డా. బీఆర్ అంబేద్కర్ సచివాలయ ప్రాంగణంలో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు భూమి పూజ చేయనున్నారు. రేపు ఉదయం 11:00 గంటలకు ఈ కార్యక్రమం జరుగనుంది. భూమి పూజ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు హాజరుకానున్నారు.
దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు వైద్య సేవలు స్తంభించనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు ఒక రోజంతా వైద్య సేవలు నిలిచిపోనున్నాయి. కోల్‌కతా వైద్యురాలి హత్యాచార ఘటనకు నిరసనగా నిర్ణయం తీసుకుంది.
దేశ ఆర్థిక రాజధాని ముంబై-అహ్మదాబాద్ మధ్య త్వరలో వందే భారత్ రైలు ప్రారంభం కానుంది. రేపు (ఆగస్టు 9న) 20 కోచ్‌లతో తొలి వందేభారత్ రైలు ట్రయల్‌ని భారతీయ రైల్వే నిర్వహించబోతోంది. 130 కి.మీ వేగంతో ప్రయాణించే ఈ రైలును తొలిసారిగా ట్రయల్ చేయనున్నారు. అహ్మదాబాద్-వడోదర-సూరత్-ముంబై సెంట్రల్ మధ్య రైలు ట్రయల్ రన్ జరుగనుంది. ఉదయం 7 గంటలకు అహ్మదాబాద్ స్టేషన్ నుండి బయలుదేరి మధ్యాహ్నం 12:15 గంటలకు ముంబై సెంట్రల్ చేరుకుంటుంది.
బంగ్లాదేశ్‌లో తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. గురువారం కొత్త ప్రభుత్వం ఏర్పాటు కాబోతుందని ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్-ఉజ్-జమాన్ బుధవారం తెలిపారు.
గురు పౌర్ణమి సందర్భంగా తిరుమల శ్రీవారి ఆలయంలో రేపు (ఆదివారం) గరుడసేవ జరుగనుంది. ప్రతినెలా పౌర్ణమి పర్వదినాన టీటీడీ గరుడ సేవ నిర్వహిస్తున్న విషయం విదితమే. ఇందులో భాగంగా రాత్రి 7 నుండి 9 గంటల నడుమ సర్వాలంకార భూషితుడైన శ్రీమలయప్ప స్వామివారు గరుడునిపై తిరుమాడ వీధులలో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
టీ20 వరల్డ్ కప్ 2024లో భారత్ టైటిల్ సాధించిన విజయం తెలిసిందే.. దీంతో దాదాపు 17 ఏళ్ల తర్వాత ఐసీసీ ట్రోఫీని టీమిండియా సొంతం చేసుకుంది. జూన్ 29న బార్బడోస్లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో భారత్ ఉత్కంఠ భరిత విజయం సాధించింది. ఇదిలా ఉంటే.. తుఫాన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయిన టీమిండియా, ఈరోజు బార్బడోస్ నుంచి స్వదేశానికి బయల్దేరింది. సుమారు 16 గంటల ప్రయాణం తర్వాత గురువారం ఉదయం 6.00 గంటలకు భారత ఆటగాళ్లు ఢిల్లీ ఎయిర్…
తెలంగాణలో ఇంటర్మీడియట్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు రేపు (జూన్ 24న) విడుదల కానున్నాయి. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ ఫలితాలకు సంబంధించి బోర్డు అధికారులు కసరత్తు పూర్తి చేశారు.
వేసవి సెలవులు అనంతరం స్కూళ్లు పున:ప్రారంభం కానున్నాయి. తెలంగాణలో రేపటి (జూన్ 12) బుధవారం నుంచి బడులు తెరుచుకోనున్నాయి. నేటితో వేసవి సెలవులు ముగియడంతో జూన్ 12 నుంచి తరగతుల్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్లలో విద్యా సంవత్సరం ప్రారంభం కానుంది. తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల్లో చేరికల్ని ప్రోత్సహించేందుకు ఇప్పటికే బడిబాట కార్యక్రమాన్ని ప్రారంబించారు. గతవారం నుంచి.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా బడిబాట ప్రారంభమైంది. అందులో భాగంగానే జూన్ 12వ తేదీన తెలంగాణ సీఎం…
రేపు (మంగళవారం) లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి. ఎన్నికల ఫలితాల కోసం ప్రజలు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే.. రేపు ఫలితాలు వెలువడిన తర్వాత ఇండియా కూటమి నేతలు ఢిల్లీలో సమావేశం కానున్నట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత తదుపరి చర్యలపై చర్చించడానికి సమావేశం ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు వర్గాలు తెలిపాయి. కాగా.. కూటమి నేతలు సమావేశం రేపు సాయంత్రం లేదా బుధవారం జరుగుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.