టీఆర్ఎస్ పార్టీలో చేరిన మరో కీలక నేత
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సిద్దిపేట : ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఫిషరీస్ కార్పోరేషన్ మాజీ ఛైర్మన్ పోలి లక్ష్మణ్ ముదిరాజ్ మంత్రి హరీష్ రావు సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్ రావు మాట్లాడుతూ… ముఖ్యమంత్రి కేసీఆర్ అన్ని వర్గాలకు ప్రాధాన్యత నిచ్చేలా చర్యలు తీసుకుంటున్నారని.. మత్స్య కారులకు దేశంలో ఏ ప్రభుత్వం లేనంత అండగా టీ ఆర్ ఎస్ ప్రభుత్వం ఉందని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మత్స్య కారుల జీవితాల్లో మార్పు తెచ్చేందుకు అనేక కార్యక్రమాలు ప్రభుత్వం చేపట్టిందని.. ప్రభుత్వం చేపట్టిన ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంతో చేపల ఉత్పత్తి గణనీయంగా పెరిగిందని వివరించారు.
మన రాష్ట్రంలో ఉత్పత్తి అయిన చేపలలో 60 శాతం రాష్ట్ర అవసరాలకు వినియోగిస్తుండగా మిగిలిన ఉత్పత్తిలో..21 శాతం పశ్చిమ బెంగాల్ కు , మిగిలిన 19 శాతం చేపలను అస్సాం, తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాలకు ఎగుమతి చేయడం జరుగుతోందన్నారు. మత్స్యకారులు ఆర్ధికంగా, సామాజికంగా అభివృద్ధి సాధించాలనేది ముఖ్యమంత్రి లక్ష్యమని… కానీ మత్స్యకారులు మద్యదళారులకు తక్కువ ధరలకు చేపలను విక్రయించుకొని నష్టపోతున్నారని తెలిపారు.
Also Read
- PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
- Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
- Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
- India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
వారికి ఆర్ధికంగా లబ్ది చేకూర్చే ఉద్దేశంతో మత్స్య ఫెడరేషన్ ఆధ్వర్యంలో నేరుగా మత్స్యకార సంఘాల నుండి చేపలను కొనుగోలు చేయాలని ప్రభుత్వం యోచిస్తోందని స్పష్టం చేశారు. 40 నుండి 50 క్లస్టర్ లకు ఒక ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లకు అనుసంధానం చేయడం జరుగుతుందని.. మొదటగా హైదరాబాద్ లోని శేరిగూడ, ఖమ్మం, కరీంనగర్, నిజామాబాద్, వరంగల్ లలో ఉన్న మత్స్య శాఖ కు చెందిన భూములలో అంతర్జాతీయ నాణ్యతా ప్రమాణాలతో ప్రధాన ప్రాసెసింగ్ యూనిట్ లను ఏర్పాటు చేయడానికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు.
తాజావార్తలు
-
PPF-SSY Schemes: పీపీఎఫ్, సుకన్య సమృద్ధి యోజన పథకాల వడ్డీ రేట్లలో మార్పులు..? ఈ నెల 30న ప్రకటన..
-
Pawan Kalyan: స్థానిక సంస్థల ఎన్నికలు.. జనసేన నేతలకు పవన్ పిలుపు..
-
Trump: అమెరికా అత్యంత శక్తివంతంగా తయారైంది.. యూఎన్‌లో ట్రంప్ కీలక ప్రసంగం
-
India-Turkey: ‘తత్వం బోధపడినట్లుంది’.. భారత్‌పై ఆధారపడుతున్న టర్కీ.. కారణమేంటో తెలిస్తే..!
-
Cyclone Impact: ఏపీపై వాయుగుండం ఎఫెక్ట్.. పలు రైళ్లు రద్దు, స్కూళ్లకు సెలవు..
ట్రెండింగ్
-
మిలిటరీ గ్రేడ్ బాడీ, 120Hz డిస్‌ప్లే, 7,000mAh బ్యాటరీ, 120Hz డిస్‌ప్లేతో OnePlus N6 Lite.. ధర ఎంతంటే?
-
Team India History: భారత్ @ 200.. టీ20ల్లో తొలి జట్టుగా భారత్ వరల్డ్ రికార్డ్!
-
1.5K 144Hz OLED డిస్‌ప్లే, 7200mAh బ్యాటరీతో అక్టోబర్ 6న రాబోతున్న VIVO V80..!
-
India Win Gold Medal: ఆసియా క్రీడలు 2026 మహిళా క్రికెట్ విజేతగా టీమిండియా..! స్వర్ణ పతకం కైవసం..
-
Asian Games 2026 Final: శ్రీలంక బౌలర్లపై స్మృతి మంధాన శివతాండవం.. లంక ముందు భారీ టార్గెట్.!