వరంగల్ జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందగా.. మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. ఈ ఘటన పర్వతగిరి మండలం మోత్య తండాలో జరిగింది. విద్యుత్ షాక్ కు గురైన వారిలో మొత్తం నలుగురు యువకులు ఉన్నారు. కాగా.. మొదటగా భూక్యా దేవేందర్ అక్కడికక్కడే మృతి చెందగా.. గాయాలతో ఉన్న సునీల్, రవిని ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందారు.
MS Dhoni New Role: కొత్త సీజన్.. కొత్త రోల్ కోసం సిద్ధం.. ఎంఎస్ ధోని ఆసక్తికర పోస్ట్
తీవ్ర గాయపడ్డ మరొకరిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు స్థానికులు. అయితే.. రేపు(మంగళవారం) దుర్గమ్మ పండుగ నేపథ్యంలో ఏర్పాటు చేస్తుండగా విద్యుత్ షాక్ గురయ్యారు. వీరంతా ఒకే కుటుంబానికి చెందిన తండ్రి, కొడుకు, అల్లుడు మృతి చెందారు. ఏడేళ్ల బాలుడు యశ్వంత్ పరిస్థితి విషమంగా ఉంది. చికిత్స నిమిత్తం బాలుడిని వరంగల్ ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. మరోవైపు.. విద్యుత్ షాక్ తో ముగ్గురు మృతి చెందిన సమాచారం అందుకున్న స్థానిక ఎమ్మెల్యే నాగరాజు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం బాధిత కుటుంబాలను పరామర్శించారు. మృతుల కుటుంబాలను ఆదుకుంటామని హామీ ఇచ్చారు.
Supreme court: ఎలక్టోరల్ బాండ్లపై ఎస్‌బీఐ అభ్యర్థన ఇదే!