ప్రముఖ నటుడు, భారీ చిత్రాల నిర్మాత బండ్ల గణేష్ కథానాయకుడిగా పరిచయమవుతున్న సంగతి తెలిసిందే. వెంకట్ చంద్రను దర్శకుడిగా పరిచయం చేస్తూ స్వాతి చంద్ర ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా చిత్రీకరణ శనివారం ప్రారంభమైంది. శరవేగంగా షూటింగ్ జరుగుతోంది. ఈ సందర్భంగా దర్శక – నిర్మాతలు మాట్లాడుతూ “తమిళ హిట్ చిత్రం ‘ఒత్తు సెరుప్పు సైజ్ 7’కి రీమేక్ ఇది. తమిళంలో పార్తిబన్ గారు పోషించిన పాత్రను తెలుగులో బండ్ల గణేష్ చేస్తున్నారు. ఈ హీరో…
శివ కేశరకుర్తి దర్శకత్వంలో శ్రీ వెన్నెల క్రియేషన్స్ బ్యానర్‌పై ఎం.సుధాకర్ రెడ్డి ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. దీని ద్వారా సూపర్‌స్టార్ కృష్ణ, విజయనిర్మల ఫ్యామిలీకి శరణ్ కుమార్ హీరోగా పరిచయం అవుతున్నారు. శనివారం శరణ్ కుమార్ పుట్టినరోజు ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి గ్లింప్స్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఆవిరి పట్టిన అద్దాన్ని తుడిస్తే అందులో హీరో శరణ్ కుమార్ ముఖం కనిపించేలా ఈ గ్లింప్స్ ఉంది. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే కృష్ణ……
‘ఫలక్‌నుమాదాస్’ నుంచి ‘పాగల్’ వరకు వైవిధ్యమైన కథా చిత్రాలతో మెప్పిస్తున్నాడు యంగ్ హీరో విష్వక్ సేన్. అతను హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘అశోకవనంలో అర్జున కళ్యాణం’. ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్. ప్రసాద్ సమర్ఫణలో ఎస్వీసీసీ డిజిటల్ బ్యానర్‌పై బాపినీడు, సుధీర్ ఎదర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విద్యాసాగర్ చింత దర్శకుడు. శనివారం ఈ సినిమా టైటిల్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. ఇందులో హీరో విష్వక్ సేన్ ఇది వరకు…
బుల్లితెరపై బిగ్ బాస్ షోకు ప్రత్యేకమైన స్థానం ఉంది. తెలుగులో ప్రసారం అవుతున్న రియల్టీ షోలో బిగ్ బాస్ నెంబర్ వన్ స్థానంలో దూసుకెళుతోంది. గతేడాది కరోనా కారణంగా ఎన్నో జాగ్రత్తలు తీసుకొని నిర్వాహకులు షోను నిర్వహించాల్సి వచ్చింది. బిగ్ బాస్-4 సీజన్ కు కింగ్ నాగార్జున హోస్టుగా నిర్వహించగా మధ్యలో ఒకసారి సమంత, రమకృష్ణ వంటి స్టార్లు సందడి చేసి ఆకట్టుకున్నారు. గతేడాది కరోనా కారణంగా బిగ్ బాస్-4 సీజన్ చప్పగా మొదలైంది. అయితే క్రమంగా…
సెప్టెంబర్ 2న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు. ఈ సందర్భంగా నిన్న ఆయనకు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. సెలెబ్రిటీల దగ్గర నుంచి అభిమానుల వరకు అంతా నిన్న ఆయన నామజపమే చేశారు. పైగా ఆయన నటిస్తున్న సినిమాల నుంచి వచ్చిన అప్డేట్స్ సోషల్ మీడియాలో పండగ వాతావరణాన్ని తలపించాయి. నిన్న సోషల్ మీడియాను “పవర్” స్టార్మ్ చుట్టు ముట్టేసింది. ఈ నేపథ్యంలో పవన్ ఫ్యాన్స్ అభిమానానికి కృతజ్ఞతలు తెలుపుతూ సోషల్ మీడియాలో ప్రత్యేకంగా…
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్(మా) ఎన్నికలు గతంలోనూ ఎన్నడూ లేనివిధంగా సస్పెన్స్ థ్రిల్లర్ ను తలపించబోతున్నాయి. కేవలం రెండేళ్లపాటు ఉండే మా అధ్యక్ష పదవిని దక్కించుకునేందుకు నటీనటులు తీవ్రంగా పోటీపడుతున్నారు. కేవలం 900మంది సభ్యులు ఉండే మా అసోసియేషన్ కు నిర్వహించడం ఈసారి కత్తిమీద సాములా మారింది. నటీనటుల మధ్య నెలకొన్న ఈగోల వల్ల ఈసారి ఎన్నికలు సాధారణ ఎన్నికలను తలపింపజేస్తున్నాయి. ఒకరిని మించి మరొకరు విమర్శలు చేసుకుంటుండటంతో మా పెద్దలు రంగంలోకి దిగి పరిస్థితిని చక్కదిద్దే ప్రయత్నం…
సిబ్బందికి సెలవులు… ప్రశాంతత కోసం ఒంటరి ప్రయాణం..!స్టార్ హీరోయిన్ సమంత ప్రస్తుతం ఎక్కడ ఉంది. విడాకుల న్యూస్ బయటకు వచ్చిన తర్వాత సమంతకు ప్రశాంతత కరువయిందా!? పీస్ కోసం ఎక్కడకి వెళ్ళింది. అసలు ఎవరితోనూ టచ్ లో లేదా!? ప్రస్తుతం టాలీవుడ్ లో ఇదే హాట్ టాపిక్. పర్సనల్ స్టాప్ కి సెలవు!ఇటీవల కింగ్ నాగ్ బర్త్ డే సందర్భంగా సమంత చేసిన ట్వీట్ తో విడాకుల మాట రూమర్ అని అందరూ భావించారు. అయితే ఆ…
కరోనా మహమ్మారి దేశాన్ని పట్టి పీడిస్తున్న మొదటి నుంచి సోనూసూద్ పేరు వార్తల్లో ఉంది. కరోనాకు ఏమాత్రం జంకకుండా బయటకు రావడమే కాకుండా వలస కార్మికులకు ఆయన చేసిన సేవ హైలెట్ అయ్యింది. దీంతో ఆయన సినిమాలో విలన్ అయినప్పటికీ రియల్ లైఫ్ లో మాత్రం రియల్ హీరో అయ్యారు.. ఇప్పటికీ ఎంతోమందికి రోల్ మోడల్ గా నిలుస్తూ ఆయన చేస్తున్న సేవ స్ఫూర్తిదాయకం. ఆయన చేసిన సేవను ప్రభుత్వాలు కూడా గుర్తించాయి. అందుకే వారు చేసే…
రాష్ట్ర రాజధాని ఇంతగా అభివృద్ధి చెందినప్పటికీ కొన్ని ప్రాంతాల్లో మాత్రం సరైన రోడ్లు లేక ప్రజలు ఇబ్బందులకు గురవుతున్నారు. అయితే సోషల్ మీడియా పుణ్యమా అని అలాంటి విషయాలను నేరుగా పొలిటికల్ లీడర్స్ దగ్గరకు తీసుకెళ్లే అవకాశం లభించింది. ప్రజలను ఇబ్బందులకు గురి చేసే అంశాలను సోషల్ మీడియా ద్వారా రాజకీయ నాయకుల దృష్టిని తీసుకెళ్తూ పలువురు సెలెబ్రిటీలు తమవంతు సామాజిక బాధ్యతను నిర్వర్తిస్తున్నారు. తాజాగా యంగ్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని కూడా 600 కుటుంబాలు నివసించే…
ప్రస్తుతం టాలివుడ్ లో డ్రగ్స్ కేసు సంచలనం రేపుతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే అనుమానం ఉన్న సినీ తారలకు ఈడీ సమన్లు పంపింది. నిన్న దర్శకుడు పూరి జగన్నాథ్ ఈడీ ముందు విచారణకు కూడా హాజరయ్యారు. అయితే ఈ కేసులో నిందితుడిగా ఉన్న కెల్విన్ ఈడీ ముందు అప్రూవర్‌గా మారినట్లు తెలుస్తుంది. 6 నెలల క్రితం కెల్విన్ పై కేసు నమోదు చేసింది ఈడీ. ఎక్సైజ్ కేసు ఆధారంగా కెల్విన్ పై ఈ కేసు నమోదు చేసింది.…