ఉప్పల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు!
ఐపీఎల్ 2024లో సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) తుది పోరులో చేతులెత్తేసింది. ఆదివారం చెపాక్ మైదానంలో కోల్‌కతా నైట్ రైడర్స్‌తో జరిగిన ఫైనన్‌లో సన్‌రైజర్స్ ఓడిపోయింది. బ్యాటింగ్, బౌలింగ్‌లో తేలిపోయిన ఎస్‌ఆర్‌హెచ్.. రన్నరప్‌తో సరిపెట్టుకుంది. ఎస్‌ఆర్‌హెచ్ ఓటమితో అభిమానులే కాదు ఆ జట్టు ఓనర్ కావ్య మారన్ కూడా కన్నీటి పర్యంతం అయ్యారు. అయితే ఓటమి బాధలో ఉన్న సన్‌రైజర్స్‌కు చిన్న ఓదార్పు దక్కింది.
హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ స్టేడియంకు ఐపీఎల్ అవార్డు దక్కింది. బెస్ట్ పిచ్, బెస్ట్ గ్రౌండ్‌గా ఉప్పల్ స్టేడియంను అవార్డు వరించింది. ఐపీఎల్ 17వ సీజన్ ఫైనల్ మ్యాచ్ అనంతరం ఏర్పాటు చేసిన సెర్మనీలో హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ) ఈ అవార్డును అందుకుంది. అంతేకాదు 50 లక్షల రూపాయల ప్రైజ్‌మనీ కూడా దక్కింది. ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్ చాముండేశ్వరి నాథ్.. హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్ మోహన్ రావుకు అవార్డును అందించారు.
రాష్ట్ర అధికార చిహ్నంలో మార్పులు.. సీఎం రేవంత్ కసరత్తు..
తెలంగాణ రాష్ట్ర అధికారిక చిహ్నంపై చిత్రకారులు రుద్ర రాజేశంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చర్చించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ పలు నమూనాలను పరిశీలించారు. తుది నమూనాపై సీఎం పలు సూచనలు చేశారు. ఇప్పటికే తెలంగాణ కోడ్ టీఎస్ స్థానంలో టీజీని తీసుకొచ్చారు. టీఎస్ స్థానంలో టీజీని అమలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, సంస్థలు, ఏజెన్సీలు, స్వయంప్రతిపత్త సంస్థలు, కార్పొరేషన్లు, వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లు, ఇతర అధికారిక కమ్యూనికేషన్‌లు కూడా టీఎస్‌కు బదులుగా తెలంగాణ కోడ్‌ను టీజీగా ఉపయోగిస్తున్నాయి. లెటర్‌హెడ్‌ల నివేదికలు, నోటిఫికేషన్‌లు, అధికారిక వెబ్‌సైట్‌లు, ఆన్‌లైన్ బయోస్ మరియు ఇతర అధికారిక వెబ్‌సైట్‌లు ఆన్‌లైన్ బయోస్‌లో TGగా మార్చబడ్డాయి. అయితే రాష్ట్ర అధికారిక చిహ్నాన్ని మార్చవద్దని పలువురు రాజకీయ నేతలు, మేధావులు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించినా రేవంత్ మొగ్గు చూపారు.
జూన్ 5 తర్వాత ఇండియా కూటమి అధికారంలోకి వస్తుంది..
దేశంలో జూన్ 5తర్వాత కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఇండియా కూటమి అధికారంలోకి వస్తుందని మాజీ ఎంపీ. V.హనుమంతరావు అన్నారు. బ్రిటిష్ సామ్రాజ్యాన్ని తరిమి కొట్టినప్పుడు మన దేశంలో గుండు సూది కూడా తయారు కాలేదన్నారు. నెహ్రు మహాత్మా గాంధీ అడుగుజాడల్లో నడిచి దేశాన్ని నడిపించాడన్నారు. పంచవర్ష ప్రణాళిక లు నెహ్రు తెచ్చిండని తెలిపారు. దేశంలో డ్యామ్ లు కట్టించింది నెహ్రు నే అన్నారు. మోడీ ఏమి మాట్లాడుతుండో అర్థం కావట్లేదన్నారు. రాజీవ్ గాంధీ తెచ్చిన ప్రభుత్వ రంగ సంస్థలు కూడా మోడీ ప్రైవేట్ చేస్తుండన్నారు. కాంగ్రెస్ ఏమి తెచ్చింది అంటుండ్రు.. కాంగ్రెస్ స్వాతంత్య్రాన్ని తెచ్చిందన్నారు. అంబేద్కర్ తెచ్చిన రాజ్యాంగాన్ని మోడీ మార్చాలని చూస్తున్నారని తెలిపారు.
సీఎం జగన్పై రాయి దాడి కేసులో నిందితుడి బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్
ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాయితో దాడి కేసులో నిందితుడు సతీష్ బెయిల్ పిటిషన్ పై తీర్పును న్యాయస్థానం రిజర్వ్ చేసింది. నిందితుడు సతీష్ కుమార్ బెయిల్ పిటిషన్స్ పై వాదనలు వినిపించిన న్యాయవాది సలీం.. సతీష్ కుమార్ నిరపరాది, అమాయకుడు అని పోలీసులే ఈ కేసులో అక్రమంగా ఇరికించారన్న న్యాయవాది సలీం వాదించారు. ఇక, మరో వైపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ కావాలనే సీఎం జగన్ పై దాడి చేశారని పేర్కొన్నారు. ఇక, ఇరువురి వాదనల అనంతరం ఆర్డర్స్ ను రిజర్వ్ చేసినట్లు 8వ అదనపు జిల్లా న్యాయస్థానం ప్రకటించింది. ఈ కేసులో రేపు తీర్పును న్యాయమూర్తి ఇవ్వనున్నారు.
జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ నే..
జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ నే అని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి అన్నారు. దేశ తొలిప్రదాని జవహర్ లాల్ నెహ్రు వర్ధంతి సందర్భంగా ఇందిరా భవన్ లో కాంగ్రెస్ నేతలు ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం జీవన్ రెడ్డి మాట్లాడుతూ.. దేశం ఈ స్థాయిలో ఉందంటే దానికి కారణం నెహ్రు అన్నారు. ఆయన ఆధ్వర్యంలో వ్యవసాయానికి,పారిశ్రామికంగా దేశం ఎంతో అభివృద్ధి చెందిందన్నారు. కొన్ని దృష్ట శక్తులు దేశానికి ఆయన చేసిన సేవలు , త్యాగాన్ని తగ్గించేందు కుట్ర చేస్తున్నారని తెలిపారు. కాశ్మీర్ అంశం అప్పుడు పండిట్ జవహర్ లాల్ నెహ్రు చేర్చిన అంశమే ఉన్నప్పుడు ఆర్టికల్ 370డి అన్నారు. స్వాతంత్రం ఎప్పుడు వచ్చింది కాంగ్రెస్ ఆద్వర్యంలో కాదా? అని ప్రశ్నించారు. జాతీయ జెండా ఎగరవేసింది కాంగ్రెస్ పార్టీ నే అన్నారు. కాంగ్రెస్ నేతలను విమర్శించడం సరికాదన్నారు.
రెమల్ తుఫాను బీభత్సం.. బెంగాల్‌లో ఇద్దరు మృతి
పశ్చిమ బెంగాల్‌లో రెమల్ తుఫాను బీభత్సం సృష్టిస్తోంది. ఈ క్రమంలో బెంగాల్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. భారీ వర్షాలతో ఇద్దరు మృతి చెందారు. అంతేకాకుండా.. తుఫాన్ ఎఫెక్ట్తో బెంగాల్ తీర ప్రాంతాలలో మౌలిక సదుపాయాలు, ఆస్తికి విస్తృతమైన నష్టాన్ని చవిచూశాయి. రెమల్ తుఫాను బెంగాల్ రాష్ట్రం పొరుగున ఉన్న బంగ్లాదేశ్‌లో గంటకు 135 కిమీ వేగంతో గాలులు వీచినట్లు అధికారులు సోమవారం తెలిపారు. సెంట్రల్ కోల్‌కతాలోని ఎంటల్లీలోని బిబీర్ బగాన్ ప్రాంతంలో ఆదివారం సాయంత్రం ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షం కారణంగా గోడ కూలిపోవడంతో ఒక వ్యక్తి గాయాలతో మరణించాడని రాష్ట్ర విపత్తు నిర్వహణ అధికారి తెలిపారు. అలాగే.. సుందర్‌బన్స్ డెల్టాకు ప్రక్కనే ఉన్న నమ్‌ఖానా సమీపంలోని మౌసుని ద్వీపంలో ఒక వృద్ధురాలు చనిపోయింది. ఆమె నివసిస్తున్న గుడిసెపై చెట్టు కూలడంతో మృతిచెందినట్లు అధికారులు తెలిపారు.
పాతాళానికి పడిపోయిన చేపల ధరలు..ఆందోళనలో ఆక్వా రైతులు
ఏలూరు జిల్లా కైకలూరు నియోజకవర్గంలో రైతులు సుమారు 30 వేల ఎకరాల్లో చేపలు రొయ్యలు సాగు చేస్తున్నారు. రెండు రోజులు బట్టి ఎండ తీవ్రత ఉక్కుపోతవలన చాపల చెరువులో డీవో పడిపోయి ఆక్సిజన్ అందక చేపలు మృత్యువాత పడుతున్నాయి. డీవో పడిన చేపలను అమ్మటానికి మార్కెట్ కి తీసుకుని వెళ్తే అక్కడ కేజీకి 10 నుంచి 20 రూపాయలు పలకటంతో ఆక్వా రైతులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. చేసేదేమీ లేక వాటిని దళారులకు అప్పగించి తిరిగి వస్తున్నారు. చేపలు తీసుకుని వెళ్లిన ఆటో కిరాయి ఖర్చులు కూడా రాకపోవడంతో.. కొందరు రైతులయితే సరుకు వదిలేసి వస్తున్నారు. వాటి మేతకు అయ్యే ఖర్చు కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎకరానికి వచ్చే రాబడి కన్నా ఎక్కువ ఖర్చు అవుతుందని రైతులు వాపోతున్నారు. ఒక్కసారి మార్కెట్ కు భారీ స్థాయిలో చేపలు రావడంతో కొనేవారు లేక రేటు దారుణంగా పడిపోయిందని వ్యాపారస్థులు చెబుతున్నారు.
తెలంగాణలో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లు నిర్వహిస్తున్న పెట్రోల్ బంక్..
దేశంలోని ఈ ప్రాంతాల్లో తొలిసారిగా ట్రాన్స్‌జెండర్లు నిర్వహిస్తున్న ఇంధన బంక్ త్వరలో జిల్లాలో ప్రారంభం కానుంది. రాజన్న-సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఇంధన కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. లింగమార్పిడి వ్యక్తుల (హక్కుల పరిరక్షణ) చట్టం 2019లో భాగంగా, గుర్తింపు కార్డులను జారీ చేయడంతో పాటు లింగమార్పిడి చేయించుకున్న వారికి ఉపాధి కల్పించేందుకు ప్రభుత్వాలు స్వయం ఉపాధి కార్యక్రమాలను ప్రవేశపెడుతున్నాయి. గౌరవప్రదమైన జీవితాన్ని గడపడానికి అవకాశం కల్పించేందుకు, వివిధ స్వయం ఉపాధి యూనిట్లను స్థాపించడానికి ఇప్పటికే కొంతమంది ట్రాన్స్‌జెండర్లకు వంద శాతం సబ్సిడీతో రుణాలు మంజూరు చేయబడ్డాయి. వారిలో కొందరు ఫోటో స్టూడియోలు , ఇతర యూనిట్లను స్థాపించగా, మరికొందరు టాక్సీ వాహనాలను కొనుగోలు చేశారు. సంప్రదాయ ఉపాధి యూనిట్ల నుంచి ఒక అడుగు ముందుకు వేసి ట్రాన్స్‌జెండర్లతో ఇంధన బంక్‌ను నిర్వహించాలనే ఆలోచనతో జిల్లా యంత్రాంగం ఈ ఏడాది జనవరిలో ప్రతిపాదనలు సిద్ధం చేసింది.
తెలంగాణవాసులకు అలర్ట్.. పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్..
తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఈ నేపథ్యంలోనే తెలంగాణలోని పలు జిల్లాలకు నేడు ఎల్లో అలెర్ట్ జారీ చేసింది ఐఎండీ.. ఈరోజు సాయంత్రం హైదరాబాద్ తో పాటు పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వాతావారణ శాఖ వెల్లడించింది. రెమాల్ తుఫాన్ ప్రభావంతో తెలంగాణలో బలమైన ఈదురుగాలులు వీస్తున్నాయి. మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం.. వాయుగుండంగా మారి తీవ్ర తుఫాన్ గా మారింది.. నిన్న సాగర్ ఐలాండ్ వద్ద తుఫాన్ తీరం దాటింది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజ్ గిరి, మెదక్, సంగారెడ్డి, మహబూబ్ నగర్, సూర్యాపేట్, నల్గొండ, కామారెడ్డి, ఆదిలాబాద్, నిర్మల్, భద్రాది కొత్తగూడెం జిల్లాలకు నేడు వర్ష కురిసే అవకాశం ఉంది. 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులతో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ పేర్కొంది. రేపు.. ఎల్లుండి రాష్ట్రంలో పొడి వాతావరణం ఏర్పడే అవకాశం ఉందని తెలిపింది.
తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్
వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి తెలంగాణ శాసనమండలికి సోమవారం ఉప ఎన్నిక పోలింగ్ ముగిసింది. ఓటర్లు క్యూలో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 4 గంటలకు ముగిసింది. గత ఏడాది నవంబర్ 30న జనగాం నియోజకవర్గం నుంచి గెలుపొందిన బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్‌రెడ్డి రాజీనామా చేయడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. కాంగ్రెస్ పార్టీ చింతపండు నవీన్ అలియాస్ తీన్మార్ మల్లన్నను నామినేట్ చేయగా, బిజెపి జి ప్రేమేందర్ రెడ్డిని నిలబెట్టగా, ఎ రాకేష్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్థిగా ఉన్నారు. జూన్ 5న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. నియోజకవర్గంలోని 4.63 లక్షల మంది పట్టభద్రులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. తెలంగాణలో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ముగిసిన పోలింగ్. నల్గొండ-ఖమ్మం-వరంగల్ జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉప ఎన్నిక. మొత్తం 600 పోలింగ్ కేంద్రాల్లో జరిగిన ఓటింగ్. మూడు జిల్లాల పరిధిలో 4లక్షల 61వేల 806 మంది గ్రాడ్యుయేట్ ఓట్లర్లు ఉన్నారు.