మునుగోడు ఉప ఎన్నికలు రాజకీయంగా హీట్ పుట్టిస్తున్నాయి.. సార్వత్రిక ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ.. ఇలా ఎవరి ప్రయత్నాలు వారు చేస్తున్నారు.. ఉప ఎన్నికల్లో గెలిచి సత్తా చాటాలని భావిస్తున్నారు.. ఇతర పార్టీల నేతలను తమ వైపు తిప్పుకునేందుకు స్కెచ్‌లు వేస్తూనే ఉన్నారు.. తమ పార్టీలోకి రావలంటూ ఆహ్వానాలు పంపుతున్నాయి.…
తెలంగాణ రాష్ట్ర సమితిని ఏర్పాటు చేసి.. అన్ని వర్గాలను ఏకతాటిపైకి తెచ్చి రాష్ట్రాన్ని సాధించారు కె.చంద్రశేఖర్ రావు.. ఆ తర్వాత ఉద్యమ పార్టీని.. రాజకీయ పార్టీగా మారుస్తూ నిర్ణయం తీసుకున్నారు.. తెలంగాణలో రెండోసారి దిగ్విజయంగా తమ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కేసీఆర్.. గత కొంత కాలంగా కేంద్ర విధానాలను ఎండగడుతూ.. జాతీయ పార్టీని ప్రారంభించనున్నట్టు ప్రకటించారు.. ఇక, ఈ మధ్య ఎక్కడ సభలు, సమావేశాలు పెట్టినా.. జాతీయ పార్టీ పెడుతున్నా.. మీ మద్దతు కావాలి.. ఇస్తారా? నాతో…
తెలంగాణ రాజకీయాల్లో ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక హీట్ పెంచుతోంది.. ఈ ఉప ఎన్నిక ప్రధాన పార్టీలకు అగ్నిపరీక్షగా మారింది. సాధారణ ఎన్నికలకు ముందు జరుగుతున్న ఉప ఎన్నిక కావడంతో ఇక్కడ గెలిచి రెట్టించిన ఉత్సాహంతో దూసుకెళ్లాలని అన్ని పార్టీలు భావిస్తున్నాయి. దీంతో మునుగోడు ఉప ఎన్నికకు ప్రాధాన్యం ఏర్పడింది. తెలంగాణలో అధికార టీఆర్ఎస్‌కు తామే ప్రత్యామ్నాయం అని చెబుతున్న బీజేపీ.. మునుగోడులో ఎట్టి పరిస్థితుల్లో నెగ్గి తీరాలని పట్టుదలగా ఉంది. మునుగొడులో గెలవడం ద్వారా తెలంగాణలో…
సీఎం కేసీఆర్ జాతీయ పార్టీ ప్రకటనకు ముహూర్తం ఖరారైంది. భారీ బహిరంగ సభ ద్వారా పార్టీ ప్రకటన చేయాలనుకున్న ఆయన ఎలాంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా తెలంగాణ భవన్లో దసరా రోజు తన జాతీయ పార్టీని ప్రకటించనున్నారు.
ఇవాళ మూడోరోజు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యే మంచి రెడ్డి కిషన్ రెడ్డి ఈడీ ముందుకు హాజరు కానున్నారు. మొదటి రోజు 8 గంటలు, రెండో రోజు 10 గంటలపాటు విచారించిన ఈడీ. విదేశీ టూర్లపై ఈడీకి ఎమ్మెల్యే స్టేట్ మెంట్ ఇచ్చారు.
ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే, రంగారెడ్డి జిల్లా టీఆర్ఎస్ అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత మల్‌రెడ్డి రంగారెడ్డి… ఎమ్మెల్యే మంచిరెడ్డిని ఈడీ విచారణ జరుపుతోన్న విషయం తెలిసిందే.. తొలి రోజు 8 గంటల పాటు ఆయన్ను ప్రశ్నించిన ఈడీ అధికారులు.. రెండో రోజు కూడా ప్రశ్నిస్తున్నారు.. అయితే, ఈ వ్యవహారంలో తీవ్ర ఆరోపణలు గుప్పించారు మల్‌రెడ్డి… ఈడీ దర్యాప్తు చేస్తున్న ఇంటర్నేషనల్ డాన్ ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి దావూద్…