శాండిల్‌వుడ్ బాద్షా కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటిస్తోన్న చిత్రం ‘విక్రాంత్ రోణ’. ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ జాక్వలైన్ ఫెర్నాండెజ్ ఎంట్రీ గురించి మేకర్స్ అనౌన్స్ చేశారు. నిర్మాత జాక్ మంజునాథ్ మాట్లాడుతూ ‘‘మా సినిమాలో జాక్వలైన్ ఫెర్నాండెజ్ భాగం కావడం చాలా సంతోషంగా ఉంది. ఇది అభిమానులకు, ఫ్యాన్స్‌కు సర్ప్రైజింగ్గా, వారిని థియేటర్స్‌కు రప్పించేలా ఉంటుంది. జాక్వలైన్ చాలా ప్రొఫెషనల్ నటి. కచ్చితమైన సమయానికి షూటింగ్‌కు వచ్చేవారు. ఉదయం 9 గంటలకు సెట్స్‌కు వచ్చి…
ఓ పక్క గోపీచంద్ హీరోగా ‘పక్కా కమర్షియల్’ మూవీ చేస్తూనే దర్శకుడు మారుతి మరో క్యూట్ స్మాల్ లవ్ స్టోరీని కూడా తెరకెక్కించేశాడు. దీనికి సంబంధించిన వార్తలు సోషల్ మీడియాలో గత కొంతకాలంగా చక్కర్లు కొడుతూనే ఉన్నా, మారుతీ మాత్రం ఎప్పుడూ అధికారికంగా తన కొత్త సినిమా గురించి పెదవి విప్పలేదు. అయితే… మంగళవారం ఉదయం మాత్రం చిన్న హింట్ ఇచ్చాడు. దానికి తగ్గట్టుగానే ఆ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్ ను సోషల్ మీడియా ద్వారా…
కొన్ని కాంబినేషన్స్ వినడానికి భలే క్రేజీగా ఉంటాయి. అలాంటిదే ప్రభాస్ – త్రివిక్రమ్ కాంబో! కథానాయకుడిగా పాతిక చిత్రాల మైలురాయికి ప్రభాస్ చేరువ కాబోతున్నా… ఇంతవరకూ త్రివిక్రమ్ డైరెక్షన్ లో అతను ఒక్క సినిమాలోనూ నటించలేదు. దాంతో త్రివిక్రమ్ రాసే డైలాగ్స్ ను ప్రభాస్ నోటి వెంట వినాలని, అలానే ఈ యంగ్ రెబల్ స్టార్ తో చక్కని ఫ్యామిలీ ఎంటర్ టైనర్ ను త్రివిక్రమ్ తీస్తే చూడాలని ఫ్యాన్స్ ఉవ్విళ్ళూరుతున్నారు. Read Also : కాజల్,…
ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో వెన్నెల కిషోర్ స్టార్ కమెడియన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లోని ప్రముఖ హాస్యనటులు జాబితాలో ఆయన ముందు వరుసలో ఉంటాడు. తాజాగా ఈ హాస్యనటుడు దర్శకుడిగా మారబోతున్నాడట. కిషోర్ గతంలో “వెన్నెల 1 1/2” అనే కామెడీ ఎంటర్టైనర్ కోసం మెగాఫోన్‌ను పట్టుకున్నాడు. ఈ చిత్రానికి అంతగా ఆదరణ అయితే రాలేదు కానీ కిషోర్ దర్శకత్వ ప్రతిభకు మంచి మార్కులు పడ్డాయి. ఇప్పుడు మరోసారి వెన్నెల కిషోర్ మెగాఫోన్‌ను పట్టబోతున్నాడట.…
సినీ ఎగ్జిబిటర్స్ సమస్యలను ముఖ్యమంత్రి కేసీఆర్ దృష్టికి తీసుకెళ్ళి వాటి పరిష్కారానికి కృషి చేస్తానని… సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. తెలంగాణా స్టేట్ ఫిలిం చాంబర్ ఆఫ్ కామర్స్ ఆధ్వర్యంలో మంత్రిని కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కరోనా మహమ్మారి కారణంగా సుమారుగా ఒక సంవత్సరం నుండి సినిమా దియేటర్లు పూర్తిగా మూసి ఉన్నాయని మంత్రికి వివరించారు. read also : ఆసక్తిగా మారిన వైరా టీఆర్ఎస్ రాజకీయం !…
తెలుగు చిత్రసీమలోని ఇప్పుడున్న ఎంతోమంది సినిమాటోగ్రాఫర్స్ కు ప్రత్యక్షంగానూ, పరోక్షంగానూ గురువుగా నిలిచారు వి.ఎస్.ఆర్.స్వామి. ఆయన కెమెరా పనితనంతో రూపొందిన అనేక చిత్రాలు జనానికి కనువిందు చేశాయి. తెలుగు చిత్రసీమలో తొలి సినిమాస్కోప్-ఈస్ట్ మన్ కలర్ చిత్రంగా తెరకెక్కిన ‘అల్లూరి సీతారామరాజు’కు ఆయనే సినిమాటోగ్రాఫర్. బ్లాక్ అండ్ వైట్ కాలంలోనే తన కెమెరా పనితనంతో జనాన్ని ఆకట్టుకున్నారు స్వామి. నలుపు-తెలుపు చిత్రాలలో సందర్భానుసారంగా ‘సిల్హౌట్స్’ను ఉపయోగించి మెప్పించారు. రంగుల చిత్రాలలోనూ సందర్భానికి తగిన యాంగిల్స్ తో రంజింపచేశారు.…
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు థియేటర్ల రీ ఓపెనింగ్ విషయమై హాట్ హాట్ చర్చ నడుస్తోంది. బిగ్ స్క్రీన్స్ ను తిరిగి తెరవడానికి ప్రభుత్వం అనుమతించినప్పటికీ ఎగ్జిబిటర్లు మాత్రం మరికొంత సమయం పడుతుందని అంటున్నారు. దానికి కారణం థియేటర్లలో 50% ఆక్యుపెన్సీకి మాత్రమే అనుమతినివ్వడం, ఆంధ్రప్రదేశ్ కేవలం మూడు ప్రదర్శనలకు మాత్రమే అనుమతి ఇవ్వడం వంటి విషయాలు. అలాగే తెలంగాణలో ప్రభుత్వం అన్ని ప్రదర్శనలను అనుమతించినప్పటికి రాత్రి 10 నుండి నైట్ కర్ఫ్యూ అమలులో ఉంది. ఇక ఇటీవల…
మనం పుట్టిన ఊరు గురించి, మన సంస్కృతి, సంప్రదాయల గురించి ఏ స్థాయికి చేరుకున్నా పట్టించుకోవాలి. అలాంటి పని స్టార్స్ చేసినప్పుడు ఆ ప్రాంతానికి, ఆ సంస్కృతికి మరింత విలువ పెరుగుతుంది. ఈ విషయంలో విజయ్ దేవరకొండ తోపు అనే చెప్పాలి. ఆ మధ్య నల్లమల అడవుల్లో యురేనియం కోసం త్రవ్వకాలు జరుపబోతున్నారని తెలిసి తన నిరసన గళం విప్పిన విజయ్ దేవరకొండ ఇప్పుడు కాకతీయుల కాలం నాటి రామప్ప దేవాలయానికి ప్రపంచ వారసత్వ హోదా కల్పించడం…
తొమ్మిది కథల సమాహారంగా రూపొందుతూ ప్రారంభం నుంచి అందరిలో ఆసక్తి కలిగించిన అంథాలజీ ‘నవరస’. ఏస్ డైరెక్టర్ మణిరత్నంతో పాటు ప్రముఖ రైటర్, ఫిల్మ్ మేకర్ జయేందర్ పంచపకేశన్ సమర్పణలో రూపొందిన ఈ అంథాలజీ ఆగస్ట్ 6న ‘నెట్‌ఫ్లిక్స్’లో స్ట్రీమింగ్ కాబోతోంది. మానవ జీవితంలోని భావోద్వేగాలు తొమ్మిది. వీటిని నవరసాలు అని అంటాం. వీటి ఆధారంగా ‘నవరస’ రూపొందింది. రీసెంట్గా విడుదలైన టీజర్ అందులోని నటీనటులు, సాంకేతిక నిపుణులు కాంబినేషన్ ఈ అంథాలజీపై చాలా ఆసక్తిని పెంచింది.…
నటసింహా నందమూరి బాలకృష్ణ, స్టార్ డైరెక్టర్ బోయపాటి కాంబినేషన్లో తెరకెక్కుతున్నమూడో చిత్రం ‘అఖండ’ మీద భారీ స్థాయిలో క్రేజ్ నెలకొంది. ద్వారకా క్రియేషన్స్ బ్యానర్ మీద మిర్యాల రవీందర్ రెడ్డి ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. ఇప్పటికే బాలకృష్ణను ‘అఖండ’ గా పరిచయం చేస్తూ వదిలిన టీజర్ కు సోషల్ మీడియాలో ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది. ఆ టీజర్ లో బాలకృష్ణ నట విశ్వరూపానికి యూట్యూబ్‌లో రికార్డ్ స్థాయిలో వ్యూస్ వచ్చాయి. read also : ముద్దులు అయిపోయాయి!…