మహా శివరాత్రి.. దేశంలోనే అతిపెద్ద పండుగ. హిందువుల పండగల్లో ఒకటైన మహా శివరాత్రి పండుగ ఒకటి. శివరాత్రి సందర్భంగా భక్తి శ్రద్ధలతో ఉపవాసం ఉంటారు. రాత్రంతా జాగారం ఉంటారు. ఈ నేపథ్యంలో దేశ వ్యాప్తంగా స్కూల్లు, కాలేజీలకు సెలవులు ఇచ్చారు. అంతేకాకుండా బ్యాంకులు కూడా సెలవులు ప్రకటించాయి.
భారతదేశంలోని ఎలక్ట్రిక్ బైక్ ప్రియులకు శుభవార్త..! ఓలా ఎలక్ట్రిక్ రోడ్‌స్టర్ X ఎలక్ట్రిక్ బైక్‌ను భారత మార్కెట్లో విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఈ బైక్ టీజర్‌ను ఓలా తాజాగా విడుదల చేసింది. అధికారిక లాంచ్ రేపు (ఫిబ్రవరి 5, 2025)న జరగనుంది. అయితే.. ఈ ఎలక్ట్రిక్ బైక్ కు సంబంధించిన ప్రత్యేక ఫీచర్లపై ఓ నజర్ వేసేద్దాం.
రేపటి నుంచి నాగోబా జాతర మొదలవనుంది. మంగళవారం రాత్రి నాగోబాకు మెస్రం వంశీయులు మహాపూజ చేయనున్నారు. కాగా.. కేస్లాపూర్ నాగోబా జాతర రేపు రాత్రి గంగాజలాభిషేకం, మహా పూజతో ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరుగుతుంది. ఆదిశేషుని నాగోబా జాతర దేశంలోనే రెండో అతిపెద్ద గిరిజన జాతర కావడం తెలంగాణకు ప్రత్యేకతను తెచ్చిపెట్టింది.
జేఈఈ మెయిన్-2025 సెషన్-1 పరీక్షలు రేపటి(బుధవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నెల 30 వరకు ఈ పరీక్షలు జరుగనున్నాయి. ఈ నెల 22 నుంచి జరగనున్న జేఈఈ మెయిన్ పరీక్షలను రెండు దశల్లో నిర్వహిస్తున్నారు.
రేపు ఈడీ కార్యాలయంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విచారణకు హాజరు కానున్నారు. ఉదయం10.30 గంటలకు ఈడీ కార్యాలయానికి వెళ్లనున్నారు. నంది నగర్ నివాసం నుంచి 10 గంటలకు బయలుదేరనున్నారు కేటీఆర్. ఫార్ములా-ఈ కార్ కేసులో భాగంగా ఈడీ అధికారులు కేటీఆర్‌ను విచారించనున్నారు.
ఢిల్లీ ముఖ్యమంత్రి అతిషి మంగళవారం నామినేషన్ దాఖలు చేయనున్నారు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ దాఖలు చేయాల్సి ఉంది. భారీ ర్యాలీగా వెళ్లడంతో సమయం దాటిపోయింది.
రేపు మధ్యాహ్నం (శుక్రవారం) సచివాలయంలో అన్ని జిల్లాల కలెక్టర్లతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించనున్నారు. సమావేశంలో భాగంగా.. రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, అభివృద్ధి కార్యక్రమాలపై చర్చించనున్నారు.
దేశ రాజధాని ఢిల్లీలో ఎన్నికల వాతావరణం వచ్చేసింది. త్వరలోనే హస్తినలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసేందుకు కేంద్ర ఎన్నికల సంఘం కసరత్తు చేస్తోంది.