సిద్ధిపేట జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం కొమురవెల్లిలో రేపు మల్లికార్జున స్వామి కళ్యాణం జరుగనుంది. ఈ ఉత్సవం కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. కాశీ జగత్ గురు శ్రీ మల్లికార్జున విశ్వరాజ్య శివచార్య మహా స్వామి ఆధ్వర్యంలో 108 మంది వీర శైవ పండితులచే స్వామివారి కళ్యాణం జరుగనుంది. ఈ కళ్యాణోత్సోవానికి దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ, మంత్రి పొన్నం ప్రభాకర్ హాజరుకానున్నారు. ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించనున్నారు.
Read Also: Preity Zinta: “సల్మాన్ ఖాన్‌తో డేటింగ్ చేశారా?”.. నటి రి యాక్షన్ ఇదే..
మూడు నెలల పాటు జరిగే బ్రహ్మోత్సవాలు మల్లన్న కళ్యాణంతో ప్రారంభం కానున్నాయి. మల్లన్న కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరానున్నారు. రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు మహారాష్ట్ర, కర్ణాటక నుంచి స్వామి వారి కళ్యాణాన్ని తిలకించేందుకు భక్తులు భారీగా రానున్నారు. అందుకోసం.. పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సుమారు 50 వేల మందికి పైగా భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ ఉత్సవంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా 500 మందికి పైగా పోలీసులతో బందోబస్తు నిర్వహించనున్నారు.
Read Also: Swiggy sales: కండోమ్స్ సేల్స్‌లో బెంగళూరు టాప్