మెగాస్టార్ చిరంజీవి తాజా చిత్రం ‘ఆచార్య’ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. బాలెన్స్ ఉన్న షూటింగ్ ను కాకినాడ పోర్ట్ లో దర్శకుడు కొరటాల శివ పూర్తి చేసి, అక్కడే గుమ్మడి కాయ కొట్టేస్తాడని అంటున్నారు. ఇదిలా ఉంటే… ‘లూసిఫర్’ మూవీ తెలుగు రీమేక్ రెగ్యులర్ షూటింగ్ తేదీని చిరంజీవి ఖరారు చేశాడని తెలుస్తోంది. ఈ సినిమా మ్యూజిక్ సిట్టింగ్స్ ను ఇప్పటికే దర్శకుడు మోహన్ రాజా మొదలెట్టేశాడు. దర్శక నిర్మాతలు అధికారికంగా చెప్పకపోయినా ఆగస్ట్ 12న ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని అంటున్నారు. అదే విధంగా దీనితో పాటు చిరంజీవి మరో రెండు సినిమాలకు కమిట్ అయ్యారు. అందులో ఒకటి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో బాబీ దర్శకత్వంలో చేయబోయే మూవీ కాగా, మరొకటి తమిళ చిత్రం ‘వేదాలం’ రీమేక్. దీనికి మెహర్ రమేశ్ దర్శకుడు.
Read Also : చొక్కా విప్పిన… బాలీవుడ్ చోటా కండల వీరుడు!
చిత్రం ఏమంటే… చిరంజీవి -బాబీ చిత్రానికి సంబంధించిన ఆసక్తికరమైన వార్త ఒకటి నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. ఈ కథను చిరంజీవి కంటే ముందు క్రేజీ హీరో విజయ్ దేవరకొండకు బాబీ వినిపించాడట. కథ నచ్చినా, డేట్స్ ఖాళీ లేని కారణంగా విజయ్ దేవరకొండ తన అశక్తతను ప్రకటించడంతో, చిరంజీవి ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని కొన్ని మార్పులు చేర్పులు చేసి, బాబీ ఆయనకు వినిపించాడని తెలుస్తోంది. కథ బాగుండటంతో చిరు వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని అంటున్నారు. నిజానికి ‘లూసిఫర్’ రీమేక్ తో పాటే బాబీ మూవీ కూడా సెట్స్ పైకి వెళుతుందని మొదట్లో అనుకున్నారు. కానీ ఆ సినిమాను పూర్తి చేసిన తర్వాత చిరంజీవి – బాబీ మూవీని సెట్స్ పైకి తీసుకెళదామని చెప్పారట. సో… ఆ రకంగా ఈ యేడాది చివరిలో దీని రెగ్యులర్ షూటింగ్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. విశేషం ఏమంటే… చిరంజీవితో సూపర్ డూపర్ హిట్ కొట్టాలని భావిస్తున్న బాబీ.. ఇప్పటికే దేవిశ్రీ ప్రసాద్ తో మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా మొదలెట్టేశాడు. ఒకటి రెండు ట్యూన్స్ ను కూడా లాక్ చేశాడని తెలుస్తోంది. మరి మెగాస్టార్ కు వీరాభిమాని అయిన బాబీ ఏ స్థాయి విజయాన్ని ఆయనకు అందిస్తారో చూడాలి.