‘మా’ ఎలక్షన్స్ దగ్గర పడుతున్న కొద్దీ ఈసారి అధ్యక్ష పదవి ఎవరు చేపడతారు అన్న విషయం ఆసక్తికరంగా మారుతోంది. అక్టోబర్ 10న అంటే మరో వారం రోజుల్లో జరగనున్న ఈ ఎన్నికలకు సంబంధించిన పరిణామాలు చాలా వేగంగా మారిపోతున్నాయి. ఇప్పటికే అధ్యక్ష పదవికి పోటీ చేస్తానన్న సివిఎల్ నరసింహా రావు తన నామినేషన్ ను విత్ డ్రా చేసుకున్నారు. మరోవైపు బండ్ల గణేష్ సైతం జనరల్ సెక్రటరీ పదవికి స్వతంత్రంగా పోటీ చేస్తానంటూ హడావిడి చేసి చివరి నిమిషంలో నామినేషన్ ను రిటర్న్ తీసుకున్నాడు. ఇక ఇప్పుడు బరిలో ఉన్నది ఇద్దరే ప్రకాష్ రాజ్, మంచు విష్ణు. ప్రకాష్ రాజ్ కు మెగాస్టార్ సపోర్ట్ ఉన్నట్టు మెగా బ్రదర్ నాగబాబు ప్రత్యేక్షంగానే వెల్లడించారు. మంచు విష్ణుకు మాత్రం సూపర్ స్టార్ సపోర్ట్ ఉందని అంటున్నారు. ఇంకా బాలయ్య సైతం ఆయనకు బహిరంగంగానే సపోర్ట్ చేస్తున్నారు.
Read Also : డ్రగ్స్ కేసులో షారుఖ్ తనయుడు అరెస్ట్
తాజాగా ఇదే విషయాన్నీ మరోసారి స్పష్టంగా బాలయ్యతో సన్నిహితంగా ఉన్న ఫోటోను షేర్ చేసి వెల్లడించాడు మంచు విష్ణు. “ఈ ‘మా’ ఎన్నికలలో నన్ను ఆశీర్వదించి, సపోర్ట్ చేసిన నటసింహం బాల అన్నకు ధన్యవాదాలు. మీ మద్దతు లభించడం నాకు గౌరవం” అంటూ బాలయ్యతో జోవియల్ గా ఫోటోలను పంచుకున్నారు మంచు విష్ణు. బాలయ్య ఇదివరకే విష్ణుకు తన సపోర్ట్ అని మీడియా ముఖంగా తెలిపినప్పటికీ మరోసారి ఆయన సపోర్ట్ మంచు విష్ణుకే అనే విషయం బహిర్గతం అయ్యింది.
సెప్టెంబర్ 27 నుంచి 29 వరకూ నామినేషన్లు ప్రక్రియ జరిగింది. ఇప్పటికే ఉపసంహరణకు ఇచ్చిన గడువు కూడా ముగిసింది. నామినేషన్ లను వాపస్ తీసుకోవాలని అనుకున్న వారు తీసుకున్నారు కూడా. అక్టోబర్ 10న ఎన్నికలు జరుగుతున్నాయి. అదే రోజు రాత్రి ఏడు గంటలకు ఫలితాలను కూడా వెల్లడించబోతున్నారు.
Thank you the one and only NataSimham, Bala Anna for you blessings and support for me during these MAA elections. It is my honor to have your backing. ❤️ pic.twitter.com/xvYwBw8ZSz
— Vishnu Manchu (@iVishnuManchu) October 3, 2021