భర్త, అత్తపై కోడలు అరాచకం.. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం దాడి
అత్తలేని కోడలు ఉత్తమురాలు.. కోడలు లేని అత్త గుణవంతురాలు అనేది సామెత.. అంటే వీరిలో ఎవరో ఒకరు మాత్రం ఇంట్లో ఉంటేనే బాగుంటుంది. లేదంటే రచ్చ రంబోలానే.. గతంలో అత్త, భర్త హవా నడిచేది. భర్త, అత్త కూర్చోమంటే కూర్చునేవారు.. నిలబడమంటే నిలబడేవారు.. అలా హుకుం జారీ చూస్తూ వారి పెత్తనాలు సాగుతుండేవి. అలా అని గడసరి కోడళ్లు కూడా లేకపోలేదండోయ్. అత్త, భర్త ప్రవర్తన, మాట తీరును బట్టి నడుచుకునే కోడళ్లు ఉన్నట్లే.. కోడలి నడవడికను బట్టి మారిన పొగరు అత్తలు కూడా ఉన్నారంటే నమ్మాల్సిందే. కానీ నేటి తరం కాస్త భిన్నంగా మారింది. ఉద్యోగాల పేరిట కొడుకులు దూర భారంగా ఉండటంతో కాస్తంత అత్త-భర్త-కోడలి పోరు తగ్గింది కానీ.. ఉంటే ఇళ్లు రణరంగమే అని చెప్పాలి. అలా అని అత్త-భర్తను హింసించే కోడళ్లు లేరా అంటే ఎందుకు లేరండోయ్ దీనికి ఇదిగో ఈ ఘటనే ఓ ఉదాహరణ. ఇన్సూరెన్స్ డబ్బుల కోసం భర్త, అత్తపై ఓ మహిళ హత్యాయత్నం చేయించిన బేగంబజార్‌లో కలకలం రేపింది.
రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
ఈ నెల 18వ తేదీన శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలో రాష్ట్ర కేబినెట్ సమావేశం జరగనుంది. రాష్ట్ర పునర్విభజన జరిగి పదేండ్లు పూర్తి కానుండటంతో పునర్విభజన చట్టానికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న అంశాలతో తెలంగాణ, ఏపీ మధ్య అపరిష్కృతంగా ఉన్న అంశాలపై కేబినెట్‌లో చర్చించనున్నారు. ఆగస్ట్ 15లోపు రైతుల రుణమాఫీ చేసి తీరాలని ముఖ్యమంత్రి ఇప్పటికే అధికారులను ఆదేశించారు. అందుకు సంబంధించిన నిధుల సమీకరణపై చర్చించనున్నారు.
5 నిమిషాలు సీపీఆర్ చేశా.. పిల్లాడి ప్రాణం కాపాడటం ఆనందంగా ఉంది..
అప్పటివరకు ఎంతో చలాకీగా ఆడుకుంటున్న పిల్లాడు ఒక్కసారిగా కుప్పకూలాడు. ఆ బాలుడి తల్లిదండ్రులు ఎంత పిలిచినా ఉలుకూ పలుకూ లేకపోవడంతో వారి గుండె ఆగినంత పనైంది. దుఃఖాన్ని దిగమింగి ఆ బాలుడిని భుజాన వేసుకొని ఆస్పత్రికి పరుగులు తీశారు. ఆ సమయంలో అటుగా వెళ్తున్న ఓ వైద్యురాలు ఆ తల్లిదండ్రుల ఆవేదనను తెలుసుకొని చిన్నారికి ఊపిరిపోసేందేకు ప్రయత్నించింది. రోడ్డుపైనే బాలుడికి సీపీఆర్ అందించగా.. ఆ బాలుడు మళ్లీ ఊపిరితీసుకున్నాడు. విజయవాడలో చోటుచేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. బాలుడి ప్రాణాలు రక్షించిన డాక్టర్ రవళిపై అందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. బాలుడి ప్రాణాలు నిలిపిన వైద్యురాలు రవళి ఎన్టీవీతో మాట్లాడారు.
టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్ కిన్ తయారీ యూనిట్లు
టెస్కో ద్వారా రాష్ట్రంలో శానిటరీ నాప్ కిన్ తయారీ యూనిట్ల ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి తుమ్మల నాగేశ్వర రావు తెలిపారు. ఇవాళ సెక్రటేరియట్‌లో తుమ్మల నాగేశ్వరరావు తన శాఖలపై పరిశ్రమల శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, టీ.ఎస్.ఐ.ఐ.సి ఎండీ విష్ణువర్ధన్ రెడ్డి, జౌళిశాఖ సంచాలకులు అలుగు వర్షిణి, హార్టికల్చర్ సంచాలకులు అశోక్ రెడ్డి, వ్యవసాయ మార్కెటింగ్ శాఖ సంచాలకులు జి. లక్ష్మీబాయితో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి తుమ్మల నాగేశ్వర రావు మాట్లాడుతూ.. అకాల వర్షాల వలన రైతులు పంట నష్టపోకుండా ప్రతి జిల్లాలో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
ఇంటికి వెళ్తున్న బాలికపై తాగుబోతు వేధింపులు.. సీసీటీవీలో షాకింగ్ దృశ్యాలు..
ఉత్తర్ ప్రదేశ్‌లో షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. ఇంటికి వెళ్తున్న సమయంలో ఓ బాలికపై మద్యం మత్తులో ఉన్న వ్యక్తి వేధింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన అక్కడే ఉన్న సీసీటీవీలో రికార్డైంది. కాన్పూర్‌లోరని రావత్‌పూర్‌లో మంగళవారం రాత్రి 8 గంటలకు ఘటన చోటు చేుసుకుంది. మద్యం షాపు వద్ద మద్యం మత్తులో ఉన్న వ్యక్తి బాలిక వెనక నుంచి వచ్చి గట్టిగా పట్టుకుని వేధింపులకు పాల్పడ్డాడు.
సమాచారం ప్రకారం.. సమీపంలోని మద్యం దుకాణానికి సమీపంలో ఉన్న షాపు నుంచి కూరగాయలు కొనుక్కుని ఇంటికి వెళ్తున్న బాలిక వేధింపులకు గురైంది. బాలిక వెనక నుంచి వచ్చి ఆమె అరవకుండా నోరు మూసేసి, కింద పడేసి అఘాయిత్యానికి పాల్పడే యత్నం చేశాడు. బాలిక తీవ్ర నిరసన తెలపడంతో, స్థానికంగా ఉన్న బాటసారులు అటువైపుగా రావడంతో బాలికను వదిలేసి అక్కడ నుంచి పరారయ్యాడు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది.
అజ్ఞాతంలోకి పిన్నెల్లి బ్రదర్స్?
ఆంధ్రప్రదేశ్‌లో పోలింగ్ ముగిసిన అనంతరం అనేక జిల్లాల్లో అల్లర్లు చెలరేగిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పల్నాడుతో పాటు తదితర జిల్లాల్లో 144 సెక్షన్ కూడా విధించారు. ఎన్నికల సంఘం కూడా ఈ ఘటనలపై ఆగ్రహం వ్యక్తం చేసింది. ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీలను ఢిల్లీ పిలిపించి వివరణ కూడా తీసుకుంది. పల్నాడు ఎస్పీపై సస్పెన్షన్ వేటు కూడా వేసింది. తాజాగా అల్లర నేపథ్యంలో గృహ నిర్బంధంలో ఉన్న వైసీపీ నేత, మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సోదరుడు పిన్నెల్లి వెంకటరామిరెడ్డితో కలిసి అజ్ఞాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. వారిద్దరూ గన్‌మెన్లను వదిలేసి వెళ్లిపోయినట్లు సమాచారం. ఈ పరిణామంతో పిన్నెల్లి గన్‌మెన్లు తమ ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. కారంపూడి అల్లర్ల నేపథ్యంలో, అరెస్టులు తప్పవన్న సంకేతాలతో అజ్ఞాతంలోకి వెళ్లినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదిలా ఉండగా.. వారు విశ్రాంతి కోసం హైదరాబాద్ వెళ్లారని స్థానిక వైసీపీ నేతలు చెబుతున్నారు.
కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రామ మందిరాన్ని కూల్చేస్తారు..
ఉత్తర్ ప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో ఉన్న ప్రధాని నరేంద్రమోడీ కాంగ్రెస్ పార్టీపై విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ పార్టీ, ఇండియా కూటమి అధికారంలోకి వస్తే రామమందిరాన్ని బుల్డోజ్ చేస్తారని ఆయన ఆరోపించారు. బుల్డోజర్లు ఎక్కడ నడపాలనే విషయంపై యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ దగ్గర ట్యూషన్ తీసుకోవాలని శుక్రవారం అన్నారు. బీజేపీ హ్యాట్రిక్ సాధించబోతోందని, కొత్త ప్రభుత్వంలో పేదలు, యువత, మహిళలు, రైతుల కోసం ఎన్నో పెద్ద నిర్ణయాలు తీసుకోవాల్సి ఉందని, దాని కోసమే తాను ఇక్కడికి వచ్చానని బారాబంకీ, మోహన్‌లాల్ గంజ్ ప్రజలను ఉద్దేశించి అన్నారు. జూన్ 4 ఎంతో దూరం లేదని, ఆ రోజు మోడీ ప్రభుత్వం హ్యాట్రిక్ కొట్టబోతోందని దేశానికి, ప్రపంచానికి తెలుసని చెప్పారు.
గెలుపు మీద నమ్మకం లేకనే మహానాడులు రద్దు చేసుకున్నారు..
జూన్ 9వ తేదీన విశాఖ నుంచి రెండో సారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నారని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. రాజకీయ లబ్ధి కోసం ప్రశాంతమైన ఉత్తరాంధ్రలో లేనిపోని గొడవలు సృష్టించవద్దంటూ ఆయన హితవు పలికారు. హింసను ప్రోత్సహించవద్దంటూ సూచించారు. విశాఖ పార్లమెంట్ పరిధిలో జరిగిన ఓ గొడవను అనవసరంగా రాజకీయ రాద్దాంతం చేస్తున్నారని వ్యాఖ్యానించారు.
బీఆర్‌ఎస్ పార్టీని బీజేపీ దగ్గర కుదవపెట్టారు.. కేసీఆర్ పై జీవన్ రెడ్డి ఫైర్
కేసీఆర్ ఎంపీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ని బీజేపీ దగ్గర కుదవపెట్టారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. నిజామాబాద్ పార్లమెంట్ స్థానంలో కాంగ్రెస్ ని నిల్వరించడానికె బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలు కుట్ర పన్నాయన్నారు. నిజామాబాద్ లో పోటీ చేయడం పద్మవ్యూహంలో చిక్కడమే అన్నారు. గెలిస్తే అర్జునుడిని ఓడితే అభిమాన్యుడిని అని తెలిపారు. గెలిచిన ఓడిన జగిత్యాల ప్రజల అభిమానం చాలు నాకు అన్నారు. రాజకీయ జన్మనిచ్చింది జగిత్యాల అని తెలిపారు. బీజేపీ పార్టీ సిద్ధాంతం, ఆర్థికప్రణాళిక లేని పార్టీ అన్నారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి రాజకీయ పబ్బం గాడపుకునే పార్టీ బీజేపీ అంటూ మండిపడ్డారు. బీజేపీ ఫలిత రాష్టాల్లో తెలంగాణ లో అమూల్యయే ఏ ఒక్క పథకం అయిన అమలవుతుందా? అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు రైతు దీక్షల పేరిట ధర్నాలు చేయడం దేయ్యలు వేదాలు వాళ్ళించినట్టు ఉందన్నారు.
చెప్పుతో కొట్టాడు, సున్నితమైన భాగాలపై తన్నాడు.. స్వాతి మలివాల్ వాంగ్మూలంలో వెల్లడి
ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో ఆ పార్టీ రాజ్యసభ ఎంపీ స్వాతి మలివాల్ పట్ల అనుచితంగా ప్రవర్తించిన కేసులో కేజ్రీవాల్ వ్యక్తిగత కార్యదర్శి విభవ్ కుమార్‌పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఫిర్యాదులో కేవలం విభవ్‌ను మాత్రమే నిందితుడిగా చేర్చారు. కాలితో తన్నారని స్వాతి చెప్పింది. కడుపు, శరీరంపై కూడా దాడి జరిగింది. దర్యాప్తులో భాగంగా ఆమె వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు.
కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం.. రాష్ట్రవ్యాప్తంగా వైసీపీకి చక్కటి ఫలితాలు..!
రాష్ట్రవ్యాప్తంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి చక్కటి ఫలితాలు రాబోతున్నాయి.. కుప్పంలో కూడా మేం గెలవబోతున్నాం అనే నమ్మకాన్ని వ్యక్తం చేశారు వైసీపీ ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి.. తాడేపల్లిలో మీడియాతో మాట్లాడిన ఆయన.. పోలీస్ అబ్జర్వర్ అధికారులను, పోలీసులను లొంగదీసుకునే ప్రయత్నం చేస్తున్నారు. ప్రస్తుతం పాలన ఈసీ పరిధిలో ఉంది కాబట్టి.. టీడీపీ తన ఏజెంట్లను నియమించుకుంది. అధికారులను.. వ్యవస్ధలను అడ్డం పెట్టుకుని అధికారంలోకి రావాలనేది చంద్రబాబు నైజం అని దుయ్యబట్టారు. మేం స్ట్రయిట్ గా ఉంటాం. అధికారుల సాయంతో మేం అధికారంలోకి రావాలనే ప్రయత్నం చేస్తాం. పోలీస్ అబ్జర్వర్ దీపక్ మిశ్రాను మారిస్తే.. అంతా దారిలోకి వస్తుందన్నారు. కౌంటింగ్‌లో అక్రమాలు జరుగుతాయని మేం అనుకోవడం లేదన్నారు. ఒకవేళ అలాంటివి జరిగినా మేం ఎదుర్కొవడానికి సిద్దంగా ఉన్నామని ప్రకటించారు.