Trump: భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- భారత్‌తో వాణిజ్య ఒప్పందంపై ట్రంప్ కీలక వ్యాఖ్యలు
- త్వరలోనే కీలక ఒప్పందం జరగబోతున్నట్లు వెల్లడి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అమెరికాతో వాణిజ్య ఒప్పందం చేసుకోవడానికి భారత్ చాలా దగ్గరగా ఉందని ట్రంప్ తెలిపారు. బహ్రెయిన్ క్రౌన్ ప్రిన్స్ సల్మాన్ బిన్ హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో జరిగిన ద్వైపాక్షిక సమావేశంలో ట్రంప్ విలేకరులతో మాట్లాడారు. ఆగస్టు 1 ఒక ముఖ్యమైన రోజు అవుతుందని.. ఆ రోజు తన దేశానికి చాలా డబ్బు వస్తుందని వ్యాఖ్యానించారు. సుంకాలపై ట్రంప్ విధించిన గడువు దగ్గర పడుతోంది. ఆగస్టు 1తో ఆ గడువు ముగుస్తుంది. ఈ నేపథ్యంలో భారత్ ఒప్పందం చేసుకోవడానికి చాలా దగ్గరగా ఉందని ట్రంప్ పేర్కొ్న్నారు.
ఇది కూడా చదవండి: Earthquake: అలస్కాలో 7.3 తీవ్రతతో భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ
Also Read
- Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
- Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
- Israeli-Lebanon: లెబనాన్‌పై ఇజ్రాయెల్ దాడి.. 12 మంది మృతి
- Russia-Ukraine Peace Talks: శాంతి దిశగా రష్యా, ఉక్రెయిన్.. క్రెమ్లిన్ కీలక ప్రకటన..
త్వరలో భారత్‌తో కొత్త వాణిజ్య ఒప్పందం కుదుర్చుకోబోతున్నట్లు ట్రంప్ సంకేతాలు ఇచ్చారు. ప్రస్తుతం అమెరికా-భారత్ మధ్య చర్చలు జరుగుతున్నాయని సూచించారు. భారత మార్కెట్లలోకి ప్రవేశం కల్పించే ఒప్పందంపై అమెరికా పనిచేస్తోందని పేర్కొ్న్నారు. ఇక ఇండోనేషియాతో కొత్త వాణిజ్య ఒప్పందాన్ని కూడా ప్రకటించారు. ఇండోనేషియా 19 శాతం సుంకాన్ని ఎదుర్కొంటున్నట్లు చెప్పారు.
ఇది కూడా చదవండి: Minister Nadendla Manohar: జగన్ వర్క్ ఫ్రమ్ బెంగళూరు.. నెలకోసారి వచ్చి అల్లర్లు చేస్తారు..!
ఇక భారత్-అమెరికా మధ్య ఐదో రౌండ్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు నడుస్తున్నాయి. రెండు దేశాల మధ్య నిబంధనల ప్రకారం చర్చలు జరుగుతున్నట్లుగా భారత ప్రభుత్వ అధికారులు చెబుతున్నారు. అగ్ర రాజ్యం.. వ్యవసాయం, పాడి పరిశ్రమలపై మినహాయింపులు కోరుతోంది. ఇందుకు భారత ప్రభుత్వం అంగీకరించట్లేదు. కారణం ఏంటంటే.. వ్యవసాయం, పాడి పరిశ్రమ అనేది భారతీయులకు సెంటిమెంట్. ఒకవేళ అమెరికా ఒత్తిడికి తలొగ్గి మినహాయింపులు ఇస్తే.. వ్యవసాయం, పాడి పరిశ్రమ దెబ్బతినే పరిస్థితులు కనిపిస్తాయి. అందుకే ఈ విషయంలో భారత్ తాత్సారం చేస్తోంది. అయితే ట్రంప్ విధించిన గడువు మాత్రం దగ్గర పడుతోంది. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయి. ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాలి.
తాజావార్తలు
-
New Mobile Launched: 10.2 ఇంచుల భారీ స్క్రీన్.. టాబ్లెట్లా మారిపోయే హువావే కొత్త స్మార్ట్‌ఫోన్ విడుదల..
-
Germany: జర్మనీలో రాజకీయ సంచలనం.. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత తొలిసారి ‘ఫార్-రైట్’ పార్టీ ఘన విజయం!
-
Sardar 2: ‘సర్దార్ 2’ చూసి షాక్ అవుతారు.. కానీ ఆలోచించాల్సింది ఇదే: ఎస్.జే. సూర్య
-
Mojtaba Khamenei: లండన్‌లో మొజ్తబా ఖమేనీ ఇల్లు వేలం.. ఖరీదు ఎంతంటే..!
-
Naga Vamsi: హీరోయిన్ల లైఫ్‌లోకి స్పైగా వెళ్తానన్న నాగవంశీ.. అసలు ఎందుకీ కామెంట్ చేశారంటే!
ట్రెండింగ్
-
93 గంటల ఆడియో ప్లేబ్యాక్, 120Hz డిస్ప్లే, 50MP కెమెరాతో iQOO Z11xa 5G లాంచ్.. ధర కూడా తక్కువే.!
-
KKR Captain: టీమిండియా నుంచి తప్పించారు.. కట్ చేస్తే కప్ కొట్టాడు.. ఇప్పుడు కేకేఆర్కే బాస్..!
-
Rajat Patidar: ఇంకెవరి సపోర్ట్ అవసరం లేదు.. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ షాకింగ్ కామెంట్స్!
-
లగ్జరీ లుక్‌తో Tecno కొత్త ఫోన్.. Tonino Lamborghini ఎడిషన్‌లో అదిరిపోయే ఫీచర్లు.!
-
స్వరోవ్స్కీ క్రిస్టల్స్‌తో Motorola Razr స్పెషల్ ఎడిషన్.. లగ్జరీ లుక్‌తో ఫ్లిప్ ఫోన్ అదుర్స్ అంతే.!