బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదు… కవితను పార్టీ లోకి తీసుకోము.. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా కవిత, బీఆర్ఎస్ అంశం హాట్ టాపిక్‌గా మారింది. ఆమె బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌రావు కీలక వ్యాఖ్యలు చేశారు. బీజేపీలో అవినీతి పరులకు స్థానం లేదని… కవితని పార్టీ లోకి తీసుకోమని స్పష్టం చేశారు. గబ్బర్ సింగ్ టాక్స్ అన్న వారి తలలో మెదడు లేదు పెండ(గోబర్)…
ఎమ్మెల్సీ పదవికి కల్వకుంట్ల కవిత రాజీనామా! ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసినట్లు కల్వకుంట్ల కవిత అధికారికంగా ప్రకటించారు. భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. మంగళవారం కవితను బీఆర్ఎస్ పార్టీ సస్పెండ్ చేసింది. ఈ నేపథ్యంలో ఈరోజు హైదరాబాద్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ఆమె మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ పదవికి, బీఆర్ఎస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేసినట్లు చెప్పారు. నిజామాబాద్ జిల్లా నుంచి స్థానిక సంస్థల…
సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట! తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి హైకోర్టులో ఊరట లభించింది. 2021లో నమోదైన కేసులో వ్యక్తిగత హాజరు నుంచి తెలంగాణ హైకోర్టు మినహాయింపు ఇచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని పబ్లిక్ ప్రాసిక్యూటర్ పల్లె నాగేశ్వర్ రావును కోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ అక్టోబర్ 7వ తేదీకి వాయిదా వేసింది. సైఫాబాద్ పోలీస్‌స్టేషన్‌లో తనపై నమోదైన కేసును కొట్టేయాలని సీఎం రేవంత్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఏఐసీసీ పిలుపు మేరకు 2021లో…
నారాయణస్వామిపై ప్రభుత్వ విప్ హాట్ కామెంట్స్.. అలా జరిగితే నేనైతే ఊరి వేసుకొని చచ్చిపోతా..! వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత, ఏపీ మాజీ డిప్యూటీ సీఎం నారాయణస్వామిపై హాట్ కామెంట్స్ చేశారు ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే థామస్.. చిత్తూరు జిల్లా జీడి నెల్లూరు ధర్మ చెరువు గ్రామంలో ఎన్టీఆర్ పెన్షన్లు పంపిణీ చేసిన ఆయన.. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మాట్లాడుతూ.. నారాయణస్వామిపై సంచలన వ్యాఖ్యలు చేశారు.. నారాయణస్వామి ఓ పిచ్చోడు, అవినీతిపరుడు అని…
ప్రతిపక్ష నాయకుడు బాధ్యతలు హరీష్ రావుకు అప్పగించాలి తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో కాంగ్రెస్ సీనియర్ నేతలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి మధ్య ఆసక్తికరమైన చిట్ చాట్ జరిగింది. రేపు అసెంబ్లీలో కాలేశ్వరం కమిషన్ నివేదిక ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఇద్దరు నేతలు సరదాగా మాట్లాడుకున్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి, “మా స్టార్ బ్యాట్స్‌మన్ నువ్వే” అని కోమటిరెడ్డి వెంకటరెడ్డిని ఉద్దేశించి చెప్పగా, వెంటనే స్పందించిన కోమటిరెడ్డి, “మా కెప్టెన్ నువ్వే” అంటూ ఉత్తమ్‌ను…
పాకిస్థాన్‌కు ఘోర అవమానం.. బోరున విలపించిన కెప్టెన్ సల్మాన్ అఘా! దుబాయ్ గడ్డపై అడుగుపెట్టిన పాకిస్థాన్ కెప్టెన్ సల్మాన్ అఘాకు ఘోర అవమానం జరిగింది. అఫ్ఘానిస్థాన్ కెప్టెన్ రషీద్ ఖాన్‌ను ఓ జర్నలిస్ట్ అడిగిన ప్రశ్న పాక్ సారథిని ఒక్కసారిగా ఇబ్బందుల్లోకి నెట్టేసింది. అటు నవ్వలేక, ఇటు ఏడ్వలేక అలా చూస్తూ ఉండిపోయారు. ఎక్కడికి వెళ్లినా మమ్మల్ని వదలరుగా అంటూ తీవ్ర ఇబ్బంది పడ్డాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. అయితే, సెప్టెంబర్…
గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం.. సీపీ సీవీ ఆనంద్ కీలక వ్యాఖ్యలు దేశ వ్యాప్తంగా కొలువుదీరిన గణేషుడు భక్తుల నుంచి పూజలందుకుంటున్నాడు. పూజలు, భజనలతో గణపయ్య భక్తులు భక్తిపారవశ్యంలో మునిగితేలుతున్నారు. కాగా కొందరు మూడో రోజు నుంచే నిమజ్జనం చేస్తుంటారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సీపీ సీవీ ఆనంద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి కీలక వ్యాఖ్యలు చేశారు. గణేష్ నిమజ్జనానికి హైదరాబాద్ పోలీసులు సిద్ధం అని తెలిపారు. ఈ ఏడాది నిమజ్జనానికి 30 వేల మంది…
ఆ 25 ఎకరాల టీటీడీ భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు..? అలిపిరి రోడ్డులోని రూ. 1500 కోట్లకు పైగా విలువ చేసే 25 ఎకరాల తిరుమల తిరుపతి దేవాస్థానం భూమిని టూరిజం శాఖకు ఎలా ఇస్తారు అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ప్రశ్నించారు. టీటీడీ బోర్డు మీటింగ్ లో మా అభ్యంతరాలను తిరస్కరించారు.. దేవుడు భూమిని రక్షించాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి చంద్రబాబుకు లేదా.. 25 ఎకరాల టీటీడీ ల్యాండ్ ను టూరిజం…