సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాశీ జగత్ గురు శ్రీ మల్లికార్జున విశ్వరాజ్య శివచార్య మహా స్వామి ఆధ్వర్యంలో 108 మంది వీర శైవ పండితులచే స్వామివారి కళ్యాణం జరుగనుంది.
కాంగ్రెస్ అగ్ర నేత ప్రియాంకాగాంధీ వయనాడ్ లోక్‌సభ బైపోల్‌లో ఘన విజయం సాధించారు. దాదాపు 4 లక్షలకు పైగా ఓట్లతో గెలుపొందారు. సోదరుడు రాహుల్ గాంధీ కంటే ఎక్కువ ఓట్లు వచ్చాయి.
పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాలను నవంబరు 28 నుంచి డిసెంబరు 6వ తేదీ వరకు వైభవంగా నిర్వహించేందుకు టీటీడీ (తిరుమల తిరుపతి దేవస్థానం) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ క్రమంలో తిరుచానూరులో అమ్మవారి బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను టీటీడీ ఈవో శ్యామలరావు పరిశీలించారు.
హోండా కంపెనీ భారత మార్కెట్లో అనేక విభాగాల్లో స్కూటర్లు, బైక్‌లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే... తాజాగా టూ-వీలర్ ICE విభాగంలో కూడా అందిస్తుంది. అయితే కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు (27 నవంబర్ 2024)న విడుదల చేయనుంది.
రేపు హైదరాబాద్‌లో తెలంగాణ ఒలింపిక్ అసోసియేషన్ ఎన్నికలు జరుగనున్నాయి. ఉదయం 12 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగనుంది. సాయంత్రం 4.30 నుంచి కౌంటింగ్ ప్రారంభం అవుతుంది. సాయంత్రం 5 గంటల తర్వాత ఫలితాలు వెల్లడి కానున్నాయి. కాగా ఈ ఎన్నికల్లో అధ్యక్ష స్థానానికి మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, బ్యాడ్మింటన్ సంఘం ఉపాధ్యక్షుడు చాముండేశ్వర్‌నాథ్ పోటీ పడుతున్నారు.
మహారాష్ట్ర, జార్ఖండ్‌లో బుధవారం అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది ఈవీఎంలు తీసుకుని పోలింగ్ బూత్‌లకు తరలి వెళ్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాలకు ప్రత్యేక హెలికాప్టర్లలో సిబ్బందిని తరలిస్తున్నారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బంది ఆయా ప్రాంతాలకు చేరుకున్నారు.
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు.
జార్ఖండ్‌లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది.. ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు.
ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్ రేపు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు విచారణలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు.
దక్షిణాదిలోని పలు రాష్ట్రాలకు కేంద్ర వాతావరణ శాఖ భారీ వర్ష సూచన చేసింది. ఇప్పటికే తమిళనాడు, కేరళ సహా పలు రాష్ట్రాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. తాజాగా శనివారం, ఆదివారం కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ వార్నింగ్ ఇచ్చింది.