హోండా కంపెనీ భారత మార్కెట్లో అనేక విభాగాల్లో స్కూటర్లు, బైక్‌లను విక్రయిస్తున్న సంగతి తెలిసిందే… తాజాగా టూ-వీలర్ ICE విభాగంలో కూడా అందిస్తుంది. అయితే కంపెనీ తన తొలి ఎలక్ట్రిక్ స్కూటర్‌ను రేపు (27 నవంబర్ 2024)న విడుదల చేయనుంది. ఈ స్కూటర్ ఎలాంటి ఫీచర్లతో లాంచ్ అవుతుందో తెలుసుకుందాం. హోండా యాక్టివా ఎలక్ట్రిక్ బైక్ బుధవారం రోజున.. హోండా మోటార్‌సైకిల్ అండ్ స్కూటర్ ఇండియా (HMSI) ద్వారా భారత మార్కెట్లో విడుదల చేస్తున్నారు. ఈ స్కూటర్ అనేక గొప్ప ఫీచర్లను కలిగి ఉంది.
Read Also: Tollywood : కీర్తిసురేష్ టాలీవుడ్ కు నై నై.. బాలీవుడ్ కు సై..సై..
ఫీచర్లు:
ఈ బైకుకు సంబంధించి కొంత సమాచారాన్ని అనేక టీజర్లను హోండా సోషల్ మీడియాలో విడుదల చేసింది. అయితే, ఈ స్కూటర్ గురించిన పూర్తి సమాచారం లాంచ్ సమయంలో తెలియనుంది. ఈ బైకులో LED లైట్లు, డిజిటల్ స్పీడోమీటర్, డ్రైవింగ్ కోసం రేంజ్ ఎంపికలు, బ్లూటూత్ కనెక్టివిటీతో సహా అనేక గొప్ప ఫీచర్లతో అందిస్తున్నారు.
బ్యాటరీ ఎంపికలు:
టీజర్లో తెలపిన ప్రకారం.. కంపెనీ హోండా యాక్టివా ఎలక్ట్రిక్ స్కూటర్లో బ్యాటరీ ఎంపికలను అందిస్తుంది. ఈ స్కూటర్‌ను స్థిరమైన, తొలగించగల బ్యాటరీ ఆప్షన్లు ఉండనున్నట్లు సమాచారం. ఈ స్కూటర్‌కు ఒక్కసారి ఛార్జ్ చేస్తే స్కూటర్ 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ప్రయాణించగలదు. అయితే.. హోండా ఎన్ని స్కూటర్లను విడుదల చేస్తుందో ఇంకా సమాచారం ఇవ్వలేదు.
ధర:
యాక్టివా ఎలక్ట్రిక్ బైకును కంపెనీ భారత మార్కెట్‌లో రూ.90 వేల నుంచి రూ.1.50 లక్షల ఎక్స్-షోరూమ్ ధరతో విడుదల చేయవచ్చు. అయితే దీని కచ్చితమైన ధర మాత్రం లాంచ్ సమయంలోనే తెలుస్తుంది.
పోటీ:
హోండా యాక్టివా ఎలక్ట్రిక్‌తో పాటు.. భారత మార్కెట్లో అనేక కంపెనీలు EV స్కూటర్లను అందిస్తున్న సంగతి తెలిసిందే.. ఇందులో TVS iQube, Ola S1, Ather 450x, Rizta, Hero Vida వంటి స్కూటర్లు ఉన్నాయి. ఇలాంటి పరిస్థితిలో.. యాక్టివా ఎలక్ట్రిక్ ఈ స్కూటర్లకు పోటీగా నిలువనుంది.