ఏపీలో మరో 30 థియేటర్లు సీజ్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఏపీలో టికెట్ రేట్ల ఇష్యూ హాట్ టాపిక్ గా మారిన విషయం తెలిసిందే. మరోవైపు థియేటర్ల మూత పర్వం కొనసాగుతోంది. సినిమా థియేటర్లలో తనిఖీలు ఇంకా పూర్తవ్వలేదు. ఆంధ్రాలో శుక్రవారం 30 హాళ్లు సీజ్ అయినట్టు సమాచారం. రాష్ట్రవ్యాప్తంగా సినిమా థియేటర్లలో రెవెన్యూ, పోలీసు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. నిబంధనలు ఉల్లంఘించారన్న కారణంతో ఇప్పటికే పలు పలుచోట్ల థియేటర్లను సీజ్ చేశారు. మరోవైపు టికెట్ల ధరలు అతి తక్కువగా ఉన్నందున థియేటర్లను తాత్కాలికంగా మూసివేస్తున్నట్లు కొన్ని చోట్ల బోర్డులు పెడుతున్నారు. మరోవైపు సినిమా థియేటర్ల తనిఖీలు పరంపర కొనసాగుతుంది.
రాష్ట్రవ్యాప్తంగా నిన్న కూడా సినిమా థియేటర్లలో తనిఖీలు కొనసాగాయి. నిబంధనలు అమలు చేయడం లేదన్న కారణాలతో శుక్రవారం రోజున పలు చోట్ల థియేటర్లు సీజ్ చేశారు. లోపాలపై థియేటర్ల యజమానులకు నోటీసులు జారీ చేశారు. విజయవాడ నగరంలోని అన్నపూర్ణ, శకుంతల, అప్సర థియేటర్లను జాయింట్ కలెక్టర్ మాధవీలత ఆకస్మికంగా తనిఖీ చేశారు. క్యాంటీన్ వద్ద ధరల పట్టికను పరిశీలించారు. నిబంధనలు పాటించడంలేదని… కృష్ణా జిల్లాలో 12 థియేటర్లను అధికారులు మూయించారు. టిక్కెట్ల ధరలు తగ్గించడంతో జిల్లాలో 18 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు. మొత్తం మీద జిల్లాలో 30 థియేటర్లు మూతపడ్డాయి.
Also Read
గుంటూరు జిల్లాలో 70 థియేటర్లను అధికారులు తనిఖీ చేశారు. 35 సినిమా హాళ్లకు నోటీసులు జారీ చేశారు. 15 సినిమాహాళ్ల మూసివేతకు ఆదేశాలు జారీ చేశారు. గుంటూరులోని శ్రీలక్ష్మి ధియేటర్‌ను సీజ్ చేశారు. అనుమతి లేకుండా శ్యాం సింగరాయ్ సినిమా బెనిఫిట్ షో వేసిన 4 థియేటర్లకు పది వేల రూపాయల చొప్పున జరిమానా విధించారు. బిఫామ్ రెన్యువల్ చేయని 25 ధియేటర్లకు జరిమానా విధించారు. చిలకలూరి పేటలో లైసెన్స్ రెన్యువల్ చేసుకొని కారణంగా రామకృష్ణ, శ్రీనివాస, విజయలక్ష్మి, వెంకటేశ్వర, కృష్ణ మహల్ థియేటర్లను అధికారులు సీజ్ చేశారు. నిబంధనలు పాటించని మరో 5 ఏసీ థియేటర్లకు.. ఒక్కొక్క దానికి 10 వేల చొప్పున జరిమానా విధించారు.
విశాఖలో థియేటర్లను జిల్లా కలెక్టర్ తనిఖీచేశారు. జగదాంబ థియేటర్‌లో.. త్రీడీ అద్దాల కోసం అదనంగా వసూలు చేస్తున్నారని ఫిర్యాదులు రావడంతో వివరణ కోరుతూ నోటీసు జారీ చేశారు. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు, భీమవరం, కొవ్వూరు, జంగారెడ్డిగూడెం, నల్లజర్ల, తణుకులోని థియెటర్లలో రెవెన్యూ, అగ్నిమాపకశాఖ అధికారులు సోదాలు చేశారు. తణుకులో 3 సినిమా హాళ్లను యజమానులు స్వచ్ఛందంగా మూసివేశారు.
ఒంగోలు సత్యం ధియోటర్‌ను కలెక్టర్ ప్రవీణ్‌కుమార్ తనిఖీ చేశారు. నిబంధనలు పాటించడం లేదంటూ ఫారం బి నోటిసుఇచ్చారు. జిల్లా వ్యాప్తంగా 29 థియేటర్లకు నోటీసులు ఇచ్చామని, వారం రోజుల్లో రెన్యూవల్ చేసుకోకుంటే సీజ్ చేస్తామని కలెక్టర్ తెలిపారు. కర్నూలులోని ఆనంద్ సినీ కాంప్లెక్స్ థియేటర్స్ కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు.
తాజావార్తలు
-
Story Board : తెలుగు రాష్ట్రాల్లో కమ్ముకొస్తున్న తాగునీటి కొరత
-
Akbaruddin Owaisi : వచ్చే ఎన్నికల్లో పోటీ చేయను.. ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ సంచలన వ్యాఖ్యలు
-
OTR: కౌన్ బనేగా ఎమ్మెల్సీ? ఆ లక్కీ లీడర్ ఎవరు?
-
Mad Sandhu: ప్రముఖ పంజాబీ ఇన్ఫ్లుయెన్సర్ దారుణహత్య.. నడిరోడ్డుపై కాల్చి చంపిన దుండగులు..
-
YS Jagan : రాయలసీమ హార్టికల్చర్‌పై చంద్రబాబువి అంకెల గారడీలు
ట్రెండింగ్
-
National Boyfriend Day: మీ ప్రేమను మరింత స్పెషల్‌గా మార్చే సింపుల్ టిప్స్.!
-
Viral: అదనపు ఆదాయం కోసం ఆటో కొన్న సాఫ్ట్వేర్ ఉద్యోగి.. చివరికి ఏం జరిగిందో తెలుసా..
-
India Playing 11: ఇద్దరు హైదరాబాద్ ఆటగాళ్లకు ఛాన్స్.. వెస్టిండీస్‌తో చివరి వన్డేకు భారత్ తుది జట్టు ఇదే!
-
India vs Pakistan Final: భారత్, పాకిస్థాన్ ఫైనల్.. మ్యాచ్ రద్దయితే గోల్డ్ మెడల్ ఎవరికి?.. కీలక రూల్ ఇదే!
-
Rajasthani Dal Baati: నోట్లో వేస్తే కరిగిపోయే నెయ్యి బాటీలు, ఘాటైన దాల్ కాంబినేషన్ ఇలా చేయండి..!