అడవిలో ఫోటోలు దిగుతున్న యువకుడు.. పొదల్లోకి లాక్కెళ్లిన పులి రోజు ఎన్నో రకాల వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంటాయి. ప్రస్తుతం ఒక వీడియో మాత్రం అందరిని ఒక్కసారిగా భయభ్రాంతులకు గురిచేసింది. అయితే.. ఓ వ్యక్తి తన గర్ల్ ఫ్రెండ్ కోసం అడవిలో కారు దిగి.. పోటోలు దిగుతుండగా.. ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు గానీ.. ఓ పులి ఆ యువకుడిని పొదల్లోకి లాక్కెళ్లింది. దీంతో అక్కడున్న వాళ్లంతా భయాందోళనకు గురయ్యారు. ఈ వీడియో వైరల్ అవుతుంది.…
ముగిసిన మొదటిరోజు ఆట.. స్కోర్ ఎంతంటే? కోల్కతా ఈడెన్ గార్డెన్స్ వేదికగా భారత్, దక్షిణాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ తొలి రోజు వార్ వన్ సైడ్ లా ముగిసింది. టాస్ గెలిచిన భారత్ బౌలింగ్ ఎంచుకోగా.. ఆ నిర్ణయం పూర్తిగా ఫలితాన్ని ఇచ్చింది. భారత బౌలర్ల దెబ్బకు దక్షిణాఫ్రికా జట్టు తొలి ఇన్నింగ్స్లో కేవలం 159 పరుగులకే ఆలౌట్ అయింది. ఇక దక్షిణాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం బాగానే కనిపించినా.. ఆ తర్వాత భారత బౌలర్లు…
కుంభ, మందాకిని అదుర్స్.. ఇక నెక్స్ట్ రుద్ర, సోషల్ మీడియా షేకే! ‘సూపర్ స్టార్’ మహేష్ బాబు, దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కాంబినేషన్లో వస్తున్న ‘ఎస్ఎస్ఎంబీ 29’ నుంచి వరుస అప్డేడ్స్ వస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుంచి చిత్ర యూనిట్ పృథ్వీరాజ్ సుకుమారన్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసింది. ఆయన ‘కుంభ’ అనే పాత్రలో విలన్గా నటిస్తున్నట్టుగా తెలిపారు. అయితే వీల్ చైర్లో ఉన్న కుంభ లుక్పై కాస్త ట్రోలింగ్ జరిగింది కానీ.. సైంటిఫిక్గా రాజమౌళి…
భూముల వేలంలో రికార్డు.. రాయదుర్గంలో గజం ధర రూ.3.40 లక్షలు తెలంగాణ స్టేట్ ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్ (TGIIC) నిర్వహించిన వేలంలో భూముల ధరలు రికార్డు సృష్టించాయి. హైదరాబాద్ నాలెడ్జ్ సిటీకి నడిబొడ్డున ఉన్న రాయదుర్గం ప్రాంతంలో ఒక ఎకరం భూమికి చదరపు గజానికి రూ.3,40,000 ల చొప్పున గణనీయమైన ధర పలికింది. చదరపు గజానికి ₹3,40,000 ల చారిత్రాత్మక ధరతో ఈ వేలం మునుపటి రికార్డును బద్దలు కొట్టింది. గతంలో, 2017లో చదరపు గజానికి రూ.88,000…
దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణకు కీలక నిర్ణయం రాష్ట్రంలోని దేవాలయాల్లో తొక్కిసలాట ఘటనల నివారణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దృష్టి సారించింది. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టేందుకు మంత్రివర్గ ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. దేవాలయాల్లో తొక్కిసలాటల నివారణ, భద్రతా చర్యల పర్యవేక్షణ కోసం ఏర్పాటు చేసిన ఈ ఉపసంఘం, క్రమం తప్పకుండా పరిస్థితులను సమీక్షించి సూచనలు ఇవ్వనుంది. ప్రత్యేకంగా, 2019-24 మధ్యలో దేవాలయాలపై జరిగిన దాడులు, వాటిపై తీసుకున్న చర్యలపై…
కేసీఆర్కు 40 లెటర్లు రాశాను.. కిషన్రెడ్డి కీలక వ్యాఖ్యలు.. ఓటు వేయక పోతే సన్న బియ్యం, ఫ్రీ బస్ ఆగిపోతుంది అని సీఎం అన్నారు.. సన్నబియ్యంలో కేంద్ర ప్రభుత్వానిదే సింహభాగం.. ఏ విధంగా సీఎం ఆపుతారో చెప్పాలని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి ప్రశ్నించారు. సకల సమస్యలకు పరిష్కారం ఫ్రీ బస్సు అనే విధంగా కాంగ్రెస్ వ్యవహరిస్తుందన్నారు. కేంద్ర ప్రభుత్వం నుంచి వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు వచ్చిన నిధులను, వచ్చిన సంస్థల వివరాలు కిషన్రెడ్డి వివరించారు. వచ్చే ఏడాది…
బెంగాల్ మదర్సాలో ఫుడ్ పాయిజనింగ్..100 మందికి అస్వస్థత.. పశ్చిమ బెంగాల్లోని తూర్పు బుర్ద్వాన్ లోని ఒక ప్రైవేట్ రెసిడెన్షియల్ మదర్సాలో దాదాపుగా 100 మంది విద్యార్థులు శనివారం తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఫుడ్ పాయిజనింగ్ కారణంగా వీరంతా ఆస్పత్రి పాలయ్యారు. ఈ సంఘటన అన్స్గ్రామ్ లోని పిచ్కురి నవాబియా మదర్సాలో జరిగింది. శనివారం ఉదయం దాదాపు 7-8 మంది విద్యార్థులు కడుపు నొప్పి, వాంతులు, విరేచనాలతో బాధపడ్డాడు. ఆ తర్వాత గంట గంటకు బాధిత విద్యార్థుల సంఖ్య…
తుఫాన్ సమయంలో ప్రజలకు అండగా నిలిచాం.. గుంటూరు జిల్లా తెనాలిలో మొంథా తుఫాన్ బాధితులకు మంత్రి నాదెండ్ల మనోహర్ నిత్యావసర సరుకులు, ఆర్థిక సాయం పంపిణీ చేశారు. చంద్రబాబు కాలనీలో పునరావాస కేంద్రాల్లో ఉన్న 615 మందికి మూడు రోజులకు సరిపోయే నిత్యావసర సరుకులు అందజేశారు. ఈ కార్యక్రమంలో మంత్రి నాదెండ్ల, కలెక్టర్ తమీమ్ అన్సారియా, సబ్ కలెక్టర్ సంజనా సింహతో పాటు పలువురు అధికారులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ.. అధికార…
శ్రేయస్ హెల్త్ అప్డేట్ ఇచ్చిన సూర్యకుమార్.. ఏం చెప్పాడంటే?! సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన మూడో వన్డేలో వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ గాయపడిన విషయం తెలిసిందే. క్యాచ్ అందుకునే ప్రయత్నంలో తీవ్ర గాయానికి గురైయ్యాడు. ప్రస్తుతం సిడ్నీలోని ఓ ఆసుపత్రిలో అతడు చికిత్స పొందుతున్నాడు. శ్రేయస్ ఆరోగ్యం గురించి టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అప్డేట్ ఇచ్చాడు. ప్రస్తుతం శ్రేయస్ బాగానే ఉన్నాడని, వైద్యులు నిత్యం అతన్ని పర్యవేక్షిస్తున్నారని చెప్పాడు. ఇది మనకు శుభవార్త…
ఏపీకి హైఅలర్ట్.. రాబోయే మూడు రోజులు ఎక్కడికి వెళ్లొద్దు.. మొంథా తుఫాన్ రాష్ట్రంపై తీవ్ర ప్రభావం చూపించే అవకాశం ఉండటంతో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేశారు. ఈనెల 27, 28, 29 తేదీల్లో తీరప్రాంత జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు, తీవ్రమైన గాలులు వీస్తాయని వాతావరణ శాఖ జారీ చేసిన హెచ్చరికల నేపథ్యంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. వాయుగుండం 28వ తేదీ ఉదయం నాటికి తీవ్రమైన తుఫానుగా మారుతుందని, ఈ…