హైదరాబాద్ అమినేషియా పబ్ వ్యవహారం దేశవ్యాప్తంగా హాట్ టాపిక్ అయ్యింది. మైనర్ రేప్ కావడంతో పొలిటికల్ గానూ రచ్చ రచ్చ అవుతోంది. మరోవైపు ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన నేతల పిల్లలు ఉండటంతో, టిఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశాయి విపక్షాలు. రేప్ కేసులో తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ కొడుకు పాత్ర ఉందని పోలీసులు తేల్చారట. కేసు పూర్తి విచారణ అయితేగాని ఎవరి పాత్ర ఏమిటో తేలే అవకాశం ఉంది.
తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ మసీఉల్లా కొడుకు పాత్ర ఉండటంతో, ఇప్పుడు విపక్ష పార్టీలు అధికార పార్టీని టార్గెట్ చేస్తున్నాయి. బిజెపి,కాంగ్రెస్ పార్టీలు ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. అధికార పార్టీ నేతల పిల్లలు ఉండడంతోనే కేసును నీరు గారుస్తున్నారన్న విమర్శలు చేస్తున్నాయి విపక్ష పార్టీలు. మరోవైపు వక్ఫ్ బోర్డు చైర్మన్ పై అధికార పార్టీ చర్యలు తీసుకోకపోవడం, ఇప్పుడు పొలిటికల్ సర్కిల్ లో హాట్ టాపిక్ అయ్యింది. ఇంతా జరుగుతున్న వక్ఫ్ బోర్డు చైర్మన్ పై యాక్షన్ ఉండకపోవడాన్నీ విపక్ష పార్టీలు అస్త్రంగా మలచుకునే ప్రయత్నం చేస్తున్నాయి.
అయితే తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ గా మసీఉల్లా నియామకం తర్వాత, సొంత పార్టీలోని కొందరు నేతలు ఆయన తీరుపై అసంతృప్తితో ఉన్నారట. వక్ఫ్ బోర్డు చైర్మన్ గా అపాయింట్ అయిన తర్వాత, ఎంఐఎం ముఖ్యనేతను మాసిఉల్లా కలవడాన్ని, ఆ పార్టీలో కొందరు నేతలు అప్పట్లో తప్పుబట్టారట. అర్హత లేకున్నా మసిఉల్లా వక్ఫ్ బోర్డు చైర్మన్ పదవి దక్కించుకున్నారన్న వాదనలు వినిపిస్తున్నారట. తాజాగా జూబ్లీహిల్స్ మైనర్ రేపు కేసులో, మసీవుల్లా కొడుకు పేరు బయటకు రావడంతో, ప్రత్యర్థులు మరింతగా రెచ్చిపోతున్నారట..
మొత్తంగా ఇంత జరుగుతున్నా తెలంగాణ వక్ఫ్ బోర్డు చైర్మన్ పై చర్యలు లేకపోవడంపై, విపక్షాలు గట్టిగానే విమర్శలు చేస్తున్నాయి.