Ponnam Prabhakar: తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ.. వాటికి ట్యాక్స్ ఫ్రీ
- తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ
- జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు
- ఎలక్ట్రిక్ వాహనాలకు రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు
- హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నాం- పొన్నం ప్రభాకర్
- ఢిల్లీలా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదు -మంత్రి పొన్నం ప్రభాకర్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
తెలంగాణలో రేపటి నుంచి నూతన ఈవీ పాలసీ రానుందని రాష్ట్ర రోడ్డు, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. జీవో 41 ద్వారా కొత్త ఈవీ పాలసీ అమలు కానుందని అన్నారు. వాయు కాలుష్యాన్ని నియత్రించేందుకు ఈవీ (ఎలక్ట్రిక్ వెహికల్) పాలసీ తీసుకొచ్చామని మంత్రి పొన్నం పేర్కొన్నారు. ఈ పాలసీ రేపటి నుంచి (నవంబర్ 18) 2026 డిసెంబర్ 31 వరకు అమల్లో ఉంటుందన్నారు. జీవో ప్రకారం.. ఈవీల్లో 4 వీలర్స్, టూవీలర్స్, కమర్షియల్ వెహికల్స్ కు వందశాతం పన్ను మినహాయింపు, రిజిస్ట్రేషన్ ఫీజు మినహాయిపు ఉంటుందని మంత్రి తెలిపారు.
Also Read
అలాగే.. హైదరాబాద్ పరిధిలో ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఢిల్లీలా హైదరాబాద్‌లో కాలుష్యం సమస్య తలెత్తకూడదని ఎలక్ట్రిక్ బస్సులను తీసుకొస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. అలాగే.. ఈవీ వాహనాల వల్ల వినియోగదారులకు ఏడాదికి సుమారు రూ. లక్ష మిగులుతాయని చెప్పారు. ఈ క్రమంలో.. ప్రజలు ఎలక్ట్రిక్ వెహికల్స్ కొనుగోళ్లపై దృష్టి పెట్టాలని మంత్రి సూచించారు.
Read Also: Mahesh Kumar Goud: ఫోటో షూట్ కోసమే మూసీ నిద్ర.. మూడు నెలలు బస చేయండని సవాల్
తాజావార్తలు
-
Ind vs WI : అభిషేక్ శర్మ మెరుపు అర్ధశతకం.. వెస్టిండీస్‌పై భారత్ ఘన విజయం.!
-
CM Revanth Reddy: గోవాలో బీజేపీపై రేవంత్ రెడ్డి ఫైర్.. ‘ప్రాపర్టీ సావంత్’ అంటూ సెటైర్లు!
-
Naresh: సినిమా నచ్చకపోతే గచ్చిబౌలికి రండి.. తేల్చుకుందాం: నరేష్ ఓపెన్ ఛాలెంజ్
-
Ukraine War: రష్యా-ఉక్రెయిన్ మధ్య ‘‘ఎనర్జీ సీజ్-ఫైర్’’.. ట్రంప్ సంచలన ప్రకటన.!
-
Crazy Kalyanam Trailer: రచ్చలేపుతున్న ‘క్రేజీ కల్యాణం’ ట్రైలర్! చూశారా..
ట్రెండింగ్
-
Wife for Hire : అద్దె భార్యలు.. లక్షల నుంచి కోట్ల వరకు ఒప్పందాలు
-
Most Intelligent: 12 ఏళ్ల వయసుకే 180 IQ.. ఐన్‌స్టీన్‌ను మించిన భారతీయ బాలమేధావి..
-
Lunch Recipes: ఇంటికి చుట్టాలొస్తే కంగారేలా.? చిటికెలో సులువుగా చేసుకోగల రకరకాల కమ్మని కూరలు ఇదిగో..!
-
EPFO Update: పీఎఫ్ డబ్బుల డ్రాపై ఈపీఎఫ్ఓ కొత్త రూల్.. ఇకపై ఆ ఫారమ్‌లు పనిచేయవు!
-
Cockroach Control Tips: వంటింట్లో బొద్దింకలు తిరుగుతూ చికాకు తెప్పిస్తున్నాయా.? ఈ చిట్కాతో శాశ్వతంగా సమస్యకు చెక్ పెట్టండి..!