తెలంగాణ అభివృద్ధి విషయంలో విమర్శలు చేసేవారికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అంటున్నారు.. మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నీళ్లు విడుదల చేయలేదా…? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి.. రైతు ఆత్మహత్యలు తగ్గాయి.. దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఉందా…? ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా…? అని ప్రశ్నించారు.. లక్ష కోట్లతో కాళేశ్వరం…
బీఏసీని సంప్రదించకుండా 3 రోజులకె పరిమితం చేశారని, ఇది కేసీఆర్ అహంకారనికి నిదర్శనమని బీజేపీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ మండిపడ్డారు. గన్ పార్క్ అమరవీరుల స్థూపం, అసెంబ్లీ ముందు ఉన్న సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం వద్ద బీజేపీ ఎమ్మెల్యేలు రఘునందన్ రావు, ఈటల రాజేందర్ నివాళులు అర్పించారు. అనంతరం తెలంగాణ ప్రజానీకం 2 వ సారి అధికారం కట్టబెట్టిన తరువాత శాసనసభ సమావేశాలు మొక్కుబడిగా నిర్వహిస్తున్నారని అన్నారు. శాసన సభ్యులను గడ్డి పోచల్లగా అవమానిస్తున్నారని ఆగ్రహం…
If the petitions are given when the assembly is about to start, will arrests be made? Revanth Reddy Fire: యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘం నాయకులు అరెస్ట్ అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కోసం శాసనసభ కు వచ్చి ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ నగర నాయకులను రాష్ట్ర నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం చట్టవిరుద్దమని…
Bandisanjay is Serious about CM KCR: వరంగల్ జిల్లా వర్ధన్నపేట లోని బాలికల గిరిజన ఆశ్రమ పాఠశాలలో దారుణం చోటుచేసుకున్న విషయం తెలిసిందే. దీనిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్ స్పందించారు. వర్ధన్నపేట గిరిజన ఆశ్రమ పాఠశాలలో అస్వస్థకు గురైన బాలికలకు వెంటనే సరైన చికిత్స అందించాలని. అస్వస్థత అయిన బాలికలను అవసరమైతే హైదరాబాద్ తరలించి నాణ్యమైన వైద్యం అందించాలని ఎంపీ బండి సంజయ్ కుమార్ డిమాండ్ చేశారు. బల్లి పడ్డ…
మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి… రేపు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి… మొదటి రోజు మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక ఎల్లుండికి సభ వాయిదా వేయనున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి… ఇక, రేపు జరగనున్న బీఏసీ సమావేశంలో.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. ఇక, సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఒకేసారి శాసన సభ…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక కాకరేపుతోంది.. కాంగ్రెస్ పార్టీ, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి.. బీజేపీలో చేరి ఉప ఎన్నికల్లో బరిలో దిగేందుకు సిద్ధం కాగా.. అధికార టీఆర్ఎస్ పార్టీ.. తమ సిట్టింగ్ స్థానంలో కాంగ్రెస్ పార్టీ.. అభ్యర్థుల ఎంపిక కోసం కసరత్తు చేస్తున్నాయి.. అయితే.. మునుగోడులో విజయం మాదేఅంటుంది భారతీయ జనతా పార్టీ.. గత ఉప ఎన్నికల్లో గెలిచినట్టుగానే.. మునుగోడులోనూ బీజేపీ జెండా పాతేస్తాం అంటున్నారు.. ఇక, మునుగోడులో సర్వేలన్నీ…
2024లో బీజేపీ ముక్త్ భారత్ కావాలి.. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. అందులో దేశ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.. ఆ తర్వాత టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయానికీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 60…
తెలంగాణతో పెట్టుకుంటే కొరివితో తల గోక్కున్నట్టే నంటూ కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు టీఆర్ఎస్ ఎంపీ మాలోతు కవిత.
తెలంగాణ రాష్ట్ర సాధన ఆకాంక్షలు నెరవేరడం లేదని బీజేపీ నేత కోమటిరెడ్డి రాజ్‌గోపాల్ రెడ్డి విమర్శించారు. అభివృద్ధి కేసీఆర్ కుటుంబసభ్యులకు మాత్రమే పరిమితమైందని ఆరోపించారు.
jana reddy comments: కాంగ్రెస్ నేత జానా రెడ్డి మునుగోడులో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్ళు నేను ఎంతో శ్రమ పడ్డా, నన్ను ఇంకా ఆయాస పెట్టకండని, మీరు అలిసి మీ కాడి కింద పడేసినప్పుడు నేను వస్తా అన్నారు. నేను రాలేదని అనుకోకండని అన్నారు. నన్ను ఎక్కువ ఆయాస పెట్టకండని తెలిపారు. మునుగోడులో ముఖ్య కార్యకర్తల సమావేశంలో జానారెడ్డి సంచళన వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి జిల్లాకు సాగునీరు ఇచ్చిన ఘనత కాంగ్రెస్ పార్టీదే అని వ్యాఖ్యానించారు.…