Tragedy: మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం అంకన్నగూడెం గ్రామంలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. అంకన్నగూడెంలో ఇద్దరు పిల్లలకు పాలడబ్బాలో పురుగుల మందు కలిపి తాగించి కిరాతకంగా హత్య చేసిన తల్లిదండ్రులు కందగట్ల అనిల్-దేవి దంపతులు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పెండకట్ల అనిల్, దేవి దంపతులు. గ్రామంలోనే కిరాణ దుకాణం నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి లోహిత(3), జశ్విత(11నెలలు) అనే ఇద్దరు ఆడపిల్లలున్నారు.
Read Also: Rameshwaram Cafe Blast: రామేశ్వరం కేఫ్‌లో బాంబు అమర్చిన నిందితుడి అరెస్ట్
గత మార్చి 10వ తేదీన కుటుంబ కలహాలతో తమ ఇద్దరు పిల్లలకు పురుగుల మందు తాగించి హత్య చేసి ఇంట్లో నుంచి పరారయ్యారు. నేడు అడ్డగుట్ట అడవుల్లో అనిల్ -దేవి మృతదేహాలు లభ్యం అయ్యాయి. వారిద్దరు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు భావిస్తున్నారు. కుళ్లిపోయిన స్థితిలో ఉన్న మృతదేహాలను పోలీసులు అక్కడి నుంచి తీసుకెళ్లారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు.