మలయాళంలో సూపర్ హిట్ సాధించిన ‘లూసిఫర్’ చిత్రాన్ని తెలుగులో ‘గాడ్ ఫాదర్’ గా రీమేక్ చేయనున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి హీరోగా, మోహన్ రాజా దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కనుంది. మరికొద్ది రోజుల్లో ఈ మూవీ సెట్స్ మీదకు రానున్న నేపథ్యంలో తాజాగా చిత్రానికి సంబంధించిన ఓ అప్‌డేట్ ను మ్యూజిక్ డైరెక్టర్ తమన్ షేర్ చేశారు.
‘గాడ్ ఫాదర్’ మ్యూజిక్ సెషన్ ను తమన్ ఇదివరకే ప్రారంభించగా, తదుపరి ట్యూన్ అంశాలపై చర్చించారు. తాజాగా దీనికి సంబందించిన ఫోటోలను తమన్ పంచుకున్నారు. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను చిరంజీవి తనయుడు రామ్ చరణ్ నిర్మిస్తున్నారు.
ఇకపోతే ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఆచార్య’ మూవీ త్వరలోనే విడుదల తేదిని ప్రకటించనుంది. చిరంజీవి సరసన కాజల్ హీరోయిన్‌గా నటిస్తుండగా, రామ్ చరణ్ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు.
With My dear director@jayam_mohanraja ❤️
— thaman S (@MusicThaman) October 3, 2021
Our dear Dop 🎥 #NiravShah 🤩
For Our #MegaStar’s ⭐️@KChiruTweets #Godfather ✍️
Jus loving this team of #Chiru153 #Godbless 💥 pic.twitter.com/Z1MX2QLdAt