If the petitions are given when the assembly is about to start, will arrests be made? Revanth Reddy Fire: యూత్ కాంగ్రెస్, విద్యార్థి సంఘం నాయకులు అరెస్ట్ అప్రజాస్వామికమని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి మండిపడ్డారు. విద్యార్థి, యువజన సమస్యల పరిష్కారం కోసం శాసనసభ కు వచ్చి ఎమ్మెల్యేలను కలిసి వినతిపత్రం ఇవ్వాలనుకున్న యూత్ కాంగ్రెస్, ఎన్.ఎస్.యు.ఐ నగర నాయకులను రాష్ట్ర నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్టులు చేయడం చట్టవిరుద్దమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అసెంబ్లీ ప్రారంభమవుతున్న తరుణంలో ప్రజా సమస్యలపై నాయకులు వినతిపత్రాలు ఇవ్వడం సహజమని గుర్తు చేశారు. దాన్ని ఆసరా చేసుకొని హైదరాబాద్ తో పాటు చుట్టూ పక్కల ఉన్న నియోజక వర్గాలలో కాంగ్రెస్ నాయకులను ముందస్తుగా అరెస్టులు చేసి పోలీసు స్టేషన్ కు తరలించారని నిప్పులు చెరిగారు.
యూత్ కాంగ్రెస్ నాయకులు అనిల్ యాదవ్, మోతె రోహిత్, ఎస్‌యస్‌యూఐ నగర అధ్యక్షులు అభిజిత్ తదితరులను అరెస్ట్ చేసి పోలీసు స్టేషన్లకు తరలించడం ఏంటని ప్రశ్నించారు. నగరంలో కాంగ్రెస్ నాయకులు బయటకు రాకుండా అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. అరెస్టు చేసిన యూత్ కాంగ్రెస్,ఎన్ ఎస్ యూ ఐ నాయకులను వెంటనే విడుదల చేయాలని, తక్షణమే నిరుద్యోగ భృతిని ప్రకటన చేయాలని రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు. ఉద్యోగాల కల్పన, నిరుద్యోగ భృతి లపై అసెంబ్లీ సమావేశాల్లో స్పష్టమైన ప్రకటన చేయాలని కోరారు. తక్షణమే అర్హులకు రూ.3016 నిరుద్యోగభృతిని అందించాలని టీపీసీసీ అధ్యక్షులు రేవంత్ రెడ్డి డిమాండ్ చేశారు.
అయితే.. అసెంబ్లీ సమావేశాలకు పోలీసులు భారీ భద్రత ఏర్పాటు చేశారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రెండు వేల మందితో భారీ బందోబస్త్ నిర్వహిస్తున్నారు. కాగా.. అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. సభలు, సమావేశాలు నిరసన కార్యక్రమాలు చేపడితే కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు. ఈనేపథ్యంలో.. అసెంబ్లీ లోపల నాలుగు అంచెల భద్రత ఏర్పాటు చేశారు. ఇక టాస్క్ ఫోర్స్, లా అండ్ ఆర్డర్, స్పెషల్ బ్రాంచ్, ఇంటెలిజెన్స్ పోలీసులతో పహారా కాస్తున్నారు.
Nuts and your heart: రోజూ గుప్పెడు పల్లీలు తింటే గుండె పదిలం