పెళ్లి చేసుకుని హ్యాపీగా తన భాగస్వామితో జీవించాల్సింది.. ఇంకో నాలుగు రోజుల్లో పెళ్లి.. ఇంట్లో సంబరాలు, హడవుడి ఉండాల్సింది. విషాదఛాయలతో నిండిపోయింది. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఓ యువకుడు విగతజీవిగా మారాడు. పెండ్లి పత్రికలు పంచడానికి వెళ్లి కనిపించకుండా పోయిన పెండ్లి కొడుకు.. వరంగల్ జిల్లా వర్ధన్నపేట మండలం కుమ్మరిగూడెం శివారు ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో మృతదేహమై కనిపించాడు. దీంతో వరుడి మిస్సింగ్ మిస్టరీ విషాదాంతం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఈనెల 16వ తేదీన తన వివాహం జరగాల్సి ఉంది. నర్సంపేటకు చెందిన యువతితో కృష్ణతేజకు వివాహం నిశ్చయించుకున్నారు. ఇంతలోనే శవమై తేలాడు.
Read Also: Aa Okkati Adakku Teaser: అమ్మాయి అయితే ఏంటి.. ఆంటీ అయితే ఏంటి.. పెళ్లి అయితే చాలు
తన పెళ్లి ఉందని బంధువులకు పెళ్లి పత్రికలు పంచడం కోసమని వెళ్లి అదృశ్యమయ్యాడు హనుమకొండకు చెందిన కృష్ణతేజ్. ఆదివారం సాయంత్రం నుండి అతని ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉంది. ఏమైందో ఏమో తెలియదు గానీ.. పలివెల్పుల ఎస్సార్ఎస్పీ కెనాల్ వద్ద కృష్ణతేజ బైక్ ను గుర్తించారు. దీంతో.. వెంటనే కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ లో కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. దీంతో సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు.. ఎస్సార్ఎస్పీ కెనాల్ లో గాలించగా కృష్ణతేజ మృతదేహం లభ్యమైంది. దీంతో.. కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. అయితే ఈ ఘటనపై పోలీసులు.. హత్యా..? ఆత్మహత్యా..? అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. దీని వెనుక ప్రేమ వ్యవహారం ఏదైనా ఉందా అనే కోణంలోనూ విచారిస్తున్నారు.
Read Also: Oscars 2024: పాపం…. ఆస్కార్ అవార్డు తీసుకుంటున్న హీరోయిన్ డ్రెస్ చిరిగిపోయింది!