ఉపరాష్ట్రపతి అభ్యర్థిని నిలబెట్టాలని ఇండియా కూటమి నిర్ణయం! ఖర్గే మంతనాలు జగదీప్ ధన్ఖర్ అనూహ్యంగా ఉపరాష్ట్రపతి పదవికి రాజీనామా చేశారు. దీంతో ఉపరాష్ట్రపతి ఎన్నిక అనివార్యమైంది. ఇప్పటికే ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేసింది. సెప్టెంబర్ 9న ఎన్నిక జరగనుంది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు పోలింగ్ జరగనుంది. అదేరోజు ఫలితం విడుదల కానుంది. ఇక ఉపరాష్ట్రపతి పదవిని కైవసం చేసుకునేందుకు అధికార ఎన్డీఏ కూటమికి సంపూర్ణ మద్దతు ఉంది. ఈజీగా ఈ…
కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదు..? కవిత సమాధానం ఇదే.. కేటీఆర్‌తో గ్యాప్‌పై మాట్లాడటానికి కవిత ఇష్టపడలేదు. కేటీఆర్‌కు రాఖీ ఎందుకు కట్టలేదన్న ప్రశ్నకు సమాధానం చెప్పకుండా దాటవేశారు. తాజాగా నిర్వహించిన ప్రెస్మీట్లో ఆమె మాట్లాడారు. బీఆర్ఎస్ పైనే ఫోకస్ ఎందుకని ప్రశ్నించారు. సీఎం రేవంత్ ఒక మాట, మంత్రి కోమటిరెడ్డి మరోమాట మాట్లాడుతారన్నారు. బండి సంజయ్ కు ఈటల వార్నింగ్ ఇచ్చినా.. చర్చ లేదన్నారు. బీఆర్ఎస్ గురించే ఎందుకు చర్చ చేస్తున్నారు? అని ప్రశ్నించారు. అనంతరం సింగరేణిపై…
కవిత ఎవరో నాకు తెలియదు.. మంత్రి కోమటిరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు! బీఆర్ఎస్ ఎమ్మెల్సీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఎవరో తనకు తెలియదు అంటూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కవిత బీసీ ధర్నా జోక్ అని ఎద్దేవా చేశారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల కోసం కేంద్రంతో కోట్లాడుతాం అని తెలిపారు. 42 శాతం బీసీ రిజర్వేషన్ల సాధన కోసం ఎమ్మెల్సీ కవిత ధర్నాచౌక్ వద్ద 72 గంటల నిరాహార దీక్షను…
సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో మరొకరి అరెస్ట్ సృష్టి ఫెర్టలిటి సెంటర్ కేసులో పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది. ఈ కేసులో గోపాలపురం పోలీసులు మరొకరిని అరెస్ట్ చేశారు. కృష్ణ అనే ఏజెంట్ ను అరెస్ట్ చేశారు. నిన్న ఏజెంట్లు హర్షరాయ్, సంజయ్, రిసెప్షనిస్ట్ నందిని అరెస్ట్ చేశారు పోలీసులు. దీంతో ఈ కేసులో అరెస్ట్ ల సంఖ్య 12కి చేరింది. విశాఖ పట్నంలోని ఏజెన్సీ ప్రాంతాలు, విజయవాడ, హైదరాబాద్ ప్రాంతాల్లో పిల్లలను విక్రయించే వారి కోసం ఏజెంట్లు…
ఐఐటీ బాంబేలో విద్యార్థి ఆత్మహత్య.. కలవరపెడుతున్న వరుస ఘటనలు దేశ వ్యాప్తంగా వరుస విద్యార్థుల ఆత్మహత్యలు కలవరం పెడుతున్నాయి. ప్రొఫెసర్ వేధింపులు కారణంగా ఒడిశాలో ఒక విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అనంతరం ఆయా రాష్ట్రాల్లో అధ్యాపకుల వేధింపులు కారణంగా వైద్య విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. ఇలాంటి సంఘటలు రోజురోజుకు పెరిగిపోవడంతో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా ఐఐటీ-బాంబేలో 22 ఏళ్ల విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. విద్యార్థి……
మరోసారి ఢిల్లీ పర్యటనకు సీఎం రేవంత్ రెడ్డి .. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీ పర్యటనకు వెళ్ళనున్నారు.. ఇవాళ రాత్రి ఢిల్లీకి చేరుకొని, రేపు ఢిల్లీ విజ్ఞాన్ భవన్లో జరిగే జరిగే న్యాయసదస్సు కు సీఎం రేవంత్ రెడ్డి హాజరవుతారు.. కాంగ్రెస్ న్యాయ విభాగం ఆధ్వర్యంలో హ్యూమన్ రైట్స్, సమాచార చట్టానికి స్పందించిన అంశాలపై వార్షిక సదస్సు నిర్వహిస్తున్నారు.. ఢిల్లీ విజ్ఞాన్ భవన్ లో జరిగే ఈ సదస్సుకు, ఎఐసిసి ముఖ్య నేతలతో పాటూ,…
‘‘పరువు హత్య’’.. 25 ఏళ్ల దళిత యువకుడి దారుణ హత్య.. తమిళనాడులో 25 ఏళ్ల దళిత యువకుడి హత్య సంచలనంగా మారింది. దీనిని ‘‘పరువు హత్య’’గా భావిస్తున్నారు. తూత్తుకుడికి చెందిన కవిన్ తిరునెల్వెలిలోని ఒక ప్రైవేట్ ఆస్పత్రికి సమీపంలో హత్యకు గురయ్యాడు. కవిన్ ఒక ఐటీ సంస్థలో ఉద్యోగం చేస్తున్నాడు. అతడికి కేటీసీ నగర్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో పనిచేస్తున్నా తన మాజీ స్కూల్ విద్యార్థినితో సంబంధం ఉందని తెలుస్తోంది. అమ్మాయి కుటుంబం నుంచి వ్యతిరేకత వచ్చినా,…
ఎన్ని చర్చిలు, మసీదులు ఉన్నా, గుడిని మాత్రమే ఎందుకు టార్గెట్ చేశారు? తెలంగాణలో బోనాల పండుగ సందర్భంగా బంజారాహిల్స్‌లోని పెద్దమ్మ గుడిని కూల్చడం పట్ల కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి, బీజేపీ సీనియర్ నేత బండి సంజయ్ కుమార్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనను దారుణమైన చర్యగా అభివర్ణిస్తూ, దీని వెనుక రాజకీయ కుట్ర ఉందని, జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ఒక వర్గం ఓట్లను సంపాదించేందుకు కాంగ్రెస్ ఈ చర్యకు పాల్పడిందని ఆయన…
మిస్టరీగానే గండికోట మైనర్ బాలిక హత్య కేసు.. ఎస్పీ ఏం చెప్పారంటే..? కడప జిల్లాలోని గండికోటలో మైనర్ బాలిక వైష్ణవి హత్య కేసు మిస్టరీగా ఉంది. ఈ సందర్భంగా రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ మాట్లాడుతూ.. గండికోట మైనర్ బాలిక కేసు కాస్త సమయం పడుతుంది అన్నారు. సెల్ టవర్ ఆధారంగా 350 మంది అనుమానితుల ముబైల్ సిగ్నల్స్ గుర్తించాం.. అదే రోజు పక్కనే ఉన్న గ్రామంలో ఒక జాతర జరిగింది.. రెండు సెల్ టవర్ల…
గతంలో ఎప్పుడూ కేసులు పెట్టిన దాఖలాలు లేవు.. మమల్ని వేధిస్తున్నారు..! నేడు సత్తెనపల్లి పోలీసుల ఎదుట విచారణకు హాజరు అయ్యారు మాజీ మంత్రులు విడదల రజినీ, అంబటి రాంబాబు. జగన్ రెంటపాళ్ల పర్యటన సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించిన కేసులో అంబటిని, జగన్ పర్యటన సమయంలో నిబంధనలు ఉల్లంఘించిన కేసులో విడదల రజినీని విచారించారు పోలీసులు. మాజీ మంత్రి అంబటి రాంబాబు మాట్లాడారు. సత్తెనపల్లి పిఎస్ లో విచారణకు హాజరయ్యాం. వాళ్లు అడిగిన ప్రశ్నలకు సమాధానం…