2024లో బీజేపీ ముక్త్ భారత్ కావాలి.. బీజేపీయేతర ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది.. అందులో దేశ్యాప్తంగా వ్యవసాయానికి ఉచిత విద్యుత్ అందిస్తామని తెలిపారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు.. నిజామాబాద్ జిల్లాలో పర్యటించిన ఆయన.. కలెక్టరేట్ భవనాన్ని లాంఛనంగా ప్రారంభించారు.. ఆ తర్వాత టీఆర్ఎస్ నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయానికీ శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా గిరిరాజ్ కళాశాలలో ఏర్పాటు చేసిన భారీ బహిరంగసభలో ఆయన మాట్లాడుతూ.. మన చుట్టూ ఏం జరుగుతుందో తెలంగాణ ప్రజలు అర్థం చేసుకోవాలని సూచించారు. 60 ఏళ్లు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణను దేశం మొత్తం ఆశ్చర్యపోయే విధంగా అభివృద్ధి చేసుకుంటున్నాం.. తెలంగాణలో అమలవుతున్న పథకాలు మరే రాష్ట్రంలోనూ లేవని.. రైతులకు ఉచితంగా 24 గంటల విద్యుత్ ఏ రాష్ట్రంలోనూ ఇవ్వట్లేదని స్పష్టం చేశారు.
Read Also: Engineering Course Fees: విద్యార్థులకు షాక్.. భారీగా పెరిగిన ఇంజినీరింగ్ ఫీజులు
ప్రపంచంలోనే అతిపెద్ద నీటి పారుదల ప్రాజెక్టు నిజాం సాగర్.. కాళేశ్వరం కాలువలు పూర్తయితే సింగూర్ వరకూ వస్తాయన్నారు సీఎం కేసీఆర్.. మన దగ్గర ఉన్న ఏ పథకం పక్క రాష్ట్రంలో ఉందా చూడండి.. దేశంలో దళిత కుటుంబాలకు 10 లక్షలు ఇచ్చిన రాష్ట్రం తెలంగాణ, తండాలను పంచాయితీ లు చేయడంతో 3600 మంది గిరిజన బిడ్డలు సర్పంచ్ లుగా ఉన్నారు.. మతం మత్తులో పడి కొట్టుకునేపోయేవారి వల్ల నష్టం ఉంటుందని హెచ్చరించారు.. మన రాష్ట్ర జీడీపీ పెరిగింది.. కానీ, ఇప్పుడు మోటర్లుకు మీటర్లు పెట్టాలట.. ఎన్ని ఉన్నాయో చెప్పాలట మతలబు ఎందో తెలుసుకోవాలి.. అన్ని అమ్మారు ఇక రైతుల భూముల మీద పడ్డారు అని ఆరోపించారు. బలమైన కుట్ర జరుగుతోంది.. వ్యవసాయం రైతుల భూములు మోడీ దోస్తులు కార్పొరేట్ కంపెనీలకు అప్పజెప్పాలని చూస్తున్నారు అని మండిపడ్డారు.
రైతులకు 140 కోట్లు ఇవ్వడానికి మోడీకి చెయ్యి రావట్లేదు కానీ..పెట్టుబడిదారులకు కోట్లకు కోట్లు మాఫీ చేశారని మండిపడ్డారు కేసీఆర్.. వచ్చే ఎన్నికల్లో ఎగిరెది బీజేపీ వ్యతిరేక ప్రభుత్వమే.. ఢిల్లీ గడ్డమీద నిలిచేది మన జెండానే.. నిజామాబాద్ నుండే చెబుతున్నా భారత దేశం రైతాంగం మొత్తానికి ఉచిత కరెంట్ ఇస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.. ప్రధాని నరేంద్ర మోడీ ఒక్క ప్రాజెక్టు అయినా కట్టాడా..? ఒక్క ఫ్యాక్టరీ అయినా పెట్టాడా..? అన్నీ అమ్మె మోడీని శంకరగిరి మాన్యాలకు పంపాలని పిలుపునిచ్చారు.. రైతులకు ఉచితాలు ఇవ్వొద్దని ప్రధాని మోడీ చెప్తున్నారని కేసీఆర్ పేర్కొన్నారు. బావి కాడ మీటర్లు పెట్టమనే సర్కారుకు మీటర్లు పెట్టి సాగనంపాలన్నారు. 2024లో భాజపా ముక్త్ భారత్ ఉండాలని కేసీఆర్ ఆకాంక్షించారు. దేశం కోసం తెలంగాణ నుంచే పోరాటం ప్రారంభం కావాలన్న ఆయన.. తెలంగాణ ప్రజలు దీవిస్తే నిజామాబాద్ గడ్డ నుంచి జాతీయ రాజకీయ ప్రస్థానం ప్రారంభిస్తానని స్పష్టం చేశారు.
8 ఏళ్ల పాలనలో మోదీ సర్కారు ఒక్క ప్రాజెక్టుగానీ, పరిశ్రమ గానీ నిర్మించిందా అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. దేశంలో ఉన్నవాటినే వరుసగా అమ్ముకుంటూ వస్తున్నారని దుయ్యబట్టారు. ఎన్‌పీఏల పేరుతో వ్యాపారులకు రూ.12 లక్షల కోట్లు దోచిపెట్టిందన్న సీఎం కేసీఆర్.. రైతుల భూములు తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు అప్పగించాలని చూస్తున్నారన్నారు. ఎమ్మెల్యేలను కొనటం, ప్రభుత్వాలను కూలదోయటమే మోదీ చేస్తున్న ఏకైక పని అని ధ్వజమెత్తారు. ప్రభుత్వం పడగొడతాం అనడం తప్ప ఏమీ చేయలేరు అని ఎద్దేవా చేశారు.. ఒక్కడినే బయలుదేరి అడుగు వేస్తే మీరంతా అండగా ఉండటంతో దేశం ఓ ఆరోగ్యకరమైన రాజకీయం ఉండాలి.. సంతలో పశువులు కొనే రాజకీయం ఉండకూడదు.. ఇతర రాష్ట్రాల రైతులు చెప్పారు కేసీఆర్ మీరు ముందు ఉండండి మీ వెనుక మేము ఉంటాం అన్నారు. నిజామాబాద్ గడ్డ నుంచే జాతీయ రాజకీయాల్లో అడుగుపెడుతున్నాం. నిజామాబాద్ కాలువల్లో నీరు పారాలా? మత పిచ్చి మంటలతో కాలిపోవాలా ? అనేది ఆలోచించాలన్నారు సీఎం కేసీఆర్.