నన్ను ఆపే శక్తి ఎవరికీ లేదు.. ఇదీ గవర్నర్ తమిళిసై మాట.. మహిళా దర్బార్ నిర్వహించిన గవర్నర్, తెలంగాణ సర్కారుకు…రాజ్ భవన్ కు మధ్య పోరుని కొత్త మలుపు తిప్పారు. ఒక సోదరిలా తెలంగాణ మహిళలకు అండగా ఉంటానని చెప్పిన గవర్నర్, గ్యాంగ్ రేప్ ఘటనపై రెండు రోజుల్లో నివేదిక ఇవ్వాలని ఆదేశించినా ఇంతవరకు పట్టించుకోలేదన్నారు. మహిళా దర్బార్ పై రాజకీయ వర్గాల్లో భిన్న స్పందనలు వ్యక్తమౌతున్నాయి. తెలంగాణ గవర్నర్ వర్సెస్ టీఆర్ఎస్ ప్రభుత్వం మధ్య వార్…
గుత్త సుఖేందర్‌రెడ్డి. తెలంగాణ శాసనమండలి ఛైర్మన్. ఈయనేమో కంచర్ల భూపాల్‌రెడ్డి. నల్లగొండ ఎమ్మెల్యే. ఇద్దరూ టీఆర్‌ఎస్ నాయకులే. కానీ.. ఒకరంటే ఒకరికి పడదు. చాలా గ్యాప్ ఉందనేది గులాబీ శ్రేణులు చెప్పేమాట. ఒకరిపేరు మరొకరు వినడానికి.. పలకడానికి.. చివరకు ఎదురుపడటానికీ ఇష్టపడరని చెబుతారు. ఆ మధ్య నల్లగొండ నియోజకవర్గంలోని ప్రముఖ ఆలయానికి మండలి ఛైర్మన్ గుత్తా వెళ్తే.. ఆలయ ఈవో, అర్చకులు కనీసం ప్రొటోకాల్ పాటించలేదట. అదంతా ఎమ్మెల్యే ఆదేశాలతోనే జరిగిందనేది గుత్తా వర్గీయుల ఆరోపణ. అక్కడ…
ఎన్నికల షెడ్యులు విడుదల కావడంతో ప్రజలు, పార్టీల దృష్టి కాబోయే రాష్ట్రపతి అభ్యర్థిపై పడింది. ఈ ఎన్నికల ద్వారా జాతీయస్థాయిలో రాజకీయ పరిణామాలు ఏలా మారతాయి? ఏ కూటమి నుంచి ఎవరు అభ్యర్ధిగా బరిలో దిగుతారో అనేదానిపై రకరకాల చర్చలు జరుగుతున్నాయి. బీజేపీ నేతృత్వంలోని NDA కూటమి తమ అభ్యర్ధి గెలుపు కోసం లెక్కలతో కుస్తీ పడుతోంది. పలు పార్టీలతో మంతనాలు జరుపుతున్నారు బీజేపీ ముఖ్యనేతలు. అయితే NDAకు వ్యతిరేకంగా రాష్ట్రపతి అభ్యర్ధిగా బరిలో ఎవరు ఉంటారు?…
తెలంగాణ పాలిటిక్స్ లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కేసీఆర్ అధ్యక్షతన కీలక సమావేశం జరుగుతోంది. అసెంబ్లీ స్పీకర్, మండలి చైర్మన్ తో పాటు మంత్రులు, లోక్ సభ, రాజ్యసభ, అసెంబ్లీ ఫ్లోర్ లీడర్లు, విప్ లతో కీలక సమావేశం జరుగుతోంది. ముఖ్యంగా కేంద్రం అనుసరిస్తున్న తీరుతో పాటు రాష్ట్రపతి ఎన్నికల గురించి ప్రధాన చర్చ జరుగుతున్నట్లు సమాచారం. ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే దానిపై ప్రధానంగా చర్చ సాగుతోంది. ఇటీవల కాలంలో బీజేపీకి…
ప్రజల ప్రాణాలు, మానాలు, ఆస్తులు రక్షించలేని కేసీఆర్‌కి ఒక్క క్షణం కూడా ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత లేదు అని ఫైర్ అయ్యారు బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్.. రాష్ట్రంలో వరుసగా వెలుగు చూస్తున్న లైంగిక వేధింపుల ఘటనలపై స్పందించిన ఈటల.. ఆర్.కె.పురం డివిజన్‌లోని ఎన్టీఆర్ నగర్‌లో తొమ్మిదేళ్ల అమ్మాయిపై లైంగిక దాడులు జరిగాయి. స్థానిక కార్పొరేటర్ రాధ ధీరజ్ రెడ్డి, నియోజకవర్గ ఇంఛార్జ్ శ్రీరాములు, స్థానిక నాయకులు అందరూ బస్తీని సందర్శించి ప్రజలకు భరోసా ఇచ్చి.. కుటుంబాన్ని…
గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ రాజ్ భవన్ లో నిర్వహించిన ‘ మహిళా దర్బార్’ పై పొలిటికల్ దుమారం రేగుతోంది. టీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మహిళా సమస్యలను చర్చించేందుకు గవర్నర్ ఏర్పాటు చేసిన మహిళా దర్భార్ కు విశేష స్పందన వచ్చింది. మెయిల్, ఫోన్ ద్వారా రాజ్ భవన్ కి కాంటాక్ట్ అయిన 300 మంది మహిళలు తమ సమస్యలు చెప్పుకునేందుకు రాజ్ భవన్ కి వచ్చారు. ఇదిలా ఉంటే గవర్నర్ మహిళా దర్బార్…
తెలంగాణలో కామ్రేడ్లు సైలెంట్ అయ్యారు. సమస్యలున్నా కనిపించడం లేదు. ఒకప్పుడు విద్యుత్ పోరాటంలో కాల్పుల వరకు లెఫ్ట్ పార్టీల ఉద్యమం ఎగిసిపడింది. అలాంటి వామపక్ష నేతలకు ఏమైంది అన్నదే ప్రస్తుతం ప్రశ్న. నిత్యావసరాల ధరాలు భారీగా పెరిగాయి. పెట్రోధరలు భగ్గుమంటున్నాయి. ఆర్టీసీలో ఛార్జీల మోత మోగుతోంది. విద్యుత్ ఛార్జీలు షాక్ కొడుతున్నాయి. ఒకప్పుడు ఇలాంటి సమస్యలు ఎదురైతే ఎర్ర జెండాలతో రోడ్డెక్కి ధర్నాలు.. రాస్తారోకోలు.. ప్రభుత్వ ఆఫీసుల ముట్టడితో హోరెత్తించేవి.. CPI, CPM ఇతర వామపక్ష పార్టీలు.…
ఖమ్మం జిల్లాలో పర్యటనలో ఉన్న వైఎస్సార్టీపీ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ సంచలన వ్యాఖ్యలు చేశారు. టీఆర్ఎస్ పార్టీపై, సీఎం కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఖమ్మం నాయకులను టీఆర్ఎస్ పార్టీ డబ్బులతో కొనుక్కుందని..వ్యాపార లావాదేవీలు ఉన్నాయి కాబట్టే టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని విమర్శించారు. పశువుల లెక్క లైన్లో నిలబడి మేము రెడీ అన్నట్లు టీఆర్ఎస్ కు అమ్ముడు పోయారని అన్నారు. ప్రజల సమస్యలపై పోరాటం కోసమే వైఎస్సార్టీపీ పార్టీ పుట్టిందని షర్మిళ అన్నారు. కేసీఆర్…
ప్రజా సమస్యల పరిష్కారానికి సీఎల్పీ నేత భట్టి విక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్ర చేస్తున్నారు. ఖమ్మం జిల్లాలో మొదలు పెట్టిన పాదయాత్ర గురువారం ఎర్రుపాలెం మండలం మీనవోలు గ్రామానికి చేరుకుంది. అక్కడే అంకమ్మ దేవాలయాన్ని పున:ప్రారంభం చేశారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. అక్కడే గ్రామంలోని ప్రజల సమస్యలను వింటూ పాదయాత్రను కొనసాగించారు. పాదయాత్రలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏం చేస్తామో చెబుతూనే.. టీఆర్ఎస్ పార్టీ, ముఖ్యమంత్రి కేసీఆర్ పై విమర్శలు గుప్పించారు. ఇటీవల జరగిన సంఘటనపై రాష్ట్ర…