రీల్ పిచ్చితో ట్రైన్ ఎక్కి ప్రాణాలు పోగొట్టుకున్న యువకుడు
ఇటీవల కాలంలో సోషల్ మీడియా పిచ్చి జనాలకు బాగా పెరిగిపోయింది. యూట్యూబ్, ఇన్ స్టాలో రీల్స్ చేసి ఫేమస్ కావాలని పాకులాడుతున్నారు. ఈ క్రమంలోనే రీల్స్ పిచ్చితో తమ విలువైన ప్రాణాలను పోగొట్టుకుంటున్నారు. బల్లియా-లక్నో చాప్రా ఫరూఖాబాద్ ఉత్సర్గ్ 15084 ఎక్స్‌ప్రెస్ రైలు ఇంజిన్‌పై ఒక యువకుడు విద్యుదాఘాతానికి గురయ్యాడు. కరెంట్ ఎక్కువగా ఉండటంతో అతను మరణించాడు. ఆ తర్వాత రైలు సుమారు మూడు గంటల పాటు స్టేషన్‌లో ఆగింది. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.
ఏఐసీసీ చీఫ్ ఖర్గే హెలికాప్టర్ లో తనిఖీలు..
ఎన్నికల పోలింగ్ సందర్భంగా ఎన్నికల అధికారులు తమను లక్ష్యంగా చేసుకున్నారని కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఏఐసీసీ అధినేత మల్లికార్జున్ ఖర్గే ప్రయాణిస్తున్న హెలికాఫ్టర్‌ను ఎన్నికల అధికారులు తనిఖీ చేయడంపై కాంగ్రెస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తుంది. ఎన్నికల అధికారులు తమ పార్టీ నేతలను టార్గెట్ చేశారని వ్యాఖ్యనించింది. అయితే, ఎన్డీయే నేతృత్వంలోని బీజేపీ నేతలు మాత్రం ఈజీగా ప్రచారం చేసుకుంటున్నారని మండిపడింది. బీహార్‌లోని కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి రాజేశ్ రాథోడ్ ఈ మేరకు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. కాగా, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లిఖర్జున్ ఖర్గే శనివారం బీహార్ రాష్ట్రంలోని సమస్తిపూర్, ముజఫర్‌పూర్‌లో ఎన్నికల ప్రచారం చేశారు. ఈ సందర్బంగా ఆయన ప్రయాణించిన హెలికాఫ్టర్‌లో ఎన్నికల అధికారులు, పోలీసులు చెక్ చేశారు.
భారీ వర్షానికి అస్తవ్యస్తంగా మారిన ఈవీఎం పంపిణీ కేంద్రం..
కామారెడ్డి, జహీరాబాద్ లో భారీ వర్షానికి ఈవీఎం పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. అయితే కామారెడ్డిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో వాన భారీగా పడతుండటంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ కోసం ఏర్పాట్లపై అంతరాయం చోటుచేసుకుంది. వర్షానికి టెంట్లో నుంచి నీరు కురుస్తుండటంతో.. పోలింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. వానతో పాటు ఈదురు గాలులకు టెంటు కూలడంతో.. సిబ్బంది ఈవీఎం ప్యాడ్లు తడవకుండా అవస్థలు పడుతున్నారు. మరోవైపు జహీరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి EVM పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. EVM మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లపై వర్షపు నీరు పడుతుండటంతో.. ఈవీఎం ప్యాడ్లు తడవకుండా కాపాడుకునేందుకు ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
ఈవీఎం పంపిణీ కేంద్రంలో అస్వస్థతకు గురైన ఉద్యోగి..
మెదక్ జిల్లా నారాయణఖేడ్ లోని ఈవీఎం పంపిణీ కేంద్రం వద్ద ఉద్యోగి అస్వస్థతకు గురయ్యారు. ఎన్నికల సామగ్రిని తీసుకువెళ్తుండగా టీచర్ జోగు నాయక్ హఠాత్తుగా కిందపడిపోయారు. తోటి ఉద్యోగులు వెంటనే నారాయణఖేడ్ ఆస్పత్రికి తరలించారు. మూర్ఛ రావడంవల్లే కిందపడిపోయినట్టు డాక్టర్లు వెల్లడించారు. అయితే సిబ్బంది అప్పటి వరకు బాగానే ఉన్నాడని ఒక్కసారిగా కిందికి పడిపోవడంతో భయాందోళన గురి అయ్యామని తెలిపారు. కామారెడ్డి, జహీరాబాద్ లో భారీ వర్షానికి ఈవీఎం పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. అయితే కామారెడ్డిలో ఒక్కసారిగా వాతావరణం మారింది. జిల్లా కేంద్రంలో భారీ వర్షం పడుతుంది. జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ సంబంధించి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. దీంతో వాన భారీగా పడతుండటంతో ప్రభుత్వ డిగ్రీ కళాశాల మైదానంలో పోలింగ్ కోసం ఏర్పాట్లపై అంతరాయం చోటుచేసుకుంది. వర్షానికి టెంట్లో నుంచి నీరు కురుస్తుండటంతో.. పోలింగ్ సిబ్బంది తీవ్ర అవస్థలు పడుతున్నారు. వానతో పాటు ఈదురు గాలులకు టెంటు కూలడంతో.. సిబ్బంది ఈవీఎం ప్యాడ్లు తడవకుండా అవస్థలు పడుతున్నారు. మరోవైపు జహీరాబాద్ లో భారీ వర్షం కురుస్తుంది. వర్షానికి EVM పంపిణీ కేంద్రం అస్తవ్యస్తంగా మారింది. EVM మెషీన్లు, కంట్రోలింగ్ యూనిట్లపై వర్షపు నీరు పడుతుండటంతో.. ఈవీఎం ప్యాడ్లు తడవకుండా కాపాడుకునేందుకు ఎన్నికల సిబ్బంది నానా తంటాలు పడుతున్నారు.
దేశ వ్యాప్తంగా 24 గంటల ఫ్రీ కరెంట్‌తో పాటు 10 హామీల ప్రకటన
సార్వత్రిక ఎన్నికల వేళ ఢిల్లీ ముఖ్యమంత్రి కేజ్రీవాల్ 10 గ్యారంటీ హామీలను ప్రకటించారు. ఈ మేరకు ఆయన మంత్రులతో కలిసి కేజ్రీవాల్ వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 24 గంటల ఉచిత విద్యుత్ పాటు 10 హామీలను ప్రకటించారు. లోక్‌సభ ఎన్నికల్లో ఇండియా కూటమి అధికారంలోకి వస్తే ఆమ్ ఆద్మీ హామీ ప్రకటించిన 10 హామీలను అమలు చేస్తామని స్పష్టం చేశారు. ఆదివారం ఢిల్లీలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆప్ జాతీయ కన్వీనర్ కేజ్రీవాల్ మాట్లాడారు. దేశవ్యాప్తంగా 24 గంటల ఉచిత విద్యుత్, ఉచిత విద్య మరియు ఢిల్లీకి పూర్తి రాష్ట్ర హోదాతో సహా ఎన్నికలకు హామీ ఇచ్చారు. భారత సరిహద్దు వెంబడి చైనా ఆక్రమించుకున్న భూమిని తిరిగి స్వాధీనం చేసుకుంటామని హామీ ఇచ్చారు. అరెస్ట్ కారణంగా హామీల ప్రకటన ఆలస్యమైందని చెప్పారు. అయినా కూడా చాలా దశల ఎన్నికలు మిగిలి ఉన్నాయని తెలిపారు. ఈ హామీలపై ఇండియా కూటమిలోని భాగస్వాములతో చర్చించలేదని.. అయితే ఎవరికీ ఎలాంటి ఇబ్బంది ఉండదని ఆయన చెప్పుకొచ్చారు. భారత కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత హామీలు అమలయ్యేలా చూస్తానని స్పష్టం చేశారు.
తెలుగు సినీ ఇండస్ట్రీలో విషాదం.. త్రినయని సీరియల్ నటి మృతి..
తెలుగు సీరియల్ యాక్టర్ పవిత్ర జయరాం మృతి చెందారు.మహబూబ్ నగర్ జిల్లా భూత్పూర్ మున్సిపాలిటీ పరిధిలోని శేరిపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో పవిత్ర జయరామ్ మృతి చెందినట్లు సమాచారం. ప్రమాదంలో పవిత్ర అక్కడిక్కడే మరణించారు.కర్ణాటకలోని తన సొంత వూరుకి వెళ్లి తిరిగి హైదరాబాద్ వస్తుండగా తన కారు అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొట్టి అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టినట్లు సమాచారం.
ఆమెతో పాటు కారులో తన తోటి నటులు మరియు కుటుంబసభ్యులు ఉన్నట్లు సమాచారం.ఈ ఘటనలో ఆమె బంధువు ఆపేక్ష, డ్రైవర్ శ్రీకాంత్ మరియు నటుడు చంద్రకాంత్ కు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గాయపడ్డ వారిని స్థానిక ఆసుపత్రికి తరలించారు.ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. అయితే పవిత్ర జయరాం తెలుగులో త్రినయని సీరియల్ తో ఎంతగానో ఫేమస్ అయ్యారు.సీరియల్స్ లో విలన్ పాత్రలలో అద్భుతంగా నటించి ప్రేక్షకులను ఎంతగానో అలరించిన పవిత్ర కన్నడలో “రోబో ఫ్యామిలీ” సీరియల్ తో బుల్లితెరకి ఎంట్రీ ఇచ్చింది .
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసాం…
తెలంగాణలో ఎన్నికల ఏర్పాట్లు పూర్తి చేసామని తెలిపారు డీజీపీ రవి గుప్తా. ఇవాళ ఆయన ఎన్టీవీతో మాట్లాడుతూ.. ప్రజలందరూ నిర్భయంగా తమ ఓటు హక్కు ను వినిగించుకోవాలని సూచించారు. ఎక్కడా కూడా ఇలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని, లోక్‌సభ 73,414 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేసామని ఆయన పేర్కొన్నారు. 500 తెలంగాణ స్పెషల్ ఫోర్స్ విభాగాలు సహా.. 164 సెంట్రల్ ఆర్మ్‌డ్ ఫోర్సెస్‌తో భద్రతా ఏర్పాట్లు చేసామని ఆయన వెల్లడించారు. 7వేల మంది ఇతర రాష్ట్రాల హోంగార్డులతో బందోబస్తు చేసామని, 89 ఇంటర్ స్టేట్ బోర్డర్ చెక్‌పోస్టులు, 173 అంతర్‌జిల్లా చెక్‌పోస్టులు ఏర్పాటు చేసామన రవి గుప్తా తెలిపారు.
“యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే వస్తాయి”.. కాంగ్రెస్‌పై పీఎం సెటైర్లు..
పశ్చిమ బెంగాల్‌లో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్(టీఎంసీ) పార్టీలపై విరుచుకుపడ్డారు. సందేశ్‌ఖాలీలో టీఎంసీ నాయకులు మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని, ఇప్పుడు ఆ పార్టీ గుండాలు వారిని బెదిరిస్తున్నారని మోడీ ఆరోపించారు. రాహుల్ గాంధీ 53 ఏళ్ల వయసును ప్రస్తావిస్తూ.. ఈ సారి కాంగ్రెస్ పార్టీకి యువరాజు వయసు కన్నా తక్కువ సీట్లే వస్తాయని అన్నారు.
రేపు బాకరాపురంలో ఓటు వేయనున్న ఏపీ ముఖ్యమంత్రి..
రేపు ఏపీలో ఎన్నికలు జరుగనున్నాయి. ఇప్పటికే పట్టణాల్లో ఉండే ప్రజలు.. తమ సొంత గ్రామాలకు చేరుకుని ఓటేసేందుకు సిద్ధమయ్యారు. మరోవైపు.. రాజకీయ నేతలు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఇదిలా ఉంటే.. గతం కంటే ఈసారి పోలింగ్ శాతం రికార్డు స్థాయిలో నమోదు అయ్యే అవకాశం కనిపిస్తోంది. కాగా.. పోలింగ్ ఏర్పాట్లకు సంబంధించి ఎన్నికల సంఘం అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు.
మెదక్ జిల్లాలో విషాదం.. పిడుగుపడి తండ్రికొడుకులు మృతి
తెలంగాణలో పలు చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కారణంగా తీవ్రంగ పంట నష్టం జరుగుతోంది. అయితే.. ఈ నేపథ్యంలోనే మెదక్ జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. ధాన్యం కొనుగోలు కేంద్రం వద్ద పిడుగు పడి ఇద్దరు మృతి చెందారు. మృతులు పెద్ద శంకరంపేట (మం) రామోజీపల్లి వాసులుగా గుర్తించారు పోలీసులు. అయితే.. ధాన్యం ఆరబెట్టడానికి కొడుకుని తీసుకువచ్చాడు తండ్రి.. ఈ క్రమంలోనే.. ఒక్కసారిగా ఈదురుగాలులతో కూడిన వర్షం రావడంతో చెట్టు కిందకి వెళ్లారు తండ్రికొడుకులు. దీంతో.. ఒక్కసారిగా.. వీళ్లు ఉన్న చెట్టుపై పిడుగుపడటంతో అక్కడికక్కడే తండ్రీకొడుకులు రాములు(46)విశాల్(14) మృతి చెందారు. దీంతో అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.