double bedroom scam: డబుల్ బెడ్రూం స్కాంలో నలుగురి అరెస్ట్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
double bedroom scam: మహబూబ్ నగర్ లో వెలుగు చూసిన డబుల్ బెడ్ రూం ఇళ్ల కుంభకోణంలో పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వీరిలో ఎక్సైజ్ శాఖా మంత్రి శ్రీనివాస్ గౌడ్ వ్యక్తిగత కార్యదర్శి కొడుకు కాగా మరొకరు కాంగ్రెస్ పార్టీకి చెందిన లీడర్ ఉన్నాడు. వీరంతా డబుల్ బెడ్రూం ఇళ్లకు నకిలీ పట్టాలు సృష్టించి వసూళ్లకు పాల్పడ్డట్లు పోలీసులు తెలిపారు. కేసు పూర్తి వివరాలను మహబూబ్‌నగర్‌రూరల్ సీఐ రాజేశ్వర్‌గౌడ్ మీడియాకు తెలియజేశారు. భగీరథ కాలనీకి చెందిన అరుణకుమార్రెడ్డికి న్యూ గంజ్‌కు చెందిన సిరాజుద్దీన్ ఖాద్రీ దివిటిపల్లి వద్ద డబుల్బెడ్రూమ్ఇప్పిస్తానని రూ.3.5 లక్షలు తీసుకున్నాడు. ఎంతకూ ఇల్లు ఇప్పించకపోవడంతో గురువారం ఫిర్యాదు చేశాడు. సిరాజుద్దీన్ ఖాద్రీ…అరుణ్‌కుమార్‌రెడ్డి నుంచే కాకుండా ఖాదర్అనే వ్యక్తితో కలిసి మరో ఇద్దరి నుంచి కూడా డబ్బులు వసూలు చేశాడు. ప్రస్తుతం ఖాదర్ పరారీలో ఉన్నాడు. సిరాజుద్దీన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఆయన దగ్గరి నుంచి రూ.2.50 లక్షలు, సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు.
Read also: viral news: ఎంత చదవాలి.. ముసలాడిని అయ్యేలా ఉన్న.. నవ్వు తెప్పిస్తున్న బుడ్డోడి మాటలు
Also Read
- Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
- AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
- Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
- Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
రెండో కేసులో జిల్లా కేంద్రంలోని పుట్నాలబట్టి ఏరియాకు చెందిన మరో బాధితుడు సుధాకర్ఇచ్చిన కంప్లయింట్మేరకు పట్టణంలోని ఆల్మాస్ఖాన్ వీధికి చెందిన వానగంటి ప్రకాశ్, బోయపల్లి గేట్ప్రాంతానికి చెందిన మహ్మద్ఇర్ఫాన్లపై కేసు నమోదు చేశారు. వీరు ఒకరికి డబుల్ బెడ్రూమ్ఇప్పిస్తామని రూ.2 లక్షలు, మరో ముగ్గురు నుంచి రూ.3 లక్షలు వసూలు చేశారు. హనుమాన్‌పురకు చెందిన మరో బాధితుడు సయ్యద్ కలాం పాషా ఇచ్చిన కంప్లయింట్మేరకు ఎక్సైజ్‌శాఖ మంత్రి వి.శ్రీనివాస్‌గౌడ్ వద్ద వ్యక్తిగత కార్యదర్శిగా పని చేస్తున్న దేవేందర్ కొడుకు అక్షయ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈయన బాధితుడి నుంచి రూ.30 వేలు, మరో వ్యక్తి నుంచి రూ.70 వేలు వసూలు చేసినట్లు తెలిపారు. వీరిని అరెస్టు రిమాండ్‌కు తరలించినట్లు సీఐ తెలిపారు.
Read also:Radha Tmt: మార్కెట్లోకి రాధా టీఎంటీ సరికొత్త మోడల్
డబుల్ బెడ్రూం ఇళ్ల విషయంలో కొందరు డబ్బులు వసూళ్లకు పాల్పడుతున్నట్లు తన దృష్టికి రావడంతో పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఈ కుంభకోణంలో ఉన్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఇలాంటి చర్యలకు పాల్పడితే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు.
తాజావార్తలు
-
Yogi Adityanath: ‘‘ఇద్దరం పోటీ చేద్దాం, అదృష్టాన్ని పరీక్షించుకుందాం’’.. అఖిలేష్‌కు యోగి సవాల్..
-
AP Govt: NTR వైద్య సేవలో అక్రమాలపై వేటు.. 203 ఆసుపత్రులకు రూ.34.39 కోట్ల జరిమానా..
-
Rekha Gupta: ఢిల్లీని బందీగా మార్చనివ్వం.. విపక్షాల కుట్రను తిప్పికొడతామన్న రేఖా గుప్తా
-
Virender Sehwag: ‘ఫస్ట్ బంతి నుంచే సిక్సర్లు’.. సూర్యవంశీకి సెహ్వాగ్ కీలక సూచనలు..
-
CM Revanth Reddy: ఎల్‌నినోతో పొంచి ఉన్న సంక్షోభం.. గ్రామస్థాయి నుంచి ప్రజలను అప్రమత్తం చేయాలి..
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!