ఈ వారం అదృష్టాన్ని పరీక్షించుకోబోతున్న 4 సినిమాలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ బాక్స్ ఆఫీస్ కు పండగ మొదలైంది. దసరా సీజన్ దగ్గరపడుతోంది. ఈ సీజన్‌లో కొన్ని సినిమాలు ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నాయి. ఈ వారాంతంలో ఒకేసారి నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి. వైష్ణవ్ తేజ్ నటించిన “కొండపొలం”, గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” ఈ శుక్రవారం విడుదలవుతున్నాయి. సెన్సిబుల్ ఫిల్మ్ మేకర్ క్రిష్ దర్శకత్వం వహించిన “కొండపొలం” వైష్ణవ్ తేజ్ కు రెండవ సినిమా. రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమా ట్రైలర్ ఇటీవల విడుదలై ఆకట్టుకుంది. క్రిష్ కూడా సినిమాపై చాలా నమ్మకంగా ఉన్నాడు. ఆయన “కొండపొలం” చిత్రానికి దర్శకత్వం వహించడానికి “హరి హర వీర మల్లు” నుండి విరామం తీసుకున్నట్లు ఇటీవల సినిమా ఆడియో రిలీజ్ వేడుకలో వెల్లడించారు. ఇప్పటికే సినిమాకు సంబంధించిన అన్ని డీల్స్ క్లోజ్ అయ్యాయి. ఈ సినిమా అక్టోబర్ 8న విడుదలకు రెడీగా ఉంది. “ఉప్పెన” లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత వైష్ణవ్ తేజ్ తన అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాడు.
Read Also : సమంత విడాకులపై మౌనం వీడిన తండ్రి
Also Read
- Trump: ట్రంప్ ప్రచార సభలో గందరగోళం.. నిరసనకారుడిని చితకబాదిన మద్దతుదారులు
- Trump Warning: ‘ఇరాన్ను ఏం చేస్తామో చూడండి’.. ట్రంప్ తాజా హెచ్చరిక
- Air India Flight: ఎయిరిండియా విమానం హైజాక్ కలకలం.. జైపూర్లో ఎమర్జెన్సీ ల్యాండింగ్
- Orphaned Wedding: పెళ్లికి రెండు కోళ్లను దానం చేయాలని అనాథ బాలిక విజ్ఞప్తి.. రెస్పాన్స్ ఏ రేంజ్లో ఉందంటే..!
మరోవైపు మాచో హీరో గోపీచంద్ “ఆరడుగుల బుల్లెట్” అంటూ థియేటర్లలో సందడి చేయబోతున్నాడు. నిజానికి ఈ సినిమా ఎప్పుడో పూర్తయ్యింది. కానీ పలు కారణం వల్ల ఇంకా విడుదలకు నోచుకోలేదు. ఇప్పటికే చాలా ఆలస్యమైన ప్రాజెక్ట్ “ఆరడుగుల బుల్లెట్”ను ఎట్టకేలకు విడుదల చేయడానికి ముందుకొచ్చారు మేకర్స్. ఇటీవల గోపీచంద్ నటించిన స్పోర్ట్స్ డ్రామా “సీటిమార్” రిలీజ్ అయ్యి మంచి హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. దీంతో ఇదే మంచి సమయం అని భావించిన “ఆరడుగుల బుల్లెట్” మేకర్స్ వెంటనే సినిమా విడుదల తేదిని ప్రకటించారు. “ఆరడుగుల బుల్లెట్” కూడా శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇటీవల విడుదలైన ట్రైలర్ “ఆరడుగుల బుల్లెట్” కమర్షియల్ అంశాలతో కామెడీ ఎంటర్టైనర్ గా అలరించింది. “ఆరడుగుల బుల్లెట్”లో నయనతార హీరోయిన్.
ఇక ఇదే రోజున “నేను లేని నా ప్రేమకథ”, తమిళ హీరో శివకార్తికేయన్ నటించిన “డాక్టర్” విడుదల కానున్నాయి. ఈ వారాంతంలో నాలుగు సినిమాలు తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నాయి అన్నమాట.
తాజావార్తలు
-
Gold – Silver Prices: రూ. 8 వేలు తగ్గిన వెండి.. బంగారం ఎంత పతనం అయ్యిందంటే!
-
OTR: మన్యం జిల్లా జడ్పీ చైర్మన్ పదవికి ఎస్టీ రిజర్వేషన్.. టీడీపీ నేతల్లో అసంతృప్తి
-
ACP Vivek Bhagat: ‘‘కులం పేరుతో దూషించారు, నా పరువు తీశారు’’.. సీజేపీ నేతలపై ఏసీపీ వివేక్ భగత్ ఫిర్యాదు..
-
Salary Hike 2026-27: ఉద్యోగులకు గుడ్న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!.. ఏ రంగంలో ఎక్కువంటే?
-
India vs West Indies 4th T20: షాయ్ హోప్, రూథర్ఫోర్డ్ విధ్వంసక ఇన్నింగ్స్.. భారత్ ముందు భారీ లక్ష్యం
ట్రెండింగ్
-
రూ.14,999కే itel 5G ఫోన్.. 120Hz డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో City 300 లాంచ్..!
-
Dussehra Special Recipes: కరకరలాడే జంతికల నుంచి స్వీట్ షాప్ స్టైల్ చిక్కీ వరకు పిండివంటలు ట్రై చేయండి..!
-
Qais Ahmad: మాములు యాక్టింగ్ కాదయ్యా.. నీ పెర్ఫార్మన్స్కు ఆస్కార్ కూడా పనికిరాదేమో.! వీడియో వైరల్..
-
టాటా.. బైబై.. గయా.. WCL 2026 లీగ్ స్టేజీలోనే ఇండియా చాంపియన్స్ ఔట్..!
-
How To Grow Tej Patta In Pots: మార్కెట్ నుంచి తెచ్చే పని లేదు.. ఇంట్లోనే ఈజీగా బిర్యానీ ఆకు మొక్కను పెంచండి..