కేంద్ర మంత్రి గడ్కరీతో కేసీఆర్ భేటీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
హస్తిన పర్యటనలో ఉన్న తెలంగాణ సీఎం కేసీఆర్.. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని కలిశారు.. ఈ సందర్భంగా పలు అంశాలపై ఆయనతో చర్చించారు. తెలంగాణలోని కల్వకుర్తి నుంచి కొల్హాపూర్, సోమశిల, కరువేన గుండా ఆంధ్ర ప్రదేశ్ లోని నంద్యా వరకు (ఎన్.హెచ్ 167 కే. జాతీయ రహదారి నిర్మాణానికి నోటిఫికేషన్ జారీ చేసినందుకు కృతజ్ఞతలు తెలిపిన కేసీఆర్.. ఈ జాతీయ రహదారి వల్ల తెలంగాణలోని కల్వకుర్తి, కొల్హాపూర్, సోమశిల, ఆంధ్ర ప్రదేశ్ లోని ఆత్మకూరు లాంటి వెనుక బడిన ప్రాంతాలకు రహదారి సౌకర్యం సమకూరుతుందన్నారు.
జాతీయ రహదారి ప్రమాణాలతో నిర్మించనున్న ఈ రహదారిలో సోమశిల వద్ద కృష్ణా నదిపై నిర్మిస్తున్న వంతెన వల్ల హైదరాబాద్ నుంచి తిరుపతి, చెన్నైల మధ్య దూరం 80 కిలోమీటర్ల మేరకు తగ్గనుంది. ఇక, కల్వకుర్తి నుంచి నంద్యాల వరకు నిర్మించనున్నట్లుగా కేంద్రం ప్రకటించిన ఈ కొత్త జాతీయ రహదారి కల్వకుర్తి నుంచి ప్రారంభకానుంది.. హైదరాబాద్ నుంచి కల్వకుర్తి మీదుగా శ్రీశైలం వరకు వెళ్లే ఎన్.హెచ్. 765 లో విపరీతమైన ట్రాఫిక్ ఉండగా.. ఈ నేపథ్యంలో, ప్రస్తుతం 2 లైన్ల జాతీయ రహదారి ( ఎన్.హెచ్ 765)గా ఉన్న హైదరాబాద్—కల్వకుర్తి మార్గాన్ని 4 లైన్ల రహదారిగా అభివృధ్ది చేయాలని ఈ సందర్భంగా నితిన్ గడ్కరీని కోరారు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు. తెలంగాణకు రాష్ట్ర రోడ్డు మౌలిక సదుపాయాల నిధుల కింద 2021 ఏడాదికి రూ. 744 కోట్లు ఇవ్వాల్సి ఉంది. కానీ, ఇప్పటివరకు కేవలం రూ.250 కోట్లు మాత్రమే కేటాయించారని ఆయన గడ్కరీ దృష్టికి తీసుకెళ్లారు.. ఆమోదం పొందిన రోడ్ల నిర్మాణం పూర్తి చేసేందుకు మిగిలిన నిధులను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు.. రాష్ట్ర వ్యాప్తంగా 3,306 కిలోమీటర్ల రాష్ట్ర రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని నిర్ణయించారు.. ఇప్పటివరకు 2,168 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించినందుకు కృతజ్ఞతలు తెలిపారు. మిగిలిన 1,138 రహదారుల్లో 4 రాష్ట్ర అత్యంత ప్రధాన రహదారులు ఉన్నాయని.. “రీజనల్ రింగ్ రోడ్డు”లో భాగమైన చౌటుప్పల్-కంది 182 కిలోమీటర్లు ఉందని.. కరీంనగర్-పిట్లం 165 కిలోమీటర్లు, కొత్తకోట – మంత్రాలయం 70 కిలోమీటర్లు, జహీరాబాద్-దేగ్లుర్ 25 కిలోమీటర్ల రహదారులను జాతీయ రహదారులుగా గుర్తించాలని విజ్ఞప్తి చేశారు. కాగా, ఢిల్లీలో టీఆర్ఎస్ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసేందుకు వెళ్లిన కేసీఆర్.. గత ఆరు రోజులుగా హస్తినలోనే మకాం వేసిన సంగతి తెలిసిందే.
Also Read
- Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
- Marital Rape: వైవాహిక అత్యాచారంపై సుప్రీంకోర్టు కీలక విచారణ.. తెగే పంచాయితీనేనా?
- UPI Charges: యూపీఐ చెల్లింపులపై 18% జీఎస్టీ? వ్యాపారులకు కొత్త ఛార్జీలు! నిపుణులు అంచనా ఇదే
- Tata Sons: టాటా గ్రూప్‌లో కీలక పరిణామం.. పగ్గాలు మళ్లీ చంద్రశేఖరన్‌కే.. లొల్లి తప్పదా?
- Tags
- bjp
- cm kcr
- Delhi
- kcr
- nitin gadkari
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్‌లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్‌న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్‌కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్‌లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్‌తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!