నాగర్ కర్నూల్ జిల్లాలో తీవ్ర విషాదం నెలకొంది. ఈదురుగాలుల బీభత్సానికి తాడూరు మండలం ఇంద్రకల్ గ్రామ సమీపంలో నిర్మాణంలో ఉన్న కోళ్ల ఫారం ప్రహరీ గోడ కూలింది. ఈ ఘటనలో గోడ మీద పడటంతో నలుగురు కార్మికులు మృతి చెందారు. మరో ఇద్దరి కార్మికుల పరిస్థితి విషమంగా ఉంది. దీంతో వెంటనే వారిని ఆస్పత్రికి తరలించారు. కాగా.. రెండు గంటలుగా ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురుస్తుంది. మరోవైపు.. రాష్ట్ర వ్యాప్తంగా ఈదురుగాలులు, పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి.
Read Also: Amit Shah: ఏపీ, ఒడిశాలో గెలవబోతున్నాము.. అమిత్ షా ధీమా..
ఇంతకుముందు తెలకపల్లి మండల కేంద్రంలో పిడుగుపడి లక్ష్మణ్ (13) అనే బాలుడు చనిపోయాడు. మరోవైపు.. మేడ్చల్ జిల్లా శామీర్ పేట సమీపంలో ఈదురుగాలులకు భారీ వృక్షం విరిగి బైక్ మీద పడటంతో ఇద్దరు వ్యక్తులు అక్కడికక్కడే ప్రాణాలు వదిలారు. నల్గొండలో భారీగా వీచిన ఈదురు గాలులతో పలు ప్రాంతాల్లో చెట్లు కూలాయి. ఈదురుగాలుల దాటికి పానగల్ ఫై ఓవర్ సమీపంలోని ఓ కన్వెన్షన్ హాల్ అద్దాలు ధ్వంసం అయింది. అటు కామారెడ్డి జిల్లా బాన్సువాడ మండలంలో ఈదురు గాలులు భీభత్సం సృష్టించాయి. బోర్లం, తాడ్కోల్, బుడిమి, కొత్తబాది తదితర గ్రామాల్లో వీచిన ఈదురు గాలులకు తీవ్ర నష్టం వాటిల్లింది.
బోర్లం గ్రామంలో విద్యుత్తు స్తంభాలు విరిగి నేలపై పడ్డాయి.
Read Also: Shakib Al Hasan: చరిత్ర సృష్టించిన షకీబ్ అల్ హసన్.. తొలి ఆటగాడిగా