ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణ రేపటికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్ రేపు వాదనలు వినిపించనున్నారు. ఈరోజు విచారణలో మొదట ఎమ్మెల్యే కడియం శ్రీహరి తరఫున న్యాయవాది మయూర్‌రెడ్డి వాదనలు వినిపించారు. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున న్యాయవాది గండ్ర మోహన్‌రావు వాదించారు. ఎమ్మెల్యేలపై వచ్చిన ఫిర్యాదులను స్పీకర్ ముందు ఉంచాలని గతంలో సింగిల్ బెంచ్ తీర్పు ఇచ్చింది. దీనిపై అసెంబ్లీ కార్యదర్శి.. డివిజన్ బెంచ్‌ను ఆశ్రయించారు. స్పీకర్ నిర్ణయంలో హైకోర్టు జోక్యం చేసుకోలేదని అసెంబ్లీ కార్యదర్శి తన పిటిషన్‌లో పేర్కొన్నారు.
Germany: జర్మనీలో కూలిన సంకీర్ణ ప్రభుత్వం.. త్వరలోనే ఎన్నికలు!
అధికారాలను ఎంజాయ్ చేస్తా.. విధులను మాత్రం నిర్వహించను అంటే సరికాదని న్యాయస్థానం పేర్కొంది. అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్‌లు మెయింటనబుల్ కాదని… కొట్టివేయాలని గండ్ర వాదనలు వినిపించారు. పార్టీ ఫిరాయించిన ఓ ఎమ్మెల్యే ఏకంగా ఎంపీగా పోటీ చేశారని అన్నారు. వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను రేపటికి వాయిదా వేసింది. కాగా.. మూడు రోజులుగా కొనసాగుతున్న వాదనలలో ప్రభుత్వం, అసెంబ్లీ కార్యదర్శి, పార్టీ మారిన ఎమ్మెల్యేలు, ఫిర్యాదు చేసిన ఎమ్మెల్యేల తరఫు లాయర్లు వాదనలు వినిపించారు.
Minister Anitha: కామెంట్స్ కలకలం.. పవన్ కల్యాణ్ తో మంత్రి అనిత భేటీ