జార్ఖండ్‌లో బుధవారం తొలి విడత పోలింగ్ జరగనుంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఎన్నికల సిబ్బంది.. ఈవీఎంలు తీసుకుని పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్తున్నారు. మరోవైపు ఎన్నికల అధికారులు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భారీ భద్రత ఏర్పాటు చేశారు. రాష్ట్రంలో 81 నియోజకవర్గాలు ఉండగా నవంబర్ 13న 15 జిల్లాల్లోని 43 అసెంబ్లీ స్థానాలకు పోలింగ్ జరగనుంది. ప్రధానంగా ఇండియా కూటమి-ఎన్డీఏ కూటమిల మధ్య పోటీ నెలకొంది.
పోటీలో 334 మంది స్వతంత్ర అభ్యర్థులు కూడా ఉన్నారు. రాష్ట్రంలోని అన్ని స్థానాల్లో 1211 మంది అభ్యర్థులు పోటీ చేయగా.. మొదటి దశలో 43 స్థానాల్లో 683 మంది అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. వీరిలో 609 మంది పురుషులు, 73 మంది మహిళలు, ఒక థర్డ్ జెండర్ అభ్యర్థి ఉన్నారు. జార్ఖండ్‌లో రెండు విడతల్లో పోలింగ్ జరుగుతోంది. తొలి విడత నవంబర్ 13న జరుగుతుండగా.. రెండో విడత నవంబర్ 20న జరగనుంది. ఎన్నికల ఫలితాలు మాత్రం నవంబర్ 23న విడుదల కానున్నాయి.
ఇది కూడా చదవండి:Harish Rao: రుణమాఫీ చేస్తానని దేవుళ్ల మీద ఒట్టేసి మాట తప్పారు..