టాలీవుడ్ స్టార్ హీరోస్ అండ్ బిగ్ బడ్జెట్ క్రేజీ మూవీస్ శాటిలైట్ హక్కుల్ని ‘స్టార్ మా’ కైవసం చేసుకుంది. నిజానికి ఇందులో కొన్ని సినిమాలు ఇప్పటికే థియేట్రికల్ రిలీజ్ కావాల్సినవి. కానీ కరోనా సెకండ్ వేక్ కారణంగా వాటి షూటింగ్ పూర్తి కావడమే కాదు రిలీజ్ కూడా రీషెడ్యూల్స్ అయ్యాయి. ఇంతకూ స్టార్ మా శాటిలైట్ హక్కులు సొంతం చేసుకున్న చిత్రాలేవో తెలుసుకుందాం. ఎన్టీయార్, రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న రియల్ మల్టీస్టారర్ మూవీ ‘ట్రిపుల్…
రైటర్ గా పలు విజయవంతమైన చిత్రాలకు రచన చేసిన కొరటాల శివ, దర్శకుడిగా మెగా ఫోన్ పట్టుకున్న తర్వాత అపజయాన్నే ఎరగలేదు. అయితే కొంతకాలంగా సోషల్ మీడియా ద్వారా తన చిత్రాలకు సంబంధించిన విశేషాలను, తన కార్యకలాపాలను కొరటాల శివ అభిమానులతో పంచుకుంటూ వచ్చారు. కానీ ఇప్పుడు ఇక సోషల్ మీడియాలో కొనసాగాలనుకోవడం లేదని కొరటాల శివ తెలిపారు. ఇకపై మీడియా మిత్రుల ద్వారా తన చిత్రాలకు సంబంధించిన సమాచారాన్ని తెలియచేస్తానని ఆయన చెబుతున్నారు. జనాలతో తన…
కరోనా కారణంగా థియేటర్లు మూతపడటంతో ఓటీటీ ప్లాట్ ఫామ్స్ కు విశేషమైన ఆదరణ లభిస్తుందని అంతా భావించారు. అయితే… తెలుగులో ఒక్క ఆహా తప్పితే మరే ఓటీటీ సంస్థ తెలుగు నిర్మాతల ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చలేకపోతోంది. గత యేడాది కరోనా సందర్భంలో అమెజాన్ ప్రైమ్ తెలుగు మార్కెట్ ను కాప్చర్ చేయాలని, తన సత్తా చాటాలనీ భావించింది. దానికి అనుగుణంగా రెండు పెద్ద చిత్రాలను డైరెక్ట్ ఓటీటీ కోసం తీసుకుని విడుదల చేసింది. కానీ ఆశించిన స్థాయిలో…
ఈ మధ్య ఆన్ లైన్ మోసాలు విపరీతంగా జరుగుతున్నాయి. కొందరు మోసగాళ్లు… బడా నాయకులను, ప్రముఖులను టార్గెట్ చేసి మరీ.. డబ్బులు కొట్టేస్తున్నారు. అయితే.. తాజాగా కరోనా వ్యాక్సిన్లను అడ్డుపెట్టుకుని ఘరానా మోసానికి పాల్పడ్డాడు. నిర్మాత సురేష్ బాబును వ్యాక్సిన్ పేరుతో ఓ కేటుగాడు బురిడీ కొట్టించాడు. తన దగ్గర వ్యాక్సీన్ లు ఉన్నాయని లక్ష రూపాయలు కొట్టేశాడు ఆ కేటుగాడు. అసలు వివరాల్లోకి వెళితే.. ఓ కేటుగాడు తన దగ్గర కరోనా వ్యాక్సిన్లు ఉన్నాయని సురేష్…
లాక్ డౌన్ తొలగింది. టాలీవుడ్ లో షూటింగ్ ల సందడి మొదలైంది. ఇది ఓ వైపు చిత్రం… మరో వైపు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో అంతర్గతంగా ఎన్నికల హడావుడి కూడా ఆరంభం అయంది. రెండేళ్ళకోసారి జరిగే మా ఎన్నికలు ఈ సారి కూడా రసవత్తర పోరుకు తెరతీయబోతున్నాయి. ప్రస్తుత కమిటీ కాలపరిమితి ముగిసినా… కరోనా వల్ల ఈ సారి కొత్త కమిటీ ఎంపిక ఆలస్యం అయింది. లాక్ డౌన్ తొలిగిన నేపథ్యంలో మళ్ళీ ‘మా’లో ఎన్నికల…
తెలుగు చిత్రసీమలో ఈ రోజున తొడలు చరిచి, మీసాలు మెలేసి, వీరావేశాలు ప్రదర్శించే సన్నివేశాలు కోకొల్లలుగా కనిపిస్తూ ఉంటాయి. అలాంటి సీన్స్ కు ఓ క్రేజ్ తీసుకు వచ్చిన ఘనత నిస్సందేహంగా పరుచూరి సోదరులదే! ఇక పురాణగాథలను, సాంఘికాలకు అనువుగా మలచడంలోనూ సిద్ధహస్తులు ఈ సోదరులు. వీరిలో అగ్రజుడు పరుచూరి వెంకటేశ్వరరావు, అనుజుడు గోపాలకృష్ణ. ఇద్దరూ ఇద్దరే! దాదాపు నలభై ఏళ్ళ క్రితం మహానటుడు యన్టీఆర్ ఈ సోదరులకు ‘పరుచూరి బ్రదర్స్’ అని నామకరణం చేసి, తన…
యోగసాధన అంటే కేవలం వ్యాయామం కాదు. శారీరక, మానసిక, ఆధ్యాత్మిక వికాసానికి తోడ్పడే అద్భుత సాధనం యోగ. ప్రపంచానికి యోగాను బోధించిన ఘనత భారతదేశానిదే. యోగసాధనతో సంపూర్ణ ఆరోగ్యం సంపాదించవచ్చునని లోకానికి చాటారు ఎందరో. పతంజలి మహర్షి ప్రతిపాదించిన లక్షకు పైగా యోగసూత్రాలను తరువాత ఎందరో సంక్షిప్తం చేస్తూ, నవీన సమాజానికి తగిన యోగాభ్యాసాలను, ధ్యాన మార్గాలనూ సూచించారు. వీటిని తు.చ. తప్పక పాటించిన వారి తీరే మారిపోతుందని పెద్దల మాట! మన సినిమా రంగంలో యోగసాధనతోనే…
‘కేజిఎఫ్’ సినిమాతో దేశవ్యాప్తంగా ఫేమ్ ను సంపాదించుకున్నాడు యష్. ఆఒక్క చిత్రంతో రాకీభాయ్ క్రేజ్ పెరిగిపోయింది. కాగా అమధ్యే ‘కేజిఎఫ్ చాప్టర్ 2’ షూటింగ్ ను కూడా పూర్తి చేశాడు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు. అయితే కేజిఎఫ్ చాప్టర్ 2 షూటింగ్ పూర్తి చేసి నెలలు గడుస్తున్న రాకీభాయ్ చేయబోయే తదుపరి చిత్రంపై ఇంకా క్లారిటీ రాలేదు. కరోనా సెకండ్ వేవ్, లాక్ డౌన్ రావడంతో పూర్తిగా ఫ్యామిలీతోనే గడిపేశాడు యష్. అయితే…
(జూన్ 20న ఫాదర్స్ డే) “నాన్న అనే రెండక్షరాలు… మరపురాని మధురాక్షరాలు…” అంటూ ‘దీక్ష’ చిత్రంలో ఘంటసాల గళం పల్లవించగా, నటరత్న అభినయంతో అలరించింది ఆ పాట. ఇక ‘ధర్మదాత’లో “ఓ నాన్నా… నీ మనసే వెన్న… అమృతం కన్నా… అది ఎంతో మిన్నా…” అంటూ మరోమారు ఘంటసాల గాత్రంలోనే ఆ గీతం జాలువారింది. నటసమ్రాట్ నటనతో ఆ పాట కూడా జనాన్ని ఎంతగానో ఆకట్టుకుంది. “బృందావనమొక ఆలయమూ…మాధవుడందలి దైవమూ…” అంటూ ‘భలేకృష్ణుడు’లో బాలు గొంతులో సాగిన…