచస్థాయి స్టేడియం.. తెలంగాణను క్రీడా హబ్‌గా మారుస్తాం..
- Kidnap: హైదరాబాద్ టోలిచౌకి పరిధిలో దారుణం.. బాలిక కిడ్నాప్, విక్రయం..
- Telangana Govt: వియత్నాంకు 40 మంది ఉపాధ్యాయులు, అధికారుల బృందం.. ఎందుకంటే..
సమావేశాల మధ్యలో ఉగాది, రంజాన్ , శ్రీరామనవమి వంటి ప్రధాన పండుగలు వస్తుండటంతో ఆయా రోజుల్లో సభకు సెలవులు ప్రకటించారు. ఈ సెలవుల కారణంగా పనిదినాలు తగ్గకుండా ఉండేందుకు, ప్రభుత్వం ఈ నెల 29వ తేదీ ఆదివారం నాడు కూడా సభను నిర్వహించాలని యోచిస్తోంది. ప్రభుత్వ అజెండాతో పాటు ప్రజా సమస్యలపై చర్చించేందుకు తగిన సమయం ఇవ్వాలని ప్రతిపక్షాలు కోరుతుండగా, సభను అర్థవంతంగా నిర్వహించేందుకు సిద్ధంగా ఉన్నామని ప్రభుత్వం ప్రకటించింది. మొత్తం మీద మార్చి 30 వరకు జరగనున్న ఈ సమావేశాలు రాజకీయంగా అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి.
Moinabad: ఫామ్‌హౌస్ డ్రగ్స్ పార్టీ కేసు.. రిమాండ్ రిపోర్టులో సంచలన వివరాలు.!
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!