యంగ్ హీరో అడివి శేష్ టాలీవుడ్ లో విభిన్న సినిమాలతో ప్రత్యేకతను చాటుకున్న నటులలో ఒకరు. క్షణం, గూడాచారి వంటి సినిమాలతో పరిమిత బడ్జెట్‌తోనే హిట్ కొట్టి మంచి గుర్తింపు దక్కించుకున్నాడు. అయితే తాజాగా ఈ యంగ్ హీరోకు గోల్డెన్ ఛాన్స్ వచ్చినట్టు తెలుస్తోంది. ఇటీవల మీడియాతో ఇంటరాక్ట్ అయిన శేష్ తన నెక్స్ట్ ప్రాజెక్ట్‌ల గురించి మాట్లాడుతూ తనకు బాలీవుడ్ సినిమాల్లో ఆఫర్ వచ్చిందని స్వయంగా వెల్లడించాడు. “నేను నా నెక్స్ట్ రెండు హిందీ చిత్రాలకు…
తెలుగు చిత్రసీమలో ఓ హీరోతో ఓ దర్శకుడు మూడు వరుస విజయాలు చూసి హ్యాట్రిక్ సాధించడం అన్నది కొత్తేమీ కాదు. అయితే ఓ హీరోతో ఓ దర్శకుడు రన్నింగ్ లో కానీ, వసూళ్ళలో కానీ వరుసగా మూడు చిత్రాలతో రికార్డులు సృష్టించడం అన్నది ఆషామాషీ వ్యవహారం కాదు. అలాంటి అరుదైన రికార్డులను నటసింహ నందమూరి బాలకృష్ణతో ఇప్పటి వరకు కోడి రామకృష్ణ, బి.గోపాల్ సాధించారు. వారిద్దరి సరసన ఇప్పుడు బోయపాటి శ్రీను కూడా చేరిపోయారు. ఈ ముగ్గురు…
అనారోగ్యంతో కన్నుమూసిన ప్రముఖ సినీ గేయరచయిత, మానవతావాది సిరివెన్నెల సీతారామశాస్త్రి లేని లోటు తీర్చలేనిదన్నారు బీజేపీ నేత, ఎమ్మెల్సీ మాధవ్. ఆయనకు తగిన గుర్తింపు లభించలేదని, మరిన్ని అవార్డులు ఆయనకు లభించాలన్నారు మాధవ్. ఆయనతో తమ కుటుంబానికి వున్న అనుబంధాన్ని మాధవ్ గుర్తుచేసుకున్నారు. తన తండ్రికి ఆయన ఎంతో సన్నిహితులు అన్నారు. సినీ ప్రస్థానానికి రాకముందే సమాజాన్ని మరింతగా చైతన్య పరిచారన్నారు. ప్రజల్ని అలరించడమే కాదు సామాజిక బాధ్యత ఆయన రచనల్లో వుండేదన్నారు. ఆయన సామాజికంగా, రాజకీయంగా,…
తెలుగు దిగ్గజం సిరివెన్నెల నేలకొరిగిన విషయం తెలిసిందే. ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో న్యుమోనియాకు చికిత్స పొందుతూ నవంబర్ 30న సిరివెన్నెల సీతారామశాస్త్రి కన్నుమూశారు. ఈరోజు ఉదయం ఆయన పార్థివదేహాన్ని ఆసుపత్రి నుంచి ఫిల్మ్ ఛాంబర్ కు తరలించారు. ఉదయం నుంచి ఇప్పటి వరకూ ప్రారంభమైన సిరివెన్నెల అంతియయాత్రకు సర్వం సిద్ధమైంది. ఫిల్మ్ ఛాంబర్ నుండి మహా ప్రస్థానం వరకు సిరివెన్నెల అంతిమయాత్ర కొనసాగనుంది. Read Also : సిరివెన్నెలకు చివరి నివాళి… ఇండస్ట్రీ కన్నీటి పర్యంతం జూబ్లీహిల్స్…
ఇండస్ట్రీలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు తెలుగు ప్రేక్షకులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. చాలా తక్కువ వ్యవధిలోనే శివశంకర్ మాస్టర్, లెజెండరీ లిరిసిస్ట్ సిరివెన్నెల సీతారామశాస్త్రిని పోగొట్టుకుంది ఇండస్ట్రీ. ఈ విషాదాల నుంచి ఇంకా తేరుకోకముందే మరో టాలీవుడ్ యంగ్ హీరో ఇంట్లో విషాదం చోటు చేసుకుంది. హీరో అబ్బవరం కిరణ్ సోదరుడు రామాంజులు రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్టు తాజా సమాచారం. కడప జిల్లా చెన్నూరు వద్ద రోడ్డు ప్రమాదం జరగగా, తీవ్రంగా గాయపడిన…
హైదరాబాద్: టాలీవుడ్ లెజెండరీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మంగళవారం సాయంత్రం కన్నుమూశారు. అభిమానుల సందర్శనార్థం ఆయన పార్థివదేహాన్ని ఫిలింఛాంబర్లో ఉంచారు. ఆయనకు తుది నివాళులు అర్పించడానికి పలువురు సినీ ప్రముఖులు ఫిలింఛాంబర్‌కు తరలివస్తున్నారు. బుధవారం ఉదయం సిరివెన్నెల పార్థివదేహాన్ని త్రివిక్రమ్, రాజమౌళి, కీరవాణి, విక్టరీ వెంకటేష్, సాయికుమార్, తనికెళ్ల భరణి, మణిశర్మ, టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్, ఎస్వీ కృష్ణారెడ్డి, మారుతి, మురళీమోహన్, నందినీరెడ్డి తదితరులు సందర్శించి నివాళులర్పించారు. తాజాగా హీరో నందమూరి బాలకృష్ణ కూడా సిరివెన్నెల…
టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటుచేసుకున్నాయి. నాలుగు రోజుల్లో ముగ్గురు ప్రముఖులు మృతి చెందడంతో టాలీవుడ్‌కు ఏమైందంటూ పలువురు చర్చించుకుంటున్నారు. నవంబర్ 27న ప్రముఖ డైరెక్టర్ కేఎస్ నాగేశ్వరరావు గుండెపోటుతో కన్నుమూశారు. ఒక్కరోజు గ్యాప్‌లో అంటే నవంబర్ 28న ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ కరోనా వల్ల ఊపిరితిత్తులు ఫెయిల్ కావడంతో హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. ఈ విషాదం నుంచి తేరుకోకముందే మరో రెండు రోజుల గ్యాప్‌లో నవంబర్ 30న దిగ్గజ…
సినిమాలో ఉన్న పాటలు బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌తో సహా ఒకే సంగీత దర్శకుడు కంపోజ్ చేయటం అన్నది అనాదిగా మన ఫిలిమ్ మేకర్స్ అనుసరస్తున్న విధానం. అప్పుడప్పుడు ఒకటి రెండు పాటలు వేరే సంగీత దర్శకుడితో చేయించినా నూటికి 99 శాతం మాత్రం ఒకే సంగీత దర్శకుడితో ప్రయాణం చేయటం మన దర్శకనిర్మాతలకు అలవాటైన విషయం. అయితే ఇప్పుడు ట్రెండ్ మారుతోంది. ప్రముఖ బాలీవుడ్ ఆడియో కంపెనీ టీసీరీస్ తాము నిర్మిస్తున్న సినిమాలలో పాటలను పలువురు సంగీత దర్శకులతో…
సిరివెన్నెల ఆరోగ్యంపై కిమ్స్ వైద్యులు హెల్త్ బులిటెన్‌ను విడుదల చేశారు. సిరివెన్నెల ప్రస్తుతం ఐసీయూలో ఉన్నారని, నిపుణులైన వైద్యులతో సిరివెన్నెల సీతారామశాస్త్రికి వైద్యం అందిస్తున్నామని కిమ్స్ వైద్యులు తెలిపారు. సిరివెన్నెల ఆరోగ్యపరిస్థితిపై ఎప్పటికప్పుడు వివరాలు వెల్లడిస్తామని వైద్యులు తెలియజేశారు. న్యూమోనియాతో బాధపడుతూ సిరివెన్నెల ఈనెల 24 వ తేదీన కిమ్స్ ఆసుపత్రిలో చేరారు. సిరివెన్నెల సినిమాలో సీతారామశాస్త్రి సిరివెన్నెల సీతారామశాస్త్రిగా ఫేమస్ అయ్యారు. సిరివెన్నెల త్వరగా కొలుకొని తిరిగి మంచి పాటలు రాయాలని తెలుగు చిత్రపరిశ్రమ…
మెగా హీరోల అభిమానులు అంటేనే సేవకు, స్వచ్ఛంద కార్యక్రమాలకు పెట్టింది పేరు. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించిన ‘RRR’ చిత్రం జనవరి 7 వ తేదీన ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతున్న సందర్భంగా రామ్ చరణ్ ట్రోఫీ – 2021′ పేరుతో క్లాసికల్ డాన్స్ ,వెస్టర్న్ డాన్స్, పాటల పోటీలు, సోలో యాక్టింగ్, షార్ట్ ఫిలిం మేకింగ్, బాడీ బిల్డింగ్ తదితర ఆరు విభాగాలలో డిసెంబర్ 9,10,11 తేదీలలో వైజాగ్ పబ్లిక్ లైబ్రరీ ఆడిటోరియం లో…