సోదరసోదరీణుల అనుబంధానికి ప్రతీక అయిన రాఖీ పండుగ వేళ కాకినాడ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. అన్నకు రాఖీ కట్టడానికి వెళ్తూ రోడ్డు ప్రమాదంలో చెల్లి దుర్మరణం పాలైంది.
కృష్ణా జిల్లా అవనిగడ్డ నియోజకవర్గం హంసలదీవి బీచ్‌లో విషాదం చోటుచేసుకుంది. గుడివాడకు చెందిన ఐదుగురు సముద్రంలో కొట్టుకుపోతుండగా.. ముగ్గురిని తోటి పర్యాటకులు, మెరైన్ పోలీసులు కాపాడారు. ఇద్దరు సముద్రంలో గల్లంతు కాగా.. ఒకరి మృతదేహం ఒడ్డుకు కొట్టుకు వచ్చింది.
Suryapet Crime: సూర్యాపేట జిల్లాలో విషాద ఘటన జరిగింది. గీత కార్మికుడైన ఓ వృద్దుడు తనకు ఇన్నాళ్లు జీవనోపాధిని ఇచ్చిన తాటిచెట్టు పైకి ఎక్కి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు.
మధ్యప్రదేశ్‌లోని సాగర్‌లో విషాదం చోటు చేసుకుంది. గోరఖ్‌పూర్ నుంచి పూణే వెళ్తున్న పూణె వీక్లీ ఎక్స్‌ప్రెస్ జనరల్ కోచ్‌లోని ప్రయాణికులపై వేడి వేడి 'టీ' పడటంతో గందరగోళం నెలకొంది. ముగ్గురు ప్రయాణీకులపై టీ పడటంతో.. వారు ప్రయాణించే కోచ్ అల్లకల్లోలం అయింది. తమపై 'టీ' పడటంతో చాలా ఇబ్బందిగా, నొప్పిగి ఉందంటూ.. కోచ్ లో నెట్టడం, లాగడం చేశారు. ఈ గందరగోళంలో డోర్ వద్ద కూర్చున్న ఇద్దరు ప్రయాణికులకు తగలడంతో కదులుతున్న రైలు నుండి జారి పడిపోయారు
అమెరికాలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలికి చెందిన వెటర్నరీ డాక్టర్ జెట్టి హారిక(25) మృతి చెందింది. ఆమె మృతితో కుటుంబసభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. మృతదేహం కోసం భారత రాయబార కార్యాలయం వద్ద ఎదురుచూపులు చూస్తున్నారు.
ప్రకాశం జిల్లా టంగుటూరు మండలం వాసెపల్లిపాడులో విషాదం చోటుచేసుకుంది. ఈత కోసం వెళ్లి ఇద్దరు యువకులు మృతి చెందారు. మృతులు నవీన్(22),వెంకటేష్ (22)లుగా గుర్తించారు. టంగుటూరు మండలం పెళ్లూరు చెరువులో గురువారం ఈత కొట్టేందుకు వెళ్లి ఆ ఇద్దరు యువకులు చెరువు గుంటలో పడ్డారు.
ఏపీ అసెంబ్లీలో విధులు నిర్వహిస్తున్న మార్షల్ గుండెపోటుతో మృతి చెందాడు. కె.లూధియారావు అనే మార్షల్‌కు ఉదయం విధుల్లో ఉండగా గుండెపోటు రాగా.. వెంటనే తోటి సిబ్బంది మంగళగిరి ఎన్నారై హాస్పటల్‌కు తరలించారు.
రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ వే మీద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వేగంగా దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నెంబర్ 296 వద్ద డివైడర్‌ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది.
నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. మట్టి మిద్దె కూలి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషాద ఘటన నాగర్ కర్నూల్ మండలం వనపట్లలో జరిగింది.