కాంగ్రెస్ అగ్ర నేతలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంకాగాంధీ, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే కేరళ చేరుకున్నారు. రాష్ట్ర నాయకులు భారీ స్వాగతం పలికారు. బుధవారం వయనాడ్‌లో ప్రియాంకాగాంధీ నామినేషన్ దాఖలు చేయనున్నారు.
రేపు ఉప్పల్ స్టేడియంలో జరగనున్న భారత్-బంగ్లా మూడో టీ20 మ్యాచ్ కోసం.. పోలీస్ యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసింది. మ్యాచ్ సందర్భంగా ఉప్పల్ స్టేడియం వద్ద భారీ బందోబస్తు నిర్వహించారు. 250 మంది సెక్యూరిటీ వింగ్, 400 మంది ట్రాఫిక్ సిబ్బంది బందోబస్తు ఉన్నారు. అలాగే.. 1,662 మంది లా అండ్ ఆర్డర్, 14 ప్లాటూన్ల టీఎస్‌ఎస్పీ, 6 ప్లాటూన్ల సాయుధ దళాలు బందోబస్తు ఉన్నారు.
రేపు ఉదయం ఏపీ కేబినెట్ సమావేశం జరుగనుంది. సచివాలయంలో ఉదయం 11 గంటలకు సీఎం చంద్రబాబు అధ్యక్షతన కేబినెట్ సమావేశం నిర్వహించనున్నారు. ఈ భేటీలో వివిధ కీలక ప్రతిపాదనలపై రాష్ట్ర మంత్రివర్గం చర్చించనుంది.
భారత్-బంగ్లాదేశ్ మధ్య మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ జరుగనుంది. మొదటిది గ్వాలియర్, రెండో టీ 20 న్యూ ఢిల్లీ, మూడో టీ20 హైదరాబాద్‌లో జరుగనుంది. చాలా రోజుల తర్వాత.. ఉప్పల్ స్టేడియంలో అంతర్జాతీయ మ్యాచ్ జరుగనుంది. ఇదిలా ఉంటే.. హైదరాబాద్‌లో జరుగనున్న టీ20 మ్యాచ్ కోసం టిక్కెట్ల విక్రయం జరుగనుంది.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల రంగంలోకి దిగుతున్నారు. శుక్రవారం నుంచి హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం ప్రారంభించనున్నారు. ఈ మేరకు ఆమ్ ఆద్మీ పార్టీ ప్రకటించింది.
రేపు ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థలకు సెలవు ప్రకటించారు అధికారులు. ఇప్పటికే జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో.. జిల్లాలోని కళాశాలలకు, అన్ని విద్యా సంస్థలకు సోమవారం సెలవు ప్రకటించినట్లు కలెక్టర్ స్వప్నిల్ దినకర్ వెల్లడించారు.
ప్రధాని మోడీ శనివారం మూడు కొత్త వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లను జెండా ఊపి ప్రారంభించనున్నారు. మూడు రైళ్లలో రెండు సర్వీసులు దక్షిణ రైల్వే జోన్‌కు సంబంధించినవి కావడం విశేషం. కొత్త రైళ్లు తమిళనాడులోని చెన్నై ఎగ్మోర్-నాగర్‌కోయిల్, మదురై-బెంగళూరు కంటోన్మెంట్ మధ్య నడవనున్నాయి.
ప్రధాని మోడీ శుక్రవారం మహారాష్ట్రలో పర్యటించనున్నారు. పర్యటనలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఇదిలా ఉంటే త్వరలోనే మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి.