Telangana Assembly session: రేపటి నుంచే అసెంబ్లీ సమావేశాలు.. కీలక ప్రకటనలకు సిద్ధమైన సర్కార్..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
మంగళవారం నుంచి తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి… రేపు ఉదయం 11.30 గంటలకు అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు మొదలుకానున్నాయి… మొదటి రోజు మృతిచెందిన సభ్యులకు సంతాపం ప్రకటించాక ఎల్లుండికి సభ వాయిదా వేయనున్నారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి… ఇక, రేపు జరగనున్న బీఏసీ సమావేశంలో.. సభ ఎన్ని రోజులు నిర్వహించాలన్న దానిపై చర్చించి ఓ నిర్ణయానికి రానున్నారు.. ఇక, సమావేశాల నిర్వహణ కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు అధికారులు.. ఒకేసారి శాసన సభ సమావేశాలతో పాటు శాసన మండలి సమావేశాలు కూడా జరగనుండడంతో.. అసెంబ్లీ, కౌన్సిల్ ప్రాంగణంలో, పరిసర ప్రాంతాల్లో భద్రతను కట్టుదిట్టం చేశారు పోలీసులు..
Read Also: Atrocious Incident: కారుణ్య ఉద్యోగం కోసం దారుణం.. మామను ట్రాక్టర్‌తో గుద్ది చంపిన అల్లుడు..
Also Read
- Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
- Fake Form-7 Applications: బోగస్ ఫారం-7 పత్రాల కలకలం.. 31 ఓట్ల తొలగింపునకు నకిలీ దరఖాస్తులు.!
- Bribe in Dead Drop Method: డెడ్ డ్రాప్ పద్ధతిలో లంచాలు.. టౌన్ ప్లానింగ్ అధికారి సునీత ట్రాప్‌లో సంచలన విషయాలు.!
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్‌లో కేసు నమోదు..
అయితే, ఈ సారి సమావేశాల్లో కీలక ప్రకటనలు ఉంటాయని భావిస్తున్నారు.. మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో ఈ సమావేశాలు ప్రాధాన్యత ఏర్పడగా.. కీలక ప్రకటనలు చేసే అవకాశాలు కూడా ఉన్నాయని సమాచారం.. రైతుల సమస్యలు, అధిక వర్షాల కారణంగా జరిగిన నష్టం, పోడు భూముల అంశం, శాంతిభద్రతలు, కేంద్ర ప్రభుత్వ వైఖరి, తదితర అంశాలు ఈ సెషన్‌లో చర్చకు వచ్చే అవకాశాలు ఉండగా.. కొన్ కీలక బిల్లులను కూడా ఈ సమావేశాల్లో ప్రవేశపెట్టేందుకు ప్రభుత్వం సిద్ధమైనట్టు చెబుతున్నారు.. మరోవైపు.. అసెంబ్లీ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కానున్న నేపథ్యంలో.. ఉన్నతాధికారులతో ఇప్పటికే సమీక్ష నిర్వహించారు శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి.. మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి… సంయుక్తంగా ప్రభుత్వ అధికారులు.. పోలీసు ఉన్నతాధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించిన అసెంబ్లీ స్పీకర్, మండలి ఛైర్మన్.. సభ హుందాతనాన్ని, ఔన్నత్యాన్ని కాపాడుకుంటూ ప్రతి అంశంపై సమగ్రంగా చర్చించాలని పేర్కొన్నారు.. ఇక, సమావేశాల దృష్ట్యా తగిన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. కాగా, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మార్చి 15వ తేదీన ముగియడంతో.. సెప్టెంబర్ 14వ తేదీలోపు అసెంబ్లీ మళ్లీ సమావేశం అవ్వాల్సి ఉంది.. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కేబినెట్ సమావేశంలో అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు తేదీలు ఖరారు చేసింది ప్రభుత్వం.
తాజావార్తలు
-
World’s Highest-Earning Cities: ప్రపంచంలో అత్యధిక తలసరి ఆదాయం ఉన్న నగరాలు.. టాప్ 40లో 27 అమెరికా సిటీలే..!
-
Jailer 2 : ‘జైలర్ 2’లో ఫ్యామిలీ ఎమోషన్స్ కు చోటు లేదా?.. నెల్సన్ దాచిన సర్ప్రైజ్ ఏంటి?
-
Rejinagar Bypoll: రెజినగర్ ఉప ఎన్నికలో హైటెన్షన్.. ఓటు వేసిన వెంటనే ఎమ్మెల్యే హుమాయున్ కబీర్ అరెస్ట్
-
Suryakumar Yadav: సూర్యకుమార్ యాదవ్‌కు బిగ్ షాక్.. టీమ్‌లో నో ప్లేస్.. టీనేజర్‌కు వైస్ కెప్టెన్సీ!
-
Telangana Eagle Force: సింథటిక్ డ్రగ్స్‌పై ఈగల్ ఫోర్స్ ఉక్కుపాదం.. పరిశ్రమల నుంచి కొరియర్ సంస్థల వరకు నిఘా.!
ట్రెండింగ్
-
Big Billion Days Offers: రూ.20,000 లోపు లభించే టాప్ స్మార్ట్‌ఫోన్ డీల్స్ ఇదిగో.. అస్సలు మిస్ కావద్దు.!
-
IND vs WI: ఇషాన్ కిషన్ జోరు.. అర్ష్‌దీప్ పేస్.. నేడే తొలి టీ20 మ్యాచ్..!
-
పెద్ద బటన్లు.. వాయిస్ గైడెన్స్.. ఎమర్జెన్సీ ఎస్ఓఎస్.. రూ.1,499కే itel Care..!
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి