తెలంగాణ శాసన మండలి ఛైర్మన్, డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పోస్టులను ఒకేసారి భర్తీ చేస్తారని ఆ మధ్య ప్రచారం జరిగింది. కానీ.. గుత్తా సుఖేందర్‌రెడ్డి ఒక్కరినే మరోసారి ఛైర్మన్‌గా చేసి సరిపెట్టేశారు. డిప్యూటీ ఛైర్మన్, చీఫ్‌విప్ పదవుల ఉసే లేదు. శాసన మండలి డిప్యూటీ ఛైర్మన్ పోస్టు బీసీ సామాజికవర్గానికి దక్కుతుందని అప్పట్లో టీఆర్ఎస్ వర్గాల్లో చర్చ జరిగింది. రేపో మాపో పేరు ప్రకటిస్తారని అనుకుంటూనే ఉన్నారు కానీ.. కొలిక్కి రావడం లేదు. దీంతో ఎందుకు భర్తీ…
తెలంగాణలో భయానక వాతావరణం నెలకొందని.. టీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని రంగాల్లో ఫెయిల్ అయిందని విమర్శించారు బీజేపీ తెలంగాణ వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్. ముఖ్యమంత్రి, మంత్రులు మీ ఆఫీసులకు ఎప్పుడు వెళ్తున్నారని ప్రశ్నించారు. కేసీఆర్ సర్కార్ అన్నింటిలో ఫెయిల్ అయిందని.. లా అండ్ ఆర్డర్, పరిపాలనలో, హామీల అమలులో విఫలం అయిందని ఆయన విమర్శించారు. కేసీఆర్ రూ.109 కోట్లు ఖర్చు పెట్టి కేసీఆర్ పర్సనాలిటీ పెంచుకునే ప్రయత్నం చేస్తున్నారని.. తప్పుడు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ డబ్బులను…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై టీ కాంగ్రెస్ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సీపీ సీవీ ఆనంద్ చెప్పిన విధానం చూస్తుంటే.. అవసరమైన వాళ్లను తప్పించే ప్రయత్నం చేస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. ఈ సంఘటనలో నిందితులు, బాధితురాలు ప్రయాణించిన బెంజ్ కారు, ఇన్నోవా ముఖ్యమైన ఆధారాలని ఆయన అన్నారు. మైనర్లు వాహనాలు నడిపితే, యజమానులకు సమాచారం అందించాలని..ఎంపీ యాక్ట్ ప్రకారం యజమానులను పోలీస్ స్టేషన్ కు పిలవాలని.. లేదంటే వాళ్లపై కేసులు పెట్టాలని…
తెలంగాణకు మాటలు, గుజరాత్ కు మూటలు దక్కతున్నాయని మంత్రి హరీష్ రావు బీజేేపీ పార్టీపై ఫైర్ అయ్యాడు. నర్సాపూర్ బహిరంగ సభలో మాట్లాడుతూ ఆయన బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ రాష్ట్రంలో అదికారంలోకి వస్తే ఆర్టీసీని అమ్ముతుందని ఆరోపించారు. ప్రభుత్వ రంగ సంస్థలపై బీజేపీ పాలసీ ఏంటో తెలియజేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో ఉన్న పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో ఎందుకు లేవని ప్రశ్నించారు. 15వ ఆర్థిక సంఘం సిఫారసు మేరకు…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనపై బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ ఫైర్ అయ్యారు. నేరస్తులను వదిలి, న్యాయం కోసం పోరాడుతున్న వారిపై కేసులు పెట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ అత్యాచార ఘటనలో దోషులను ఎందుకు అరెస్ట్ చేయరని ప్రశ్నించారు. మీ తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని ప్రభుత్వానికి స్పష్టం చేశారు. టీఆర్ఎస్, ఎంఐఎం అరాచకాలను పాతరేసే దాకా ఉద్యమిస్తూనే ఉంటామని ఆయన అన్నారు. జూబ్లీహిల్స్ మైనర్ బాలికపై సామూహిక అత్యాచారం ఘటనలో తప్పు చేసిన నేరస్తులను వదిలేసి న్యాయం…
జూబ్లీహిల్స్ అత్యాచార ఘటన తెలంగాణ వ్యాప్తంగా రాజకీయ ప్రకంపనలు రేపుతోంది. మొన్నటి వరకు అత్యాచార ఘటనపై కాంగ్రెస్, బీజేపీ పార్టీలు అధికార టీఆర్ఎస్ పై విరుచుకుపడితే.. ఎమ్మెల్యే రఘునందర్ రావు మరిన్ని ఆధారాలు బయటపెట్టడం, బాధిత అమ్మాయి విజువల్స్, ఫోటోలను బయటపెడ్డటంతో ఇంకో టర్న్ తీసుకుంది ఈ కేసు. అత్యాచార బాధితురాలి ఫోటోలు, విజువల్స్ ఎలా బయటపెడుతారంటూ.. టీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీజేపీ పార్టీతో పాటు రఘునందన్ రావుపై ఫైర్ అవుతున్నాయి. తాజాగా ఈ వివాదంలో రఘునందన్…
రాష్ట్రవ్యాప్తంగా సాధారణ ఎన్నికల కోసం హడావుడి కొనసాగుతుంటే, రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్ మున్సిపల్ కార్పొరేషన్లో మాత్రం పాలకవర్గం మార్పుపై చర్చ సాగుతోంది. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా, పదవులతో పాటు ఆర్థిక లావాదేవీలే లక్ష్యంగా నేతలు సాగుతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అధికార పార్టీలో రెండు వర్గాలుగా చీలిక ఏర్పడింది. మేయర్ వర్గానికి వ్యతిరేకంగా డిప్యూటీ వర్గం పావులు కదుపుతోంది. మేయర్ కు ఎమ్మెల్యే, డిప్యూటీ మేయర్ కు ఎంపీ మద్దతు ఉన్నట్లు కార్పొరేషన్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.…
తెలంగాణపై బీజేపీ గట్టి గురిపెట్టిందనడానికి వరుస పరిణామాలే నిదర్శనం. అగ్రనేతలంతా హైదరాబాద్ లో ల్యాండ్ అవుతుండటమే అందుకు ఉదాహరణ. గతనెల 26న ప్రధానమంత్రి నరేంద్ర మోడీ హైదరాబాద్ కు వచ్చారు. బేగంపేట్ ఎయిర్ పోర్ట్ లో బిజెపి శ్రేణులను ఉద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నామని చెప్పారు. ఆయన పర్యటనలో స్వాగతం, వీడ్కోలు పలికే దగ్గర చోటామోటా బిజెపి నేతలకు అవకాశం వచ్చింది. గ్రేటర్ కార్పొరేటర్ లను కూడా కలిసే కార్యక్రమం ప్రోగ్రామ్ లో వున్నా, వర్షం…
హైదరాబాద్ అమినేషియా పబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మైనర్ రేప్ కావడంతో పొలిటికల్ గానూ రచ్చ రచ్చ అవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు ఉండటంతో, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. రేప్ కేసులో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు పాత్ర ఉందని పోలీసులు తేల్చారట. కేసు పూర్తి విచారణ అయితేగాని ఎవరి పాత్ర ఏమిటో తేలే అవకాశం ఉంది. తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్…
నారాయణపేట జిల్లాలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు పర్యటించారు. నారాయణపేట జిల్లా కేంద్రంతో పాటు నారాయణపేట మండల పరిధి అప్పక్ పల్లి గ్రామంలో రూ.64కోట్ల 43 లక్షల 19 వేలతో చేపట్టిన వివిధ అభివృద్ధి పనులకు మంత్రి తన్నీరు హరీశ్ రావు, మంత్రి శ్రీనివాస్ గౌడ్, స్థానిక ఎమ్మెల్యే ఎస్.రాజేందర్ రెడ్డితో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు. అప్పక్ పల్లి గ్రామ శివారులో రూ.56 కోట్ల వ్యయంతో 390 పడకల జిల్లా…