అచ్చ తెలుగువాడైన విశాల్ కోలీవుడ్ లో చక్రం తిప్పుతున్నాడు. డిఫరెంట్ కాన్సెప్ట్ యాక్షన్ మూవీస్ చేస్తూ దూసుకుపోతున్నాడు. ఈ యేడాది అతను నటించిన ‘చక్ర’, ‘ఎనిమి’ చిత్రాలు విడుదలయ్యాయి. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న ‘సామాన్యుడు’ సినిమా వచ్చే యేడాది రిపబ్లిక్ డే కానుకగా జనవరి 26న విడుదల కాబోతోంది. దీనితో పాటు తన ‘డిటెక్టివ్’ మూవీకి సీక్వెల్ గా ‘డిటెక్టివ్ -2’ తీస్తూ, ఫస్ట్ టైమ్ మెగా ఫోన్ పట్టుకుంటున్నాడు విశాల్. అలానే ఎ.…
ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్ సి. తెరకెక్కించిన పలు చిత్రాలు తెలుగులో రీమేక్ అయ్యాయి. అలానే కొన్ని సినిమాలు అనువదించబడ్డాయి. అలా ఆయన రూపొందించిన హారర్ మూవీ 2014లో ‘అరణ్మనై’ను తెలుగులో ‘చంద్రకళ’ పేరుతో డబ్ చేశారు. దానికి సీక్వెల్ గా సుందర్ సి. తెరకెక్కించిన ‘అరణ్మనై -2’ కూడా ‘కళావతి’ పేరుతో అనువాదమైంది. తాజాగా ఈ యేడాది అక్టోబర్ లో తమిళంలో విడుదలైన ‘అరణ్మనై -3’ సినిమాను ‘అంతఃపురం’ పేరుతో డబ్ అవుతోంది. ఆర్య, రాశిఖన్నా,…
చిత్ర పరిశ్రమలో నటీనటులు, క్యారెక్టర్ ఆర్టిస్టులలాగే ఎంతోమంది చైల్డ్ ఆర్టిస్టులు ఉన్నారు. చైల్డ్ ఆర్టిస్టులుగా కెరీర్ ను ప్రారంభించి తరువాత ఇండస్ట్రీలో హీరోలుగా, హీరోయిన్లుగా నిలదొక్కుకున్న స్టార్స్ చాలామందే ఉన్నారు. అయితే కొన్నిసార్లు సినిమాలు లేదా సీరియల్స్ చేయడం వల్ల చైల్డ్ ఆర్టిస్టుల చదువుకు ఆటంకం కలుగుతుంది. పైగా వారికి ఆర్థికంగా కూడా ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంటుంది. అందుకే వారి సమస్యలపై దృష్టి పెట్టిన తెలంగాణ కార్మిక శాఖ తాజాగా సినిమా పరిశ్రమకు కొన్ని నిబంధనలు…
గత కొన్ని రోజులుగా టిక్కెట్ ధరలకు సంబంధించి ప్రభుత్వ జారీ చేసిన జీవోపై తెలుగు పరిశ్రమలో రచ్చ జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ వివాదం వల్ల టాలీవుడ్ వర్సెస్ ఏపీ ప్రభుత్వం అన్నట్టుగా మారింది పరిస్థితి. ఈ నేపథ్యంలో కొంతమంది నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు కలిసి టికెట్ ధరలపై ప్రభుత్వం తీసుకొచ్చిన జీవోను రద్దు చేయాలని కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై నిన్న ఆంధ్రప్రదేశ్ హైకోర్టు తీర్పును ఇచ్చింది. ఏపీ టికెట్ రేట్లపై ప్రభుత్వం…
నాని ద్విపాత్రాభినయం చేస్తున్న సినిమా శ్యామ్ సింగరాయ్. ఈ మూవీ డిసెంబర్ 24 వ తేదీన రిలీజ్ కాబోతున్నది. ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్న సంగతి తెలిసిందే. రాహుల్ సాంకృత్యన్ దర్శకత్వం వహించిన ఈ మూవీలో సాయిపల్లవి, సెబాస్టియన్ మడోన్నాలు హీరోయిన్లు. ఈ సినిమా ట్రైలర్ కొద్ది సేపటి క్రితమే రిలీజ్ చేశారు. శ్యామ్ సింగరాయ్‌గా నాని ఒదిగిపోయి నటించారు. రెండు పాత్రలు దేనికదే డిఫరెంట్ షేడ్స్ అని చెప్పాలి. Read: మనోహరమైన ఈ టీ…
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకి సర్జరీ జరిగింది… ప్రస్తుతం ఆయన దుబాయ్‌లో రెస్ట్ తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది.. అయితే, మహేష్ ఆరోగ్యంపై గత కొంతకాలంగో సోషల్ మీడియాలో ఓ వార్త హల్ చల్ చేసింది… మోకాలికి సర్జరీ నిమిత్తం ఆయన విదేశాలకు వెళ్తారని ప్రచారం సాగింది.. తన తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’ షూటింగ్ సమయంలో.. మహేష్ మోకాలికి చిన్న గాయం అయినట్టుగా తెలుస్తోంది.. తీవ్రమైన నొప్పితో బాధపడుతోన్న మహేష్.. వైద్యులను సంప్రదించగా.. సర్జరీ అవసరమని…
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ చేసిన రచ్చ ఇప్పుడు టాలీవుడ్లో హాట్ టాపిక్‌గా మారిపోయింది… అయితే, ఈ ఘటనపై సోషల్ మీడియా వేదికగా స్పందించారు బన్నీ.. మరోసారి ఇలాంటి ఘటనలు జరగకుండా చూసుకుంటాను అని పేర్కొన్నారు.. కాగా, అల్లు అర్జున్‌తో ఫొటోలు దిగే అవకాశం వచ్చింది.. ఈ అవకాశాన్ని వదులుకోకండి అంటూ… సోషల్ మీడియాలో ఓ పోస్ట్ వైరల్‌గా మారిపోవడంతో.. బన్నీ ఫ్యాన్స్ పెద్ద ఎత్తున హైదరాబాద్ లోని గీతా ఆర్ట్స్ కార్యాలయానికి తరలివచ్చారు.. క్యూలైన్లో…
(డిసెంబర్ 14న ఆది పినిశెట్టి బర్త్ డే)ఆరడుగులకు పైగా ఎత్తు, చక్కని శరీరసౌష్టవం- అటు ప్రతినాయకునిగానైనా అలరించగల నేర్పు, ఇటు కథానాయకునిగానూ మెప్పించగల ఓర్పు రెండూ ఉన్నాయి ఆది పినిశెట్టిలో. చూడగానే ఇట్టే ఆకట్టుకొనే రూపంతో ఆది పినిశెట్టి తనకు లభించిన పాత్రలకు న్యాయం చేసుకుంటూ సాగుతున్నారు. ఆది తండ్రి రవిరాజా పినిశెట్టి దర్శకునిగా తనదైన బాణీ పలికించారు. ఆది మాత్రం నటునిగా తనకంటూ ఓ ప్రత్యేకతను సంపాదించుకున్నారు. ఇప్పటికే పలు చిత్రాలలో విలక్షణమైన పాత్రల్లో సలక్షణంగా…
(డిసెంబర్ 14న రానా దగ్గుబాటి పుట్టినరోజు)కాలం కలసి వస్తే – జాలం భలేగా ఉంటుందని అంటారు. స్టార్ ప్రొడ్యూసర్ డి.రామానాయుడు ఇంట జూనియర్ రామానాయుడుగా జన్మించిన రానా అలాంటి లక్కీ మేన్ అని చెప్పవచ్చు. దగ్గుబాటి నట కుటుంబంలో మూడో తరానికి చెందిన వారు రానా. తాత రామానాయుడు కొన్ని చిత్రాలలో నటునిగా కనిపించగా, బాబాయ్ వెంకటేశ్ స్టార్ హీరోగా అలరించారు. వారి బాటలోనే రానా కూడా నటనలో అడుగు పెట్టి అనతికాలంలోనే తనదైన బాణీ పలికించారు.…