MRO Ramanaiah: విశాఖలో హత్యకు గురైన తహసీల్దార్ రమణయ్య ఇంట్లో మరో విషాదం చోటుచేసుకుంది. ఇటీవలే తహసీల్దార్ రమణయ్య హత్యకు గురైన విషయం తెలిసిందే. తహసీల్దార్ రమణయ్యకు వరుసకు సోదరుడు రాజేంద్ర మృతి చెందారు, గత కొంతకాలంగా కిడ్నీ సమస్యలతో రాజేంద్ర బాధపడుతున్నాడు. తహశీల్దార్ రమణయ్య హత్య జరిగిన రోజు పొంతన లేని విషయాలు చెప్పాడట రాజేంద్ర. చీపురుపల్లిలో భూమి వివాదంలో ప్రసాద్ అనే వ్యక్తి…తహసీల్దార్ రమణయ్య హత్యకు కారణమని అనుమానం వ్యక్తం చేశాడు రాజేంద్ర. తహసీల్దార్ రమణయ్య హత్య కేసుతో సంబంధం లేని విషయాలను ప్రచారంలోకి తేవడంపై అనుమానాలు తెరపైకి వస్తున్నాయి. నిందితుడు గంగారాం అరెస్టుతో కేసు విచారణలో కీలక ఆధారాలు సేకరించిన పోలీసులు..ఇప్పుడు రాజేంద్ర మృతిపై కూడా విచారణ చేస్తున్నారు.
Read Also: CM YS Jagan: నేడు రాప్తాడులో ‘సిద్ధం’ సభ… పాల్గొననున్న సీఎం జగన్