తెలంగాణ అభివృద్ధి విషయంలో విమర్శలు చేసేవారికి కౌంటర్ ఇచ్చారు మంత్రి హరీష్ రావు.. శాసన మండలిలో ఆయన మాట్లాడుతూ.. బీజేపీ వాళ్లు కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదని అంటున్నారు.. మీ ఎమ్మెల్యే రఘునందన్ రావు నీళ్లు విడుదల చేయలేదా…? అని ప్రశ్నించారు.. రాష్ట్రంలో వ్యవసాయ ఉత్పత్తులు పెరుగుతున్నాయి.. రైతు ఆత్మహత్యలు తగ్గాయి.. దేశంలో 24 గంటల కరెంట్ ఎక్కడైనా ఉందా…? ఇది తెలంగాణ సాధించిన ప్రగతి కాదా…? అని ప్రశ్నించారు.. లక్ష కోట్లతో కాళేశ్వరం ప్రాజెక్టు కట్టుకున్నాం.. కానీ, ఇప్పుడు పెరిగిన ధరలతో కాళేశ్వరం కట్టాలంటే 2 లక్షల కోట్లు కావాలి.. ప్రజా ధనాన్ని ఆదా చేశాం.. ముడున్నరేళ్ళలోనే నీళ్లు రావడం వల్ల పంటలు, మత్స్య సంపద పెరిగింది.. తెలంగాణ ఎకరంతో పక్క రాష్ట్రాల్లో 3 ఎకరాలు కొనేస్తున్నారు.. ఇక, బెంగాల్ ,నేపాల్ నుండి మగ కూలీలు వచ్చి తెలంగాణలో వరి నాట్లు వేస్తున్నారని తెలిపారు హరీష్‌రావు.
Read Also: Director Teja: ‘అహింస’కు గుమ్మడికాయ కొట్టేసిన తేజ!
వడ్ల సంచులు దించాలన్న బీహార్ నుండి హమాలీలు రావాల్సిందే.. మూడేళ్లలో లక్ష కోట్ల పంట తెలంగాణలో పండిందన్నారు హరీష్ రావు.. దేశంలోనే అతి తక్కువ ఖర్చుతో పూర్తయిన ప్రాజెక్టు కాళేశ్వరం అని పేర్కొన్న ఆయన.. నెల లోపు పైసా ఖర్చు లేకుండా కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తాం అన్నారు.. యాసంగికి కాళేశ్వరం ద్వారా నీళ్లు అందిస్తామని స్పష్టం చేశారు. కాళేశ్వరం వృథా ప్రాజెక్టు కాదు.. కాళేశ్వరంతో ఖర్చు తగ్గింది.. ఈ నెలలోనే నీళ్లు వస్తాయి.. ప్రతి పక్షాల దుస్ప్రచారాన్ని నమ్మొద్దు అని సూచించారు. కాళేశ్వరం నీళ్లు లేకుంటే అదనపు పంట ఎలా వచ్చింది? అని నిలదీసిన మంత్రి.. మీకు చేతనైతే పండిన పంట కొనండి అని సవాల్ విసిరారు.. ప్రతి పక్షాల రూపంలో గోబెల్స్ బతికే ఉన్నాడంటూ ఎద్దేవా చేశారు.
గోదావరి ముంపు ప్రాంతాల బాధితులను ఆదుకున్నామని తెలిపారు హరీష్‌రావు.. పంపులు మునిగి పోవటంతో ప్రతిపక్షాల కళ్లు మండాయని.. ఇక కాళేశ్వరం పనై పోయింది.. లక్ష కోట్లు నాశనం అయ్యాయని కలలు కన్నారు.. ఎంత సేపు దుష్ప్రచారం చేయటమే ప్రతిపక్షాల పని అని మండిపడ్డారు. ఈనెల 3 వారం నుండి అన్నారం పంప్ హౌజ్ నీళ్లు పోయటం ఖాయం.. అక్టోబర్ చివరి వారంలో మేడిగడ్డకు నీళ్లు వస్తాయని వెల్లడించారు. ఒక్క ఎకరం కూడా నీళ్లు పారలేదు. ఎకరం పంట కూడా పండలేదు అని విషం చిమ్మారు.. మరి, రెండు కోట్ల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండింది.. పంట కొనమని కేంద్రం తెగేసి చెప్పింది.. ఈ పంట అంత ఎం చేసుకోవాలని గట్టిగా అడిగాం.. భారత దేశానికి అన్నం పెడుతున్నది తెలంగాణనే అన్నారు హరీష్‌రావు.. వచ్చే యాసంగి పంట కొనేందుకు కేంద్రం సిద్ధంగా ఉండాలని సూచించారు.. రతిపక్షాలు వాస్తవాలు మాట్లాడరు, విషయం మాట్లాడరు, విషం చిమ్ముతారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు.. డీపీఆర్ లేదని కేంద్రమంత్రి మాట్లాడుతున్నారు, డీపీఆర్ లేకపోతే కాళేశ్వరం అనుమతి ఎలా వచ్చింది? ఇది సంస్కారమా? అని ఫైర్ అయ్యారు మంత్రి హరీష్ రావు.