నేటి సమాజంలో బంధాలకు విలువ లేకుండా పోతోంది. తమ కామవాంఛ తీర్చుకోవడానికి ఎంతటి దారుణానికైనా ఒడిగడుతున్నారు కొందు. అలాంటి ఘటనే ఇది. మేన బావతో అక్రమ సంబంధం పెట్టుకొని.. వారి అక్రమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భర్తని హత్య చేయించింది ఓ భార్య… ఈ ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది. వికారాబాద్ జిల్లాలోని పూడూరు మండలం చెన్గోముల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎంకేపల్లి గ్రామ శివారులో ఈనెల 17న సంజీవ్ కుమార్ (38) అనే వ్యక్తిని హత్య చేసిన విషయంలో ముగ్గురు నిందితులను అరెస్టు చేశారు పోలీసులు.
మృతుడు సంజయ్ కుమార్ భార్య అనిత అక్రమ సంబంధమే ఈ హత్యకు కారణమని దర్యాప్తులో పోలీసులు గుర్తించారు. మేన బావ అయినా గోపాల్ అనే వ్యక్తితో అక్రమ సంబంధం ఉండటంతో అక్రమ సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను అడ్డు తొలగించుకునేందుకే 17వ తేదీ రాత్రి రాయల్ స్టాగ్ ఫుల్ బాటిల్ తో తల వెనక భాగంపై మోది ఆ తర్వాత కర్రతో కొట్టి హత్య చేశాడు గోపాల్ అనే వ్యక్తి. భర్త సంజయ్ వాళ్ళ వివాహేతర బంధానికి అడ్డువస్తున్నాడని హతమార్చేందుకు పన్నాగం పన్ని వికారాబాద్ కు తీసుకువెళ్లి మద్యం తాగించి ఎంకేపల్లి గ్రామ శివారులో హత్య చేశాడు గోపాల్ అతని స్నేహితుడు లాల్ ప్రసాద్. ఈ నేపథ్యంలో.. హత్య కేసులో నిందితులుగా A1 గోపాల్ A2 బల్లా లాలూ ప్రసాద్ A3 హరిజన అనిత లుగా గుర్తించి రిమాండ్ కు తరలించారు పోలీసులు..