తెలుగు రాష్ట్రాల్లో విద్యార్థినుల ఆత్మహత్యలు కలకలం రేపుతున్నాయి. ఇటీవలే తెలంగాణలోని భువనగిరి సాంఘీక వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినుల ఆత్మహత్య ఘటన మరువక ముందే ఆంధ్రప్రదేశ్ లో మరో ఘటన చోటు చేసుకుంది. తాజాగా.. అల్లూరి జిల్లా అరకు లోయలో హాస్టల్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది.
Read Also: Viral Video: నువ్వు తోపు అన్న.. బైక్పై మహిళను ఎక్కడ కూర్చోబెట్టుకున్నాడో తెలుసా..!
తొమ్మిదో తరగతి చదువుతున్న కిల్లో వసంత అనే విద్యార్థిని ఏమైందో ఏమో తెలియదు కానీ.. ఈ మధ్యాహ్నం ఆత్మహత్య చేసుకుంది. డుబ్రిగూడ మండలం ఓంబి గ్రామానికి చెందిన వసంత ఇంటికి వెళ్లి ఈ మధ్యాహ్నమే తిరిగి హాస్టల్ కు వచ్చింది. తన తండ్రి ఓ హత్య కేసులో ఇటీవలె జైలు నుండి విడుదలై వచ్చాడు. ఈ క్రమంలో తండ్రిని చూసేందుకు వెళ్లి మళ్లీ తిరిగి హాస్టల్ కు వచ్చింది. అయితే ఇంటికి వెళ్లి వచ్చాక ఆత్మహత్య చేసుకోవడంపై పలు అనుమానాలు రేపుతున్నాయి. ఇంటి దగ్గర ఏమైనా గొడవలయ్యాయా.. లేదంటే హాస్టల్ లో ఎవరైనా మందలించారా అనే విషయాలు తెలియాల్సి ఉంది. కాగా.. ఈ ఘటనలో ఆత్మహత్యకు గల కారణాలను పోలీసులు విచారిస్తున్నారు.
Read Also: Sandeshkhali: మహిళలపై టీఎంసీ నేత అఘాయిత్యాలతో అట్టుడుకుతున్న “సందేశ్‌ఖాలీ”..