అనితరసాధ్యం అర్చన అభినయం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నలుపు నారాయణుడు మెచ్చు అంటారు. నలుపుతోనూ వలపుగేలం వేయవచ్చుననీ కొందరు నిరూపించారు. నలుపున్నా జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా గెలుపు చూసిన మేటి నటి అర్చన. ఎలా ఉంటేనేం? అర్చన అభినయంలో ఓ అందం ఉండేది. ఆ చూపుతోనే బంధాలు వేసే శక్తీ ఆమె సొంతమే! వాటిని మించి సుగంధాల వాసనలాంటి లావణ్యం అర్చనలో తిష్టవేసుకుంది. ఇన్ని లక్షణాలున్న తరువాత నలుపు, తెలుపుతో పనేంటి!? అర్చనను ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ ఎందరో కీర్తించారు. వరుసగా రెండు సార్లు జాతీయ స్థాయిలో ఉత్తమ నటిగా నిలచి, విమర్శకుల మదినీ గెలిచారు. ఇక జనం మనసుల్లో చెరిగిపోని ముద్ర వేసుకున్నారు. అర్చన చిత్రసీమలో తనకంటూ ఓ ప్రత్యేక స్థానం సంపాదించారు.
అర్చన అసలు పేరు సుధ. పుట్టింది విజయవాడలో. బాల్యంలోనే అర్చన కుటుంబం మద్రాసు చేరింది. నల్లగా, పీలగా ఉన్నా అర్చనలో ఏదో ఆకర్షించే అందం ఉందని గమనించారు సినీజనం. ‘తాయ్ పొంగల్’ అనే తమిళ చిత్రంలో తొలిసారి నటించిన అర్చన, తరువాత భారతీరాజా ‘కాదల్ ఓవియమ్’లో ఓ చిన్న పాత్రతోనే మంచి గుర్తింపు సంపాదించారు. మాతృభాష తెలుగులో ‘మధురగీతం’ అనే చిత్రంలో తొలిసారి నటించారు అర్చన. బాలు మహేంద్ర తెలుగులో తెరకెక్కించిన ‘నిరీక్షణ’లో అర్చన అందం అయస్కాంతంలా కుర్రకారును ఆకర్షించింది. వంశీ ‘లేడీస్ టైలర్’లో నిండుగా చీరకట్టుకొని కవ్వించింది అర్చన అందం. “ఉక్కు సంకెళ్ళు, దాసి, యోగివేమన, మట్టి మనుషులు, భారత్ బంద్, చక్రవ్యూహం, పచ్చతోరణం, పోలీస్ వెంకటస్వామి” వంటి సినిమాల్లో అర్చన నటించారు. వీటిలో “లేడీస్ టైలర్, భారత్ బంద్” మంచి విజయం చూశాయి. ఎన్ని చిత్రాల్లో నటించినా, ఈ నాటికీ ఆ నాటి కుర్రకారు అర్చన పేరు వినగానే ‘నిరీక్షణ’ సినిమానే గుర్తు చేసుకుంటారు.
Also Read
తమిళ, మళయాళ భాషల్లోనూ అర్చన తనదైన బాణీ పలికించారు. కమర్షియల్ మూవీస్ లో కంటే ఆఫ్ బీట్ సినిమాల్లోనే అర్చన ఎక్కువగా నటించారు. తన పర్సనాలిటీకి ఆ పాత్రలే నప్పుతాయని ఆమె చెప్పేవారు. 1987లో బాలు మహేంద్ర తెరకెక్కించిన తమిళ చిత్రం ‘వీడు’లో ‘నిరీక్షణ’ జోడీ – అర్చన, భానుచందర్ నటించారు. ఆ సినిమా ద్వారా అర్చనకు తొలిసారి జాతీయ స్థాయిలో ఉత్తమనటిగా అవార్డు లభించింది. ఆ మరుసటి సంవత్సరమే బి.నరసింగరావు రూపొందించిన ‘దాసి’ తెలుగు చిత్రం ద్వారా కూడా ఆమెకు మరో నేషనల్ అవార్డు దక్కింది. నటిగా తనదైన బాణీ కొన్ని చిత్రాలలోనే ప్రదర్శించగలిగారు అర్చన. అయితేనేం, జనం మరచిపోలేని నటనతో వారి మదిలో చెదరని స్థానం సంపాదించారామె.
తాజావార్తలు
-
Harmanpreet Kaur History: 37 ఏళ్ల వయసులోనూ తగ్గేదేలే.. వన్డేల్లో మొదటి బ్యాటర్‌గా హర్మన్‌ప్రీత్ చరిత్ర!
-
Ramayana Song: “కాపీ కొట్టేశాడా..?”.. రామాయణం సాంగ్‌లో ఏఆర్ రెహమాన్ ట్యూన్‌పై నెటిజన్ల ఫైర్..
-
China: సినిమా హీరోలా? సైన్స్ వీరులా? ప్రపంచానికి కళ్లు తెరిపించిన చైనా
-
Cyclone Arnab Alert: దూసుకొస్తున్న అర్నబ్ తుపాను.. నేడు పలు జిల్లాల్లో వర్షాలు, ఫ్లాష్ ఫ్లడ్ ముప్పు!
-
US, Russia and Ukraine Talks: రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు? నవంబర్‌లో కీలక త్రైపాక్షిక చర్చలు!
ట్రెండింగ్
-
Harmanpreet Kaur: కెప్టెన్సీ లేకపోతేమి.. బ్యాటింగ్‌ను ఎంజాయ్ చేయడమే నా లక్ష్యం..! హర్మన్‌ప్రీత్ కౌర్ సంచలన వ్యాఖ్యలు.!
-
PAK vs ENG: షాదాబ్ ఖాన్ సంచలన ఇన్నింగ్స్.. ఇంగ్లాండ్ పై పాక్ థ్రిల్లింగ్ విక్టరీ..!
-
IND W vs ZIM W: జింబాబ్వే పై భారత్ విజయం.. సిరీస్ కైవసం..!
-
Fake Note Printing : వామ్మో.. అద్దెకు డబ్బులు లేక.. కరెన్సీ నోట్లే అచ్చేశాడు..
-
Temple Style Daddojanam: టెంపుల్ స్టైల్ “దద్దోజనం” కావాలా నాయన.. నిమిషాల్లో ఇంట్లోనే ఇలా చేసేసుకోండి..!